'రాయలసీమ గురించి ప్రస్తావనే లేదు'
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పెదవి విరిచారు. గవర్నర్ తన ప్రసంగంలో టీడీపీ హామీలనే ప్రస్తావించారని అన్నారు. రాయలసీమ గురించి ప్రస్తావనే లేదని, ఆంధ్రప్రదేశ్ రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదని రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. వెనుకబడిన ప్రాంతాన్ని రాజధానిగా గుర్తిస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రహ్మణీ స్టీల్స్ గురించి కూడా గవర్నర్ మాట్లాడలేదని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. రైల్వే ఛార్జీల పెంపు దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.