దీక్ష విరమించిన రవీంద్రనాథ్ రెడ్డి | YSRCP MLA calls off fasting at vn palle | Sakshi
Sakshi News home page

దీక్ష విరమించిన రవీంద్రనాథ్ రెడ్డి

Published Thu, Mar 5 2015 4:39 PM | Last Updated on Tue, May 29 2018 2:28 PM

దీక్ష విరమించిన రవీంద్రనాథ్ రెడ్డి - Sakshi

దీక్ష విరమించిన రవీంద్రనాథ్ రెడ్డి

వీరపనాయనపల్లిలో గత ఐదు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి గురువారం విరమించారు.

కడప: వీరపనాయనపల్లిలో గత ఐదు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి గురువారం విరమించారు. భవిష్యత్తులో అసెంబ్లీ వేదికగా పోరాటాలు చేయాల్సి ఉన్నందున దీక్ష విరమించాలని అఖిలపక్ష నాయకులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. తొలుత ససేమిరా అన్నా.. చివరకు వారి ఒత్తిడి మేరకు, భవిష్యత్తు పోరాటాల దృష్ట్యా దీక్ష విరమణకు ఎట్టకేలకు రవీంద్రనాథ్ రెడ్డి అంగీకరించారు.

దాంతో వైఎస్ వివేకానందారెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. వైఎస్ఆర్ జిల్లాకు తాగు సాగు నీటి కోసం వీరపనాయనిపల్లిలో ఆయన ఐదు రోజుల క్రితం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే రవీంద్రనాథ్రెడ్డి దీక్షపై ప్రభుత్వం స్పందించకపోవడంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement