రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని సీపీఐ పార్టీ డిమాండ్ చేసింది.
కడప: రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని సీపీఐ పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణ నుంచి సీమాంధ్ర విడిపోతే రాయలసీమలో నూతన రాజధాని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. 1953 నుంచి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని, అత్యంత వెనుకబడిన ప్రాంతంగా కొనసాగుతోందని అన్నారు.
కృష్ణా నది నుంచి తమకు రావలసిన 130 టీఎంసీల నీరు రావడం లేదని వాపోయారు. మైనింగ్ సంబంధ పరిశ్రమలు, ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థలు, ఐటీ కారిడార్లు తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు.