
ఆర్టీసీ కార్మికులకు కరవు భత్యం
సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన 3.4 శాతం కరువు భత్యం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. మే నెల జీతంతో కలిపి చెల్లిం చేందుకు మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ సాంబశివరావును ఎన్‌ఎంయూ నేతలు మంగళవారం కలసి కార్మికుల సమస్యలపై చర్చించారు.