విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి(పాత చిత్రం)
వైఎస్సార్ జిల్లా : పులివెందుల ప్రాంతాన్ని టీడీపీ అభివృద్ధి చేసిందని చెప్పుకోవడానికి టీడీపీకి సిగ్గు ఉండాలని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంజద్ బాషా, రవీంద్రనాధ్ రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు కడపలో విలేకరులతో మాట్లాడారు. పులివెందులను అభివృద్ధి ఎవరు చేశారనేది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని చెబుతారని వ్యాఖ్యానించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యం వల్లే పులివెందుల ప్రాంతానికి నీరు వచ్చిందన్నారు. 90 శాతం పనులను వైఎస్ హయాంలోనే పూర్తి చేస్తే కేవలం 10 శాతం పనులు చేసి సొంత డబ్బా కొట్టుకోవడం టీడీపీకి తగదన్నారు.
మంత్రి ఆదినారాయణ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆదినారాయణకు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత నేత వైఎస్సేనని చెప్పుకొచ్చారు. గండికోట ముంఫు బాధితులను అదుకోకుండా పులివెందులకు నీళ్లు ఇచ్చేశాం అని చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దళిత తేజం ద్వారా ఒక్క దళితునికైనా న్యాయం చేసారా అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాజీనామా చేసి కేంద్రంపై పోరాటం చేసింటే బాగుండేదని సూచించారు. చంద్రబాబును ప్రజలు నమ్ముకుంటే ఆయన వాళ్లను నట్టేటా ముంచారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానాన్నీ ఎదుర్కోలేని ప్రధాని మోదీ ఉపవాస దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment