సబ్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆందోళన | Kamalapuram MLA Ravindranath Reddy protests infront of electrical power substation | Sakshi
Sakshi News home page

సబ్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆందోళన

Published Sun, Jun 15 2014 1:39 PM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM

విధి నిర్వహాణలో విద్యుత్ షాక్తో మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విధి నిర్వహాణలో విద్యుత్ షాక్తో మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కమలాపురం ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తూరు సబ్ స్టేషన్ ఎదుట రవీంద్రనాథ్ రెడ్డితోపాటు పార్టీ కార్యకర్తలు బైఠాయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగి మృతికి కారకుడైన ఏఈని సస్పెండ్ చేయాలిని నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పెండ్రి మర్రి మండలం కొత్తూరు సబ్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు.

 

అయితే అతడికి పరిహారం అందించే విషయంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. దాంతో మృతుడు కుటుంబం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని ఆశ్రయించింది. దాంతో ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. వారు సరైన రీతిలో స్పందించలేదు. దీంతో రవీంద్రనాథ్ రెడ్డి విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుటు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement