
పి.రవీంద్రనాథ్‌రెడ్డి(ఫైల్)
కడప: తాగు, సాగు నీటి సమస్యలు తీర్చాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేత, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. తమ నియోజకవర్గ ప్రజలు తాగు, సాగు నీటికి పడుతున్న ఇబ్బందులు చూసి ఆయన దీక్షకు దిగారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్య పరిష్కరించేవరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన చెప్పారు.
రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షకు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రఘురామి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, కడప మేయర్ సురేశ్ బాబు సంఘీభావం తెలిపారు.