జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు
వైఎస్‌ఆర్ జిల్లా: జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కడప నుంచి వైఎస్ వివేకానందరెడ్డితో పాటు అన్నిస్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు ఖాయం అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సంచలనాలు సృష్టిస్తాయని అన్నారు.