contract employee died
-
విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి
హైదరాబాద్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఉసురుతీసింది. కనెక్షన్ ఇవ్వడానికి స్తంభం ఎక్కిన చిరుద్యోగి దానిపైనే ప్రాణాలు విడిచాడు. ఇందులో కుట్ర దాగి ఉందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ కింగ్‌కోఠి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్వాన్ ప్రాంతానికి చెందిన పోగుల భూమయ్య (42) విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగి. మంగళవారం కింగ్‌కోఠిలోని పర్దాగేట్ సమీపంలో ఓ దుకాణంలో కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు వెళ్ళాడు. 11 గంటల ప్రాంతంలో వి ద్యుత్ సరఫరా నిలిపేసి, స్తంభంపైకి ఎక్కి కనెక్షన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఒక్కసారిగా విద్యుత్ ప్రసరించడంతో షాక్‌కు గురయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు కిందికి దింపి స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే భూమయ్య మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నారాయణగూడ ఎస్సై దయాకర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భూమయ్య మరణించిన విషయం తెలుసుకున్న బంధువులు పెద్దసంఖ్యలో గాంధీ మార్చురీకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అధికారుల ప్రమేయం ఉంది భూమయ్య మృతి పట్ల తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. చైర్మన్ ఈశ్వరరావు, కన్వీనర్ నాగరాజ్‌లు మాట్లాడుతూ..ఒకే ఇంటికి రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉండటంతో కరెంట్ రిటర్న్ సరఫరా జరిగి భూమయ్య చనిపోయాడన్నారు. దీని వెనుక అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. తక్షణమే మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
కబళించిన కరెంట్ తీగ
స్తంభంపైనే కాంట్రాక్టు ఉద్యోగి మృతి నారాయణఖేడ్: విద్యుదాఘాతంతో ఓ విద్యుత్‌శాఖ కాంట్రాక్టు ఉద్యోగి మరణించారు. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం గంగాపూర్ శివారులో శనివారం రాత్రి జరిగింది. ఎస్ఐ నరేందర్ కథనం ప్రకారం.. మండలంలోని తుర్కవడ్‌గాం గ్రామానికి చెందిన విఠల్, నిర్మల దంపతుల కుమారుడు లడ్డ జనార్దన్ (22) ఐటీఐ పూర్తి చేశాడు. విద్యుత్‌శాఖలో కాంట్రాక్టు పద్ధతిన స్పాట్ బిల్లింగ్ చేసే విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ర్యాకల్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని గంగాపూర్ శివారులో 11 కేవీ లైన్ మరమ్మతుల విషయమై లైన్‌మన్ వెంకటయ్య.. జనార్దన్‌ను స్తంభం ఎక్కించి పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా జరిగి అతను అక్కడికక్కడే మరణించాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జనార్దన్ మరణించాడని గ్రామస్తులు ఆందోళన చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని మృతుడి కుటుంబానికి నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ వివరించారు. -
సబ్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆందోళన
విధి నిర్వహాణలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కమలాపురం ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తూరు సబ్ స్టేషన్ ఎదుట రవీంద్రనాథ్ రెడ్డితోపాటు పార్టీ కార్యకర్తలు బైఠాయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగి మృతికి కారకుడైన ఏఈని సస్పెండ్ చేయాలిని నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పెండ్రి మర్రి మండలం కొత్తూరు సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు. అయితే అతడికి పరిహారం అందించే విషయంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. దాంతో మృతుడు కుటుంబం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని ఆశ్రయించింది. దాంతో ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. వారు సరైన రీతిలో స్పందించలేదు. దీంతో రవీంద్రనాథ్ రెడ్డి విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుటు ఆందోళనకు దిగారు.