కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది.
కడప: కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలన్న డిమాండ్‌తో వీరపునాయునిపల్లెలో ఆదివారం ఆయన నిరవధిక నిరహారదీక్ష చేపట్టారు.
రవీంద్రనాథ్‌రెడ్డి నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు నేడు పలువురు నాయకులు రానున్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు ఎం.వి మైసూరారెడ్డి, సీపీఐ నేత నారాయణ, కార్మిక నాయకుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి తదితరులు హాజరవుతారని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి తెలిపారు.