956 తరువాత అత్యంత నష్టపోయింది రాయలసీమనే. కాబట్టి సీమలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయడం న్యాయం’’ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి అన్నారు.
హైదరాబాద్: ‘‘1956 తరువాత అత్యంత నష్టపోయింది రాయలసీమనే. కాబట్టి సీమలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయడం న్యాయం’’ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి అన్నారు. రిటైర్డ్ ఐజీ హనుమంతరెడ్డి, రిటైర్ట్ ఇన్‌కంట్యాక్స్ అధికారి జీఆర్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది సుధాకర్‌రెడ్డిలతో కలసి ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఈ ప్రాంతవాసులు రాజధానిని త్యా గం చేశారు. ఇప్పుడు మరలా రాష్ట్రం విడిపోయినందున.. నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయడం సముచితమన్నారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించినందునే తెలుగువారు రెండురాష్ట్రాలుగా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని, శ్రీబాగ్ ఒప్పందాన్ని సైతం ఉల్లంఘిస్తే మరో ఉద్యమం వచ్చే ప్రమాదముందని లక్ష్మణరెడ్డి హెచ్చరించారు.
‘రాజధాని’పై రేపు హైదరాబాద్‌లో సదస్సు..
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 6వ తేదీన మేధోమథన సదస్సు నిర్వహిస్తున్నట్లు లక్ష్మణరెడ్డి తెలిపారు. నాలుగు రాయలసీమ జిల్లాలతోపాటు ఏపీలోని అన్ని జిల్లాలకు చెందినవారిని సదస్సుకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.