Drought allowance
-
ఆరు పంటలకు ‘మద్దతు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నలకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. 2025–26 మార్కెటింగ్ సీజన్‌కు గాను ఆరు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ) మరో 3 శాతం పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. గోధుమలు, ఆవాలు, మైసూరు పప్పు, శనగలు, పొద్దుతిరుగుడు గింజలు, బార్లీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు తెలిపారు. రబీ పంట సీజన్‌కు సంబం«ధించి నాన్–యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీ ఇస్తున్నట్లు వివరించారు. రైతుల ఆదాయం పెంచడమే ధ్యేయంగా ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’కు రూ.35 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు వివరించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెబ్లీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. నరేంద్ర మోదీ పాలనలో రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం పట్ల రైతన్నలు సానుకూలంగా ఉన్నారని వివరించారు. రూ.2,642 కోట్లతో చేపట్టనున్న వారణాసి–పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ(డీడీయూ) మల్టీ–ట్రాకింగ్ పాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వారణాసిలో గంగా నదిపై రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. కనీస మద్దతు ధర పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతాంగం సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి కానుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. వారికి కరువు భత్యం 3 శాతం పెంచుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దీనికారణంగా కేంద్ర ఖజానాపై రూ.9,448 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. డీఏ పెంపుతో దాదాపు కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏ 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచి్చంది. ప్రస్తుతం దేశంలో 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. -
Lok Sabha elections 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంపు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ), పెన్షనర్లకు కరువు సహాయాన్ని(డీఆర్) బేసిక్ పే/పెన్షన్‌పై మరో 4 శాతం పెంచింది. ప్రస్తుతం డీఏ/డీఆర్ 46 శాతం ఉంది. తాజా పెంపుతో ఇది 50 శాతానికి చేరింది. పెంచిన భత్యం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల కోటి మందికిపైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలియజేసింది. ఉద్యోగులకు డీఏ అదనపు వాయిదా సొమ్ము, పెన్షనర్లకు కరువు సహాయం(డీఆర్) సొమ్ము ఈ ఏడాది జనవరి 1 నుంచి చెల్లించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరలు పెరగడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏను 50 శాతానికి పెంచినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ పెంపు వల్ల ఖజానాపై ప్రతిఏటా రూ.12,869 కోట్ల భారం పడనుంది. 2024 జవవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రభుత్వం రూ.15,014 కోట్లు చెల్లించనుంది. డీఏ పెంపుతో ఉద్యోగులకు ఇతర భత్యాలు, గ్రాట్యుటీ సైతం పెరుగుతాయి. డీఏ/డీఆర్ కాకుండా ఇతర భత్యాల పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.9,400 కోట్ల భారం పడుతుంది. ఏడో కేంద్ర వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారమే డీఏ/డీఆర్‌ను కేంద్రం పెంచింది. ఉజ్వల రాయితీ గడువు పెంపు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లపై రూ.300 చొప్పున ఇస్తున్న రాయితీ గడువును కేంద్రం మరో ఏడాది పెంచింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చి 31న ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రతిఏటా 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. ముడి జనపనారకు మరో రూ.285 ముడి జనపనారకు కనీస మద్దతు ధరను కేంద్రం మరో రూ.285 పెంచింది. దీనివల్ల క్వింటాల్ ముడి జనపనార ధర రూ.5,335కు చేరుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ కనీస మద్దతు ధర వర్తిస్తుంది. రూ.10,037 కోట్లతో ‘ఉన్నతి’ ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం ‘ఉన్నతి’కి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ పథకం రూ.10,037 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించే పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. 2034 మార్చి 31 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. రూ.10,372 కోట్లతో కృత్రిమ మేధ ఐదేళ్ల పాటు అమలు చేసే ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మిషన్‌కు ప్రభుత్వం రూ.10,373 కోట్లు కేటాయించింది. ఈ మిషన్‌లో భాగంగా 10,000 జీపీయూ సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీని అందుబాటులోకి తీసుకొస్తారు. -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు... 4% డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక లభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలోని 41.85 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది ఫించనుదారులకు లబ్ధి చేకూరుతుంది. మూల వేతనంపై 34శాతంగా ఉన్న డీఏకి అదనంగా 4% పెంచడంతో 38శాతానికి చేరుకుంది. ఈ పెంపుతో ఖజానాపై ఏడాదికి 12.852 కోట్ల అదనపు భారం పడుతుంది. మరో మూడు నెలలు ఉచితంగా రేషన్ కరోనా సంక్షోభ సమయంలో లాక్డౌన్లతో ఉపాధి కోల్పోయిన నిరుపేదల్ని ఆదుకోవడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పేరుతో ఉచితంగా ఇచ్చే రేషన్ పథకం ఈ శుక్రవారంతో ముగిసిపోనుంది. ధరల భారం, పండుగ సీజన్ వస్తూ ఉండడంతో మరో మూడు నెలలు ఉచితంగా రేషన్ అందించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎంజీకేఏవై కింద ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు కొనసాగించాలని నిర్ణయించింది. వివరాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు గరీబ్ కళ్యాణ్ అన్న యోచన పథకం కింద నిరుపేదలు ఒక్కొక్కరికి ప్రతీ నెల 5 కేజీల బియ్యం, గోధుమలు ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ పథకాన్ని పొడిగించడంతో కేంద్రానికి అదనంగా రూ.44,762 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతీ నెల 80 కోట్ల మంది ఉచిత రేషన్‌ని తీసుకుంటున్నారు. రైల్వేల అభివృద్ధికి రూ.10వేల కోట్లు రైల్వేల అభివృద్ధి ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయింది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం రైల్వే చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ 2.5 నుంచి మూడున్నరేళ్లలో పూర్తి చేయనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. -
Andhra Pradesh: ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలోనూ శుభవార్త అందించింది. జులై 2019 నుంచి చెల్లించాల్సిన కరువు భత్యాన్ని (డీఏ) మంజూరు చేసింది. ఉద్యోగుల మూల వేతనంలో ప్రస్తుతమున్న 33.536 శాతం నుంచి 38.776 శాతానికి (5.24) కరువు భత్యం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ► 2019 జులై నుంచి 2021 డిసెంబర్ వరకు కరువు భత్యం బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమచేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ► పెరిగిన కరువు భత్యాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1వ తేదీ వేతనాలతో చెల్లిస్తారు. ► అలాగే, సీపీఎస్ ఉద్యోగులకు పెరిగిన డీఏని వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1వ తేదీ వేతనాల నుంచి చెల్లిస్తారు. ► సీపీఎస్ ఉద్యోగులకు 2019 జులై నుంచి 2021 డిసెంబర్ వరకు డీఏ బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో నగదు రూపంలో చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎవరెవరికి వర్తిస్తుందంటే.. పెరిగిన కరువు భత్యం జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, జిల్లా గ్రంధాలయాల సమితి, రెగ్యులర్ స్కేల్స్‌లో పనిచేస్తున్న వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులకు వర్తించనుంది. అంతేకాక.. రెగ్యులర్ పే స్కేల్స్‌లో పనిచేస్తున్న ఎయిడెడ్ ఇనిస్టిట్యూషన్స్, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు వర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలతో పాటు వ్యవసాయ యూనివర్శిటీ.. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్శిటీలో రెగ్యులర్ పే స్కేల్స్‌లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికీ పెరిగిన కరువు భత్యం వర్తించనుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల డీఏకు సొంత నిధులను వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం 2019 జులై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరువు భత్యం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేయడంపట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కే వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇప్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
దీపావళి కానుక.. 3 శాతం డీఏ పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛనుదారులకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) ప్రకటించింది. జూలై 1, 2021 నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ, పింఛనర్లకు మూడు శాతం డీఆర్ ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. డీఏ, డీఆర్ వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70 కోట్లు భారం పడనుంది. 47.14 లక్షల కేంద్ర ఉద్యోగులు, 68.62 లక్షల పింఛనర్లు లబ్ధి పొందనున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది కరువు భత్యం నిలిపివేసిన విషయం విదితమే. ఈ ఏడాది జూలైలో పునరుద్ధరిస్తూ 17% నుంచి 28 శాతానికి పెంచారు. తాజా పెంపుతో అది 31 శాతానికి చేరుకుంది. మూడంచెల పర్యవేక్షణ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) అమలుకు మార్గం సుగమమైంది. గురువారం భేటీ అయిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) రూ.100 లక్షల కోట్ల విలువైన పీఎం గతిశక్తికి ఆమోదం తెలిపింది. మూడంచెల పద్ధతిలో దీన్ని పర్యవేక్షించనున్నట్లు కేంద్రం పేర్కొంది. పీఎం గతిశక్తి మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలో అంతర్ మంత్రిత్వశాఖల సహకారంతో పాటు అంతర్ విభాగాల సహకారం ఓ గేమ్ చేంజర్ కానుందని తెలిపింది. పీఎం గతిశక్తి ని ప్రధాని 13న ప్రారంభించారు. రాబోయే పాతికేళ్ల అభివృద్ధికి ఈ ప్రణాళికతో పునాది వేస్తున్నట్లు చెప్పారు. -
కేంద్ర ఉద్యోగులకు 28% డీఏ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ), పెన్షనర్లకు కరువు ఉపశమనం(డీఆర్) 28 శాతానికి పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం ప్రస్తుతం మూలవేతనంపై 17 శాతంగా ఉన్న డీఏను మరో 11 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ వెల్లడించారు. దీనివల్ల కేంద్రంపై అదనంగా రూ.34,401 కోట్ల ఆర్థిక భారం పడనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని చెప్పారు. కాగా, 2020 జనవరి 1, 2020 జులై 1, 2021 జనవరి 1 తేదీల్లో చెల్లించాల్సిన మూడు అదనపు డీఏ, డీఆర్ వాయిదాలను.. కోవిడ్–91 మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 మధ్య గల కాలానికి డీఏ, డీఆర్ 17 శాతంగానే ఉంటుందని కేంద్రం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ఆయుష్ మిషన్’ ఐదేళ్లపాటు పొడిగింపు నేషనల్ ఆయుష్ మిషన్(నామ్)ను కేంద్ర ప్రాయోజిత పథకంగా 2021 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకూ కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.4,607.30 కోట్ల వ్యయం కానుంది. ఇందులో కేంద్రం వాటా రూ.3,000 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.1,607 కోట్లుగా ఉంటుంది. నేషనల్ ఆయుష్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబరు 15న ప్రారంభించింది. అర్హులందరికీ వైద్య సేవలు అందేలా చూడడం, ఔషధాలు, మానవ వనరుల లభ్యత పెరిగేలా చూడడం, ఆయుష్ విద్యా సంస్థల సంఖ్యను పెంచడం వంటివి ఆయుష్ మిషన్ లక్ష్యాలు. కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు ∙న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.9,000 కోట్లతో కేంద్ర ప్రాయోజిత పథకం కొనసాగింపు ప్రతిపాదనలకు ఆమోదం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా ఐదేళ్లపాటు ఇది అమలవుతుంది. ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ కాలపరిమితి మరో ఆరు నెలల పాటు.. అంటే జనవరి 31 వరకు పొడిగింపు. నార్త్ ఈస్ట్రన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ సంస్థ పేరు ఇకపై నార్త్ ఈస్ట్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఫోక్ మెడిసిన్ రీసెర్చ్‌గా మార్పు. ప్రత్యేక పశు సంవర్థక ప్యాకేజీ అమలుకు ఆమోదం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మార్పులు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక పశు సంవర్థక ప్యాకేజీ అమలు చేయాలని తీర్మానించింది. పశు సంవర్థక రంగం వృద్ధితోపాటు ఈ రంగంలో ఉన్న 10 కోట్ల మంది రైతులకు మెరుగైన ప్రతిఫలం దక్కేలా ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్యాకేజీ కింద కేంద్రం రూ.9,800 కోట్ల మేర ఆర్థిక సాయం అందించనుంది. మొత్తంగా రూ.54,618 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తోంది. వివిధ విభాగాలను రాష్ట్రీయ గోకుల్ మిషన్, జాతీయ పాడి అభివృద్ధి కార్యక్రమం(ఎన్పీడీడీ), జాతీయ పశు సంపద మిషన్‌గా విభజించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ దేశీయ జాతుల అభివృద్ధి, పరిరక్షణకు సహాయపడుతుంది. ఎన్పీడీడీ పథకం సుమారు 8,990 బల్క్ మిల్క్ కూలర్స్ ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తోంది. -
డీఏ నిలుపుదలకు ఇది సమయం కాదు
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇటీవల పెంచిన కరువు భత్యాన్ని (డీఏ) కేంద్ర ప్రభుత్వం నిలిపివేడయంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. ప్రస్తుత సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏను నిలిపివేయడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ దళాలపై భారం వేయడం తగదన్నారు. కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2021 జూలై వరకు పెంచిన కరువుభత్యం(డీఏ) చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రభావం 50 లక్షల మంది ఉద్యోగులతోపాటు 61 లక్షల మంది పింఛనుదారులపై పడనుంది. ‘కోవిడ్–19తో ఉత్పన్నమైన సంక్షోభం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర పింఛనుదారులకు 2020 జనవరి 1వ తేదీ నుంచి చెల్లించాల్సిన అదనపు వాయిదా డీఏను 2021 జూన్ 30 వరకు నిలిపివేయాలని నిర్ణయించడమైంది’ అని ఆర్థిక శాఖ తెలిపింది. అయితే, ప్రస్తుతం ఉన్న 17 శాతం డీఏను యథాప్రకారం చెల్లిస్తామని పేర్కొంది. దీంతో 2020 జూలై 1వ తేదీ, 2021 జనవరి 1వ తేదీల్లో ఇవ్వాల్సిన డీఏ బకాయిల చెల్లింపులు నిలిచిపోనున్నాయి. కేంద్ర ఉద్యోగులకు 4 శాతం, పింఛనుదారులకు 21 శాతం మేర డీఏను పెంచేందుకు గత నెలలో కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ, ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులతో ఆ నిర్ణయం అమలు ఆగిపోనుంది. డీఏను 2021 జూలై 1వ తేదీ నుంచి డీఏ పెంపుదలను వర్తింపజేస్తామని ఆర్థిక శాఖ వ్యయ విభాగం స్పష్టత నిచ్చింది. డీఏ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసే అవకాశముంది. ఆర్థిక శాఖ ఉత్తర్వుల ఫలితంగా.. కేంద్రానికి రూ.37,530 కోట్లు, రాష్ట్రాలకు 82,566 కోట్లు కలిపి సుమారు రూ.1.20 లక్షల కోట్లు ఆదా కానున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ద్రవ్యోల్బణం ఆధారంగా ఏడాదిలో రెండుసార్లు సవరిస్తారు. ఆర్థిక శాఖ నిర్ణయంతో మిగిలిన మొత్తాన్ని కోవిడ్‌పై పోరాటానికి మళ్లించేందుకు వీలు కలుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్‌పై పోరుకు గాను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, గవర్నర్ల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఆదా అయిన మొత్తం భారత ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ అవుతుంది. ఈ నిధులను ఆరోగ్య సేవల నిర్వహణకు, కరోనాపై పోరుకు వాడతారు. -
కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు నిలిపివేత
న్యూఢిల్లీ: కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2021 జూలై వరకు పెంచిన కరువుభత్యం(డీఏ) చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రభావం 50 లక్షల మంది ఉద్యోగులతోపాటు 61 లక్షల మంది పింఛనుదారులపై పడనుంది. ‘కోవిడ్–19తో ఉత్పన్నమైన సంక్షోభం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర పింఛనుదారులకు 2020 జనవరి 1వ తేదీ నుంచి చెల్లించాల్సిన అదనపు వాయిదా డీఏను 2021 జూన్ 30 వరకు నిలిపివేయాలని నిర్ణయించడమైంది’ అని ఆర్థిక శాఖ తెలిపింది. అయితే, ప్రస్తుతం ఉన్న 17 శాతం డీఏను యథాప్రకారం చెల్లిస్తామని పేర్కొంది. దీంతో 2020 జూలై 1వ తేదీ, 2021 జనవరి 1వ తేదీల్లో ఇవ్వాల్సిన డీఏ బకాయిల చెల్లింపులు నిలిచిపోనున్నాయి. కేంద్ర ఉద్యోగులకు 4 శాతం, పింఛనుదారులకు 21 శాతం మేర డీఏను పెంచేందుకు గత నెలలో కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ, ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులతో ఆ నిర్ణయం అమలు ఆగిపోనుంది. డీఏను 2021 జూలై 1వ తేదీ నుంచి డీఏ పెంపుదలను వర్తింపజేస్తామని ఆర్థిక శాఖ వ్యయ విభాగం స్పష్టత నిచ్చింది. డీఏ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసే అవకాశముంది. ఆర్థిక శాఖ ఉత్తర్వుల ఫలితంగా.. కేంద్రానికి రూ.37,530 కోట్లు, రాష్ట్రాలకు 82,566 కోట్లు కలిపి సుమారు రూ.1.20 లక్షల కోట్లు ఆదా కానున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ద్రవ్యోల్బణం ఆధారంగా ఏడాదిలో రెండుసార్లు సవరిస్తారు. ఆర్థిక శాఖ నిర్ణయంతో మిగిలిన మొత్తాన్ని కోవిడ్‌పై పోరాటానికి మళ్లించేందుకు వీలు కలుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్‌పై పోరుకు గాను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, గవర్నర్ల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఆదా అయిన మొత్తం భారత ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ అవుతుంది. ఈ నిధులను ఆరోగ్య సేవల నిర్వహణకు, కరోనాపై పోరుకు వాడతారు. -
ఇప్పుడు జీతాల కోసం
సాక్షి, అమరావతి: కరువు భత్యం(డీఏ), పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) బకాయిల కోసం ఇప్పటికే చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లపై మరో బండ పడింది. డీఏ, పీఆర్సీ బకాయిల సంగతేమో గానీ నెలవారీగా అందాల్సిన వేతనాలు, పింఛన్లు సైతం రాక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా అమల్లోకి తీసుకొచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్) దారుణంగా విఫలమైంది. ఏప్రిల్ వచ్చి 25 రోజులు గడిచినా మార్చి నెల వేతనాలు, పింఛన్లు ఇప్పటికీ రాలేదని లక్షలాది మంచి ఉద్యోగులు, పెన్షనర్లు గగ్గోలు పెడుతున్నారు. గడచిన నెల వేతనాలను మరుసటి నెల ఒకటో తేదీకల్లా చెల్లించాల్సి ఉంది. దశాబ్దాలుగా ఇదే విధానం అమలవుతోంది. కానీ, మార్చి నెల వేతనాలు, పింఛన్లు ఏప్రిల్ నెల 10వ తేదీ నాటికి 50 శాతం మందికి కూడా అందలేదు. ఏప్రిల్ 15 తేదీ నాటికి 40 శాతం మందికి రాలేదు. ఇప్పటికీ 20 శాతం మందికి వేతనాలు, పింఛన్లు రాకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ తలెత్తలేని ఉద్యోగులు, పెన్షనర్లు మండిపడుతున్నారు. డీఏ, పీఆర్సీ బకాయిల సంగతేంటి? రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే రెండు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2017 జూలై ఒకటో తేదీ నుంచి ఒక డీఏ, 2018 జనవరి నుంచి మరో డీఏను బకాయిలతో సహా ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. పెన్షనర్లకు కూడా రెండు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన పదో పీఆర్సీ బకాయిలు రూ.4,500 కోట్లు ఇవ్వడానికి నాలుగేళ్లు గడిచినా ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఆగిపోయిన బిల్లులు సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడంతో వేతనాలు, పింఛన్లతోపాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల బిల్లుల చెల్లింపులు సైతం ఆగిపోయాయి. అప్పు చేసి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన సొమ్ముకు సంబంధించిన చెక్కులు చెల్లుబాటు కావడం లేదు. మార్చి నెలలో జారీ చేసిన పది వేలపైగా చెక్కులను బ్యాంకులు తిరస్కరించాయి. నెల రోజుల నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కుల జారీ ప్రక్రియను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన బిల్లుల సమర్పణ, చెల్లింపులు కూడా ఆగిపోయాయి. వేతనాలు అందని విభాగాలు ఎయిడెడ్ విద్యాసంస్థల ఉద్యోగులతోపాటు ఇరిగేషన్, రహదారులు–భవనాలు, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లోని పలువురు ఉద్యోగులకు మార్చి నెల వేతనం ఇంకా రాలేదు. మార్చి, ఏప్రిల్ నెలలకు కలిపి ఒక్కో ఉద్యోగికి రూ.75 వేల చొప్పున అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఈ అడ్వాన్స్ సరిపోదని, నెలకు ఒక్కో ఉద్యోగికి రూ.50 వేల వేతనం ఉన్నందున, మిగతా మొత్తాన్ని కూడా ఇప్పించాలని వర్క్ చార్జెడ్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు ఆర్థిక శాఖను కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. చిరుద్యోగులు ఎలా బతకాలి? 25వ తేదీ వచ్చినా ప్రభుత్వం వేతనం ఇవ్వకపోతే తాము ఎలా బతకాలని చిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘‘మొదటి వారం దాటితే ఇంటి యజమానులు అద్దె ఇవ్వాలని అడుగుతారు. పాల బిల్లు, కరెంటు బిల్లు, పిల్లలకు స్కూలు ఫీజులు ఠంచనుగా చెల్లించాల్సిందే. కిరాణా సరుకులు కొనుక్కోవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? పైపెచ్చు ఆర్థిక సంవత్సరం చివరి నెలలు కావడంతో వేతనంలో కోత పడకుండా ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటివి కట్టాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి ఉద్యోగికి ఏప్రిల్ చాలా కీలకం. ఈ నెలలోనే వేతనం ఇవ్వకపోవడం దారుణం’’ అని ఉద్యోగ సంఘం నాయకుడొకరు విమర్శించారు. అక్కరకు రాని సీఎఫ్ఎంఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎఫ్ఎంఎస్ ఏర్పాటుకు 2013లో ఎన్ఐఐటీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా ఆ సంస్థకు రెండు దశల్లో రూ.100 కోట్లకుపైగా చెల్లించారు. ఎన్ఐఐటీ కోసం తొలుత రూ.60 కోట్లతో సూపర్ కంప్యూటర్లను కొనుగోలు చేశారు. ఆ సంస్థ ప్రతినిధులు మూడేళ్ల పాటు సాఫ్ట్వేర్, డేటా డెవలప్మెంట్ పేరిట కాలయాపన చేశారు. సాఫ్ట్వేర్ రూపకల్పనలో విఫలమైన ఎన్ఐఐటీని ప్రభుత్వం పక్కకు తప్పించింది. అనంతరం ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్ వాటా కింద గతేడాది ఫిబ్రవరి 23న రూ.41.99 కోట్లు చెల్లించారు. విఫలమైన సంస్థకు నిధులు చెల్లించడానికి కారణం.. ఆ సంస్థ ప్రతినిధి ‘ముఖ్య’నేతకు సన్నిహితుడు కావడమే. తరువాత ఎస్ఏపీ ప్లాట్‌ఫాంపై సాఫ్ట్వేర్, డేటా డెవలప్మెంట్కు రూ.46.23 కోట్లు ఖర్చుచేశారు. అనంతరం సేవల కోసం అంటూ వివిధ దశల్లో 12 జీవోల ద్వారా రూ.38.19 కోట్లు చెల్లించారు. అంతా సిద్ధమైందని, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సీఎఫ్ఎంఎస్ ద్వారానే ఆర్థిక కార్యకలాపాలు, బిల్లుల సమర్పణ, చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను ముఖ్యమంత్రి ఇటీవలే అట్టహాసంగా ప్రారంభించారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 24 రోజులు దాటినప్పటికీ కొత్త వ్యవస్థ ద్వారా బిల్లుల సమర్పణ, చెల్లింపులు సక్రమంగా జరగడం లేదు. ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పింఛన్లు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. దీనికి కారణం సాఫ్ట్‌వేర్‌లో లోపాలు తలెత్తడంతోపాటు ట్రెజరీల్లోని సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకపోవడమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
శాతానికి పెరిగిన డీఏ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం (డీఏ), కరువు సాయం (డీఆర్)ను 2 శాతం పెంచుతూ మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 5 శాతం ఉన్న డీఏ, డీఆర్‌లను 7 శాతానికి పెంచి ఈ ఏడాది జనవరి నుంచే ఆ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. దీంతో 1.1 కోట్లమంది కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి కలగనుంది.‘ధరల పెరుగుదలను తట్టుకునేందుకు డీఏ, డీఆర్‌లను మూలవేతనం/పింఛనుపై 7 శాతానికి పెంచాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించింది’ అని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఖజానాపై ఏడాదికి రూ.6,077 కోట్ల అధిక భారం పడనుంది. ► సులభతర వాణిజ్య నిర్వహణ ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని మెరుగుపరచు కునే లక్ష్యంతో రెండు చట్టాలను సవరించేందుకు కేబినెట్ ఆమోదం. వాణిజ్య వివాదాలు త్వరగా పరిష్కారమయ్యేందుకు ఈ సవరణలు దోహ దపడతాయి. ► స్వాతంత్య్ర సమరయోధుల పింఛను పథకం ‘స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన’ను 2020 వరకు కొనసాగించేందుకు ఆమోదం. -
సెప్టెంబర్ 1న వేతనంతోపాటు డీఏ
కరువు భత్యం ఫైలు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ 20న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం 18.340 శాతానికి చేరిన డీఏ 3.5 లక్షల మంది ఉద్యోగులు, 2.5 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి జూలై డీఏపై కేంద్రం ప్రకటన వెలువడిన తర్వాత నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురుచూపులు ఫలించనున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన ఉద్యోగులకు ఇచ్చే వేతనంతోపాటు కరువు భత్యం(డీఏ) చెల్లించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైలును ఇప్పటికే ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. ఈ నెల 20న జరిగే కేబినెట్ సమావేశం దీనికి ఆమోదం తెలుపనుంది. 2016 జనవరి నెలలో ఇవ్వాల్సిన డీఏ కోసం రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఉద్యోగులు, కరువు భృతి(డీఆర్) కోసం 2.5 లక్షల మంది పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. డీఏ ఇవ్వాలని ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పటికే ప్రభుత్వానికి పలు దఫాలుగా విజ్ఞప్తి చేశారు. చివరకు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలసి విజ్ఞాపనపత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1న వేతనంతోపాటు డీఏ చెల్లించేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. కేబినెట్ ఆమోదం లభించగానే డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. 18.340 శాతానికి చేరిన డీఏ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 2016 జనవరి నాటికే మూల వేతనంపై 15.196 శాతం డీఏ అమల్లో ఉంది. దీనికి జనవరి నెలలో రావాల్సిన మరో 3.144 శాతం డీఏ కలిపి ఇవ్వాల్సి ఉంది. అంటే జనవరి నుంచి 18.340 శాతం డీఏ రావాల్సి ఉంది. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండుసార్లు(జనవరిలో ఒకసారి, జూలైలో మరోసారి) ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ ఇస్తాయి. అయితే కేంద్రం ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత జనవరిలో ఇవ్వాల్సిన డీఏను కేంద్రం ఇప్పటికే మంజూరు చేసి ఇచ్చింది. మొన్నటి జూలైలో ఇవ్వాల్సిన డీఏను త్వరలోనే మంజూరు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మాత్రం జనవరిలో ఇవ్వాల్సిన డీఏ చెల్లింపునకు 20న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ఇక జూలైలో రావాల్సిన డీఏకు సంబంధించి కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
ఆర్టీసీ కార్మికుల డీఏ పెంపుపై ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మే నెలకు సంబంధించి 3.4 శాతం కరువు భత్యం(డీఏ) పెంచుతూ సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 21.5 శాతంగా ఉన్న కరువు భత్యాన్ని 24.9 శాతానికి పెంచుతూ గత సంవత్సరం నిర్ణయం తీసుకుంది. అయితే నిధుల కొరత వల్ల ఇప్పటి వరకు అమలు చేయలేదు. ప్రస్తుత నెలకు సంబంధించి దాన్ని కార్మికులకు అందజేయాలని నిర్ణయించి బుధవారం ఉత్తర్వు జారీచేసింది. అయితే గత సంవత్సరం జూలై నుంచి నవంబర్ వరకు ఐదు నెలలు, పెరిగిన కరువు భత్యానికి సంబంధించి ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్న బకాయిలు ఇవ్వకుండా ఒక్కనెల కరువు భత్యం ఇవ్వడం సరికాదని, వెంటనే బకాయిలు మొత్తం విడుదల చేయాలని కార్మిక సంఘం నేతలు ఆర్టీసీ జేఎండీకి విజ్ఞప్తి చేశారు. డీఏ బకాయిలతో పాటు వేతన సవరణ బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు కూడా విడుదల చేయాలని కోరారు. -
ఆర్టీసీ కార్మికులకు కరవు భత్యం
సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన 3.4 శాతం కరువు భత్యం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. మే నెల జీతంతో కలిపి చెల్లిం చేందుకు మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ సాంబశివరావును ఎన్ఎంయూ నేతలు మంగళవారం కలసి కార్మికుల సమస్యలపై చర్చించారు. -
ఉద్యోగులకు కరువు భత్యం పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు కరువు భత్యం (డీఏ) ప్రకటించింది. ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న 4.50 లక్షల మంది ఉద్యోగులు ఈ ప్రయోజనం అందుకోనున్నారు. పదో పీఆర్సీ వేతన సవరణ అనంతరం ఉద్యోగులకు మూల వేతనంపై 8.908 శాతం డీఏ అమల్లో ఉంది. దీనికి అదనంగా 3.144 శాతం కలిపి 12.052 శాతం డీఏ చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఈ ఏడాది జనవరి నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుంది. ఈమేరకు బుధవారం ఆర్థిక శాఖ జీవో 129 జారీ చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ నెల జీతంతో పెరిగిన కరువు భత్యాన్ని నగదుగా చెల్లిస్తారు. అంటే అక్టోబర్ 1న పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికందుతుంది. జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమై కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 90 శాతం బకాయిలు నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్ (పీఆర్ఏఎన్) అకౌంట్లో జమ చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు వంద శాతం బకాయిలు నగదు రూపంలోనే చెల్లిస్తారు. జీపీఎఫ్ ఖాతా లేని ఉద్యోగులున్నట్లయితే... వారి డీఏ బకాయిలను ప్రభుత్వం కంపల్సరీ సేవింగ్ అకౌంట్లో జమ చేస్తుంది. సదరు ఉద్యోగులు ఖాతాలు తెరిచిన తర్వాత జీపీఎఫ్‌లో సర్దుబాటు చేస్తారు. బకాయిలకు సంబంధించి ఈనెల 15లోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. తమ పరిధిలోని ఉద్యోగులందరూ డీఏ బకాయిలు క్లెయిమ్ చేసినట్లుగా డీడీవోలు ధ్రువీకరణ పత్రం జత చేస్తేనే... సెప్టెంబర్ వేతన బిల్లులు పాస్ చేయాలని ఆదేశించింది. పెన్షనర్లకు సంబంధించిన డీఏ పెంపు ఉత్తర్వులను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. కొత్త డీఏ 3.144 శాతం కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల కిందట పెంచిన డీఏకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డీఏను ప్రకటించింది. ఇదే రోజున కేంద్ర కేబినెట్ జూలై నుంచి ఉద్యోగుల డీఏను ఆరు శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఉద్యోగులకు మరో 3.144 శాతం డీఏ పెరుగుతుంది. రాష్ట్ర సర్కారు తీసుకునే నిర్ణయం ప్రకారం తదుపరి డీఏ ప్రకటన వెలువడుతుంది. కనీసం నాలుగైదు నెలల ఎదురుచూపులు ఆనవాయితీగా కొనసాగుతోందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. -
ఆర్టీసీలో.. ఈనెల జీతంతో డీఏ
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. ఈ నెల జనవరి నుంచి అందాల్సిన 8.1 శాతం కరువు భత్యా(డీఏ)న్ని ఈ నెల జీతంతో కలిపి చెల్లించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలావుంటే, ఆర్టీసీలోని 1792 మంది కండక్టర్లను, 1955 మంది డ్రైవర్లను క్రమబద్ధీకరిస్తూ త్వరలో ఉత్తర్వులు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. పద్మాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది జనవరిలో క్రమబద్ధీకరించిన 9,518 మందికి రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఆర్టీసీకి రూ.76 కోట్లు మంజూరు కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ బస్సు పాసుల రీయింబర్స్మెంట్, వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం వాయిదాలు, వడ్డీ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఆర్టీసీకి రూ.76.65 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఐఆర్ కొలిక్కి వచ్చేనా!
సాక్షి, హైదరాబాద్: మధ్యంతర భృతి (ఐఆర్)పై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శనివారం సచివాలయంలో మంత్రుల బృందం ఈ అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. ఈ భేటీలో ఐఆర్ ఎంత ఇవ్వాలనే అంశంపై ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ తరువాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే మంత్రుల బృందంతో జరిగే చర్చల్లో అవగాహన కుదరకపోతే ఐఆర్ ఆలస్యం అవుతుందని ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఐఆర్‌పై ఇప్పటికే ఒకసారి (ఈ నెల 7న) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఉద్యోగ సంఘాలతో విడివిడిగా సమావేశం అయ్యారు. గరిష్టంగా 50% ఐఆర్‌కు డిమాండ్ పీఆర్సీ నివేదిక ఆలస్యం అవుతున్న నేపథ్యంలో 45 శాతం నుంచి 50 శాతం వరకు ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎస్‌తో చర్చల సందర్భంగా ఏపీఎన్జీవోల సంఘం, పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్లు ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం ఇవ్వాలని కోరాయి. టీఎన్జీవోల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాలు 45 శాతం, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 47 శాతం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారుు. కాగా, ఐఆర్‌పై పీఆర్సీ చైర్మన్ నుంచి ప్రభుత్వం ఇప్పటికే నివేదిక తెప్పించుకుంది. కొత్త పీఆర్సీలో ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాల్సింది ఆయనే కాబట్టి చైర్మన్ అభిప్రాయాన్ని కూడా తీసుకోగా, 15 శాతం ఐఆర్‌ను ప్రతిపాదించినట్లు సమాచారం. ఆర్థిక శాఖ కూడా ఐఆర్‌పై లెక్కలు వేసింది. ఐదేళ్ల కిందట 22 శాతం ఐఆర్ ఇచ్చినపుడు ఒక్క శాతానికి రూ.124 కోట్లు వెచ్చించాల్సి రాగా ఇప్పుడు ఒక్క శాతం ఐఆర్‌కు రూ.284.46 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఎన్నికల సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 25 శాతం నుంచి 35 శాతం మధ్యలో అవగాహన కుదరవచ్చని భావిస్తున్నా.. 25 శాతానికే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరోవైపు నగదు ప్రయోజనం 2013 జూలై 1 నుంచే వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టే అవకాశం ఉంది. -
వసూల్ రాజాలు!
గజ్వేల్, న్యూస్‌లైన్: స్థానిక ఉపకోశాధికారి(సబ్ ట్రెజరీ) కార్యాలయం లో వసూళ్ల పర్వం జోరుగా సాగుతోంది. ఇటీవల ఉపాధ్యాయులకు విడుదలైన డీఏ (డ్రాట్ అలనెన్స్) బిల్లుల విషయంలో ఈ తతంగానికి తెరతీసినట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆరు నెలల క్రితం డీఏ(కరువు భత్యం)ను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఇందులోభాగంగా 2003 డీఎస్సీ వారికి రూ. 38 వేలు, 2006 డీఎస్సీ ఉపాధ్యాయులకు రూ.19 వేల వరకు కరువుభత్యం రానుంది. ఈ జీఓ ద్వారా గజ్వేల్ తాలుకా పరిధిలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, దౌల్తాబాద్ మండలాల పరిధిలో పనిచేస్తున్న సుమారు 500 మందికిపైగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. వీరంతా గజ్వేల్‌లోని ఎస్టీఓ కార్యాలయంలో బిల్లులు చేయించుకుని డీఏ పొందాల్సి ఉంది. దీంతో ఇదే అదునుగా భావించిన సంబంధిత కార్యాలయ అధికారులు వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు తెలిసింది. ఒక్కో ఉపాధ్యాయుని వద్ద రూ. 800 నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయంలోని ఓ అధికారి కనుసన్నల్లో ఈ తతంగం నడస్తున్నట్లు సమాచారం. డబ్బులిస్తేనే బిల్లులు చేస్తామని ఉపాధ్యాయులను వేధించిన క్రమంలో కొన్ని రోజుల కిందట ఓ ఉపాధ్యాయ సంఘం నాయకులు కార్యాలయంలోకి వెళ్లి అధికారులతో వాగ్వాదానికి సైతం దిగారు. ఆ తర్వాత వసూళ్లకు కాస్త బ్రేక్ వేసిన అధికారులు మళ్లీ తమ దందా కొనసాగించారని టీచర్లు చెబుతున్నారు. లంచమిస్తేనే బిల్లు చేస్తారంట చాలా రోజుల తర్వాత మాకు ప్రభుత్వం డీఏ మంజూరు చేసింది. ఈ జీవో రాగానే ఎంతో సంబరపడ్డాం. కానీ లంచమిస్తేనే బిల్లులు చేస్తామని ఎస్టీఓ కార్యాలయంలో అధికారులు వేధిస్తున్నారు. డబ్బులివ్వపోతే బిల్లులు చేయడం లేదు. -న్యూస్‌లైన్‌తో ఓ ఉపాధ్యాయుడి ఆవేదన ఆరోపణలు అవాస్తవం ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ బిల్లుల విషయంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణల్లో నిజం లేదు. ఏ ఒక్క ఉపాధ్యాయున్ని కూడా ఇబ్బంది పెట్టకుండా బిల్లులు చేయించి పంపుతున్నాం. కార్యాలయంలో ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లు భావిస్తే ఉపాధ్యాయులు నా దృష్టికి తీసుకురావాలి. - రవీందర్‌రెడ్డి, ఉపకోశాధికారి, గజ్వేల్ -
మధ్యంతర భృతిపై సర్కారే నిర్ణయం తీసుకోవాలి: పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు మధ్యంతర భృతి మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) స్పష్టం చేసింది. ఇటు తెలంగాణతోపాటు అటు సీమాంధ్రకు చెందిన ఉద్యోగ సంఘాలు మధ్యంతర భృతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యంతర భృతి మంజూరుపై అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ పీఆర్సీని ఆర్థికశాఖ కోరింది. ఈ మేరకు ఫైలును పంపింది. దీన్ని పరిశీలించిన పీఆర్సీ.. మధ్యంతర భృతి ఇవ్వాలా వద్దా అనే అంశం కమిషన్ పరిధిలోకి రాదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. గతంలో పీఆర్సీ నివేదికలు జాప్యమైన సందర్భాల్లో మధ్యంతర భృతి ఎంతెంత చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందనే వివరాలను పేర్కొంటూ సంబంధిత ఫైలును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి పంపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాలా? ఇస్తే ఎంతశాతం మేర ఇవ్వాలి అనే విషయంపై సీఎం స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
దీపావళిలోగా ఐఆర్ చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి వెంటనే చెల్లించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరాయి. ఎన్నోరోజులుగా పెండింగ్‌లో ఉన్న పదో పీఆర్సీ అమలు, హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని విన్నవించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం వేర్వేరుగా సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఏపీ ఎంప్లాయీస్ జేఏసీ, సచివాలయ ఉద్యోగుల సమాఖ్య, సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల జేఏసీ, యునెటైడ్ టీచర్స్ ఫెడరేషన్, రాష్ట్రోపాధ్యాయ సంఘం తదితర సంఘాల నేతలు వీరిలో ఉన్నారు. మధ్యంతర భృతి (ఐఆర్), వేతన సవరణ కమిటీ (పీఆర్సీ), హెల్త్‌కార్డులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సంబంధిత డిమాండ్లపై సీఎం పూర్తి సానుకూలంగా స్పందించినట్టు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 50 శాతం మధ్యంతర భృతిని దీపావళిలోగా చెల్లించాలని ఏపీ ఎంప్లాయీస్ జేఏసీ నేత అశోక్‌బాబు డిమాండ్ చేశారు. 2008లో తొమ్మిదో పీఆర్సీ వేసిన మూడు నెలల్లోగానే (అక్టోబర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో) ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ చెల్లించిందని, ఇప్పుడు కూడా అక్టోబర్ నెలలోనే చెల్లించాలని అన్నారు. పీఆర్సీని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలన్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యోగులు చేసిన 66 రోజుల సమ్మె కాలాన్ని డ్యూటీ పీరియడ్‌గా క్రమబద్ధీకరించాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. సమ్మెపై హైకోర్టులో ఉన్న కేసు విషయమై కూడా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి ఉద్యోగులపై సానుభూతి ప్రదర్శించాలని విన్నవించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. హెల్త్‌కార్డుల అంశంలో ప్రభుత్వం తమతో చర్చిస్తున్న అంశాలకు, డ్రాఫ్ట్‌లో పొందుపరుస్తున్న అంశాలకు పొంతన లేదని, తాము సూచించిన అంశాలు డ్రాఫ్ట్‌లో లేకుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఎస్టీయూ నేత కత్తి నరసింహారెడ్డి స్పష్టం చేశారు. కాగా ఉద్యోగుల డిమాండ్లను వారం రోజుల్లో పరిష్కరించాలని, 45 శాతం ఐఆర్‌ను వెంటనే చెల్లించాలని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు యు.మురళీకృష్ణ కోరారు. సకలజనుల సమ్మె వల్ల తెలంగాణ ఉద్యోగులు 42 రోజులు, సమైక్యాంధ్ర సమ్మె వల్ల సీమాంధ్ర ఉద్యోగులు 66 రోజుల జీతాలను నష్టపోయారని, వీరి పట్ల సానుభూతితో వీలైనంత ఎక్కువ భృతి వెంటనే చెల్లించాలని ఉపాధ్యక్షుడు నరేందర్‌రావు విన్నవించారు. ఇలావుండగా రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ఉద్యోగులు తమ అభిప్రాయాలు, సమస్యలను విన్నవించుకునేందుకు వీలుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులను రాష్ట్రపతి, ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.వి.కృష్ణయ్య ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రవిభజనకు పూనుకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. -
50% మధ్యంతర భృతి ఇవ్వాలి: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: పదో వేతన సంఘం సిఫారసులు అమలులోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉన్నందున, ప్రస్తుత అధిక ధరల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 50% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈమేరకు రేపోమాపో సీఎంను కలసి విజ్ఞాపన పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. హెల్త్‌కార్డుల జారీ విషయంలో జాప్యానికి తెరదించి ఉద్యోగులు కోరినట్టుగా పరిమితిలేని చికిత్స, ఔట్‌పేషెంట్ చికిత్సకూ చోటు కల్పించే నిబంధనలతో వాటిని జారీ చేయాలని డిమాండ్ చేసింది. సోమవారం ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యవర్గ సమావేశం జరి గింది. అనంతరం జేఏసీ నేతలు ఏపీ ఎన్జీఓల సంఘం భవనంలో విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అంశం పరిశీలనలో ఉన్న ప్రస్తుత తరుణంలో పదో వేతన సంఘం అమలుపై కాలయాపన తగదన్నారు. ప్రస్తుత సందిగ్ధ పరిస్థితి ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, పీఆర్సీ నివేదికపై కసరత్తును నవంబర్ 15 నాటికల్లా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. అన్ని వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యం లో పీఆర్సీ అమలు వరకు ఎదురు చూడకుండా ఉద్యోగులకు 50% మధ్యంతర భృతి ప్రకటించాలని, దీన్ని గత జూలై ఒకటి నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మళ్లీ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. సమావేశంలో జేఏసీ సభ్యులు కె.నరసింహారెడ్డి, బి.వెంకటేశ్వర్లు, ఐ.వెంకటేశ్వరరావు, కె.సుబ్బారెడ్డి, ఎన్.రఘురామిరెడ్డి, యు.కుల్లాయప్ప, ఆర్.అప్పారావు, డి.జి.ప్రసాదరావు, డి.మణికుమార్, టి.వి.ఫణిపేర్రాజు, ఎన్.చంద్రశేఖరరెడ్డి, ఓబులపతి తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ఉద్యమం ఆగదు: అసెంబ్లీని సమావేశపరచిన వెంటనే మళ్లీ సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తామని అశోక్‌బాబు తెలిపారు. ఎవరు ఒత్తిడి తెచ్చినా సమ్మెను విరమించే పరిస్థితి ఉండదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్తూ, తమను భయపెట్టి ఉద్యమాన్ని నిలువరించే స్థాయి సీఎంకు కూడా ఉందనుకోవటం లేదన్నారు. మధ్యంతరభృతి వెంటనే చెల్లించాలి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే 65% మధ్యంతరభృతి చెల్లించాలని ఏపీ నీటి పారుదల శాఖ ఎన్జీవోలు డిమాండ్ చేశారు. సంక్రాంతిలోగా పీఆర్సీని అమల్లోకి తేవాలని, గత జూలై 1 నుంచి వర్తింపజేయాలని కోరారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు సోమవారం పీఆర్సీ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. తర్వాత సంఘం అధ్యక్షుడు పి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ పీఆర్సీ అమల్లో ప్రభుత్వ జాప్యాన్ని తప్పుపట్టారు. కాగా, విభజనపై కేంద్రం ముందుకు వెళ్తే మెరుపుసమ్మెకు దిగుతామని, ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలేస్తామని సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. -
ఆర్టీసీ సిబ్బందికి 8% డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త. కరువు భత్యాన్ని 8% పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై నుంచి ఇది అమలులోకి రానున్న నేపథ్యంలో గడచిన 4 నెలలకు సంబంధించి బకాయిల రూపంలో ఒకేసారి చెల్లించనున్నారు. ప్రస్తుతం 47.8%గా ఉన్న కరువు భత్యం ఈ పెంపు తో 55.8%కు చేరుకోనుంది. రెగ్యులర్ సిబ్బందికి ఈ లబ్ధి అందనుంది. దీపావళి కానుకగా ఆర్టీసీ యాజ మాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇటీవల సీమాంధ్ర ఉద్యమానికి మద్దతుగా కార్మికులు జరిపిన సమ్మెను విరమించే సమయంలో మంత్రి బొత్స సమక్షంలో జరిగిన చర్చలో డీఏ పెంపుపై ఒప్పందం కుదిరిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్‌లు పేర్కొన్నారు. -
దీపావళి కానుకగా 8.56శాతం డీఏ!
వచ్చే నెల నుంచి కరువు భత్యం మంజూరుకు సీఎస్ హామీ ఐఆర్‌పై సీఎంతో చర్చిస్తామన్నారు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీపావళి కానుకగా వచ్చే నెల నుంచి 8.56 శాతం కరువు భత్యం (డీఏ) మంజూరుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పి.కె. మహంతి సుముఖత వ్యక్తం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. పదో వేతన సంఘం సిఫారసులు అమల్లోకి వచ్చే వరకూ 45 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని వేతన కమిషన్ చైర్మన్ పి.కె.అగర్వాల్‌కు, సీఎస్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించిన అనంతరం సమాఖ్య ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల నుంచి 8.56 శాతం డీఏ ఇస్తామని, ఐఆర్ విషయంలో ముఖ్యమంత్రితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారని సమాఖ్య ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, కో చైర్మన్ నరేందర్‌రావు తెలిపారు. హామీ ఇచ్చిన సీఎస్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ‘గత కొంతకాలంగా ఇతర కారణాల వల్ల ఉద్యోగ లోకం సమస్యలపై దృష్టి పెట్టలేకపోయింది. చివరకు బుధవారం సమాఖ్య ద్వారా అన్ని సంఘాల ప్రతినిధులమంతా పీఆర్సీ చైర్మన్‌ను క లిశాం. గత జూలై ఒకటో తేదీ నుంచి వర్తించేలా 45 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరాం. అనంతరం సీఎస్‌ను కలిసి 45 శాతం ఐఆర్ ప్రకటించాలని, తక్షణమే డీఏ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాం..’ అని చెప్పారు. తాము చర్చించి వచ్చిన కొద్దిసేపటికే డీఏకి సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖకు కూడా పంపించారని తెలిపారు. ఐఆర్, ఇతర డిమాండ్ల విషయమై ముఖ్యమంత్రితో చర్చించి ఉద్యోగులకు సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని సీఎస్ చెప్పారన్నారు. పదోన్నతుల కోసం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ల కమిటీ (డీపీసీ)లను వేయాలన్న తమ డిమాండ్ విషయంలోనూ సీఎస్ సానుకూలంగా స్పందించినట్లు మురళీకృష్ణ, నరేందర్‌రావు వివరించారు. మీడియా సమావేశానంతరం సీమాంధ్ర, తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా సచివాలయ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. చాలాకాలం తర్వాత ఉమ్మడి ప్రెస్‌మీట్: ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో 2 నెలలకు పైగా సచివాలయంలో పోటాపోటీ నిరసనలు, ఆందోళనలు నిర్వహించిన సచివాలయ తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పుడు ఒక్కటయ్యారు. తమ సమస్యలపై కలిసి పోరాడేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో పీఆర్సీ చైర్మన్, సీఎస్‌లను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాఖ్య ఉపాధ్యక్షులు టి. వెంకట సుబ్బయ్య, కన్వీనర్ పద్మాచారి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. -
కేంద్ర ఉద్యోగులకు మరో 10% డీఏ
కేంద్ర కేబినెట్ ఆమోదం 2013 జూలై 1 నుంచి వర్తింపు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు దసరా ధమాకా. వారికి 10 శాతం అదనపు విడత కరువు భత్యాన్ని (డీఏ), పింఛనుదారులకు అంతే మొత్తం అదనపు డీఆర్‌ను కేంద్రం ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు ప్రధాని మన్మోహన్సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంతో దాదాపు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 30 లక్షల మంది పింఛన్‌దారులు లబ్ధి పొందనున్నారు. వారికి బేసిక్‌లో 90శాతం డీఏ / డీఆర్ లభించనుంది. పెంపు 2013 జూలై 1 నుంచి వర్తిస్తుంది. దీన్ని నగదు రూపంలో చెల్లిస్తారని కేంద్ర సమాచార ప్రసార మంత్రి మనీశ్ తివారీ విలేకరులకు చెప్పారు. దీని వల్ల ఖజానాపై ఏటా రూ.10,879.60 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆరో కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా రూపొందించి న ఫార్ములాకు అనుగుణంగా ఈ పెంపును ఖరారు చేసినట్టు పేర్కొంది. మరోవైపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు చట్టబద్ధతను కొనసాగించేందుకు వీలుగా కొత్త ఆర్డినెన్స్ జారీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కార్మికుల భద్రతకు సౌదీతో ఒప్పందం సౌదీ అరేబియాలో గృహ కార్మికులుగా పని చేస్తున్న దాదాపు 6 లక్షల మంది భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. కార్మికులకు మెరుగైన పని వాతావరణాన్ని కల్పించడం దీని ముఖ్యోద్దేశం. ఈ ఒప్పందం ప్రకారం కార్మికుల కాంట్రాక్టు నియమ నిబంధనలు, పని వాతావరణం తదితరాలను యజమానులు సౌదీలోని భారత అధికార వర్గాలకు స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది. సౌదీలో పని చేస్తున్న మొత్తం 28 లక్షల మంది భారతీయుల ప్రయోజనాల పరిరక్షణ దిశగా ఇది తొలి అడుగని అధికారులు పేర్కొన్నారు. ప్లే స్కూళ్ల నియంత్రణ విధానానికి ఓకే: దేశంలోని ప్లే స్కూళ్లు, శిశు సంరక్షణాలయాల(క్రెచ్) నియంత్రణ కోసం జాతీయస్థాయి మండలిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించిన జాతీయ శిశు సంరక్షణ, విద్య(ఎన్‌ఈసీసీఈ) విధానం ముసాయిదాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్లే స్కూళ్లు, క్రెచ్‌లు అందించే సేవలు, విద్యపై పర్యవేక్షణ కోసం ఈ విధానాన్ని రూపొందించారు.