ఆర్టీసీలో సమ్మె సైరన్‌ | APSRTC Workers Going To Strike | Sakshi
Sakshi News home page

ఏపీ ఆర్టీసీలో సమ్మె సైరన్‌

Published Wed, May 22 2019 11:38 AM | Last Updated on Wed, May 22 2019 12:43 PM

APSRTC Workers Going To Strike - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగనుంది. జూన్‌ 13 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. బుధవారం ఆర్టీసీ హౌస్‌లో యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించలేదని కార్మిక నేతలు పేర్కొన్నారు. యాజమాన్యం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. సమ్మె నోటీసులు ఇచ్చి 14 రోజులు అయినా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి చూపుతుందని మండిపడ్డారు.తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు

  • 2013 కి వేతనాల సవరణకు సంబందించిన పెండింగ్‌ అరియర్సు వెంటనే చెల్లించాలి.
  • 4000 మంది సిబ్బందిని తగ్గించాలంటూ వీసీ, ఎండీలు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలి.
  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
  • అద్దెబస్సుల పెంపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి
  • ఆర్టీసీ బస్సులను పెంచాలి.
  •  ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రావాల్సిన రూ.650 కోట్లు వెంటనే చెల్లించాలి.
  •  సీసీఎస్‌ నుంచి ఆర్టీసి యాజమాన్యం వాడుకున్న రూ.285 కోట్ల కార్మికుల సొమ్మును వెంటనే యాజమాన్యం చెల్లించాలి.
  • గ్రాడ్యుటీ, వీఆర్‌ఎస్‌ సర్క్యులర్‌లో ఉన్న లోపాలు సరిచేయాలి.
  • కారుణ్యనియామాకాలు వెంటనే చేపట్టాలి.
  • మిగిలి ఉన్న కాంట్రాక్టు కార్మికులను తీసుకోవాలి. అందరినీ రెగ్యూలర్ చెయాలి.
  • ఆర్టీసి పాలకమండలిలో కార్మిక సంఘాలకు బాగస్వామ్యం కల్పించాలి.
  • చట్ట ప్రకారం కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన సౌకర్యాలలో వీసీ, ఎండీ తొలగించిన సౌకర్యాలను పునరుద్దరించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement