రైతు సమస్యలను పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆరోపించారు.
కడప: రైతు సమస్యలను పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. మంగళవారం వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ రవీంద్రనాథ్రెడ్డి ధర్నా నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలోకి దించుతోందని ఆయన విమర్శించారు.
వెంటనే కరువు సహాయం అందించి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతు సమస్యలను పరిష్కరించాలంటూ తహసీల్దార్కు రవీంద్రనాథ్రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.