RTC Unions
-
ఆర్టీసీ కార్మిక నేతలకు షాక్; రిలీఫ్ డ్యూటీ రద్దు
సాక్షి, హైదరాబాద్: కార్మిక సంఘాలను క్షమించబోమన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్టీసీ గుర్తింపు సంఘమైన టీఎంయూ కార్యాలయాన్ని బస్‌భవన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్ విజిలెన్స్ రామ్‌చందర్‌రావు, చీఫ్ పర్సనల్ మేనేజర్ కిరణ్ ఆదేశాల మేరకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఏంయూ) కార్యాలయానికి తాళాలు వేశారు. దీంతో టీఎంయూ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డికి షాక్ తగిలినట్టైంది. ఇక రానున్న కాలంలో యూనియన్లకు గడ్డు పరిస్థితులే ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. కార్మిక నేతల రిలీఫ్ డ్యూటీ రద్దు.. ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర కమిటీలోని 30 మంది కార్మిక నేతలకు విధుల నుంచి మినహాయింపు(రిలీఫ్ డ్యూటీ)ను రద్దు చేసింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లో 26 మందికి, ఎంప్లాయిస్ యూనియన్‌లో ముగ్గురికి, ఎస్‌డబ్ల్యూఎఫ్‌లో ఒక్కరి చొప్పున రిలీఫ్ డ్యూటీని రద్దు చేసినట్లు ప్రకటించింది. రిలీఫ్ డ్యూటీ అంటే.. కార్మికుల ఇబ్బందుల పరిష్కారం కోసం పనిచేసేందుకుగానూ కార్మిక నేతలకు డ్యూటీ నుంచి మినహాయింపు ఉంటుంది. విధులకు హాజరు కాకున్నా యాజమాన్యం పూర్తిస్థాయి జీతం చెల్లించేది. జిల్లాలో జోనల్ ప్రెసిడెంట్, సెక్రటరీలకు ఫుల్ డే రిలీఫ్, హాఫ్ డే రిలీఫ్‌లు వారానికి మూడురోజులు వర్తింపజేసేది. వీరితోపాటు రీజినల్ సెక్రటరీలకు, డిపో కార్యదర్శిలకు వారానికి ఒక రోజు వేతనం చెల్లించేవారు. వీటిని రద్దు చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించడంతో ఇకమీదట కార్మిక నేతలెవరికీ రిలీఫ్ డ్యూటీలు ఉండవు. -
‘చేయి దాటిపోయింది.. చర్చలు జరపలేం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున అడిషినల్ అడ్వొకేట్ జనరల్( ఏజీ) వాదనలు వినిపిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె చట్టవిరుద్ధమని కోర్టుకు వివరించారు. ‘ పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్22(1)ఏ, ప్రొహిబిషన్ ఆఫ్ స్ట్రైక్ యాక్ట్ ప్రకారం సమ్మె ఇల్లీగల్. చట్టం ప్రకారం ఆరు నెలల ముందు నోటీసులు ఇవ్వాలి. సమ్మెకు కనీసం 14 రోజుల ముందు ప్రభుత్వంకు తెలపాలి. కానీ కార్మికులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సెక్షన్ 24 ప్రకారం కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం’ అని ఏజీ హైకోర్టుకు వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను హైకోర్టుకు తెలిపారు. డిమాండ్లను పరిష్కరించలేం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్పొరేషన్ పరిస్థితి అస్సలు బాగాలేదని, సమ్మె కారణంగా ఇప్పటి వరకు 44శాతం నష్టపోయినట్లు కోర్టుకు వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులతో చర్చలు జరపలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. యూనియన్లు విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కకుపెట్టినా, తిరిగి ఏ క్షణమైనా ఆ డిమాండ్‌ను తిసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందన్నారు. కొతంమంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం టీఎస్ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించింది. సమ్మె అన్నది కార్మికుల కోసం కాకుండా, యూనియన్ నేతలు తమ ఉనికి చాటుకునేందుకు చేస్తున్నారని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. -
విలీనమే విఘాతం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఆర్థికంగా తీవ్ర క్లిష్ట పరి స్థితుల్లో ఉంది. ఈ విషయం తెలిసినా యూనియన్లు బాధ్యతారహితంగా సమ్మెలోకి వెళ్లాయి. చర్చలు జరిపితే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమనే ఆచరణ సాధ్యం కాని డిమాండ్‌తో ముడిపెట్టి మొండిగా వ్యవహరిస్తున్నాయి. చర్చలకు ఇదే విఘాతంగా మారింది. ఇదే తీరుతో ఉన్నప్పుడు ఇకపై చర్చలతో ప్రయోజనం లేదు’ అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేయనుంది. ఈ మేరకు సోమవారం అపిడవిట్ దాఖలు చేయనుంది. అఫిడవిట్ ప్రతులను ప్రతివాదులకు ఆదివారమే పంపించింది. ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి పూర్తి వివరాలను అంశాలవారీగా అందులో ప్రస్తావించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సోమవారం హైకోర్టుకు దాన్ని సమర్పించనున్నారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని, ఆర్టీసీ సిబ్బంది డిమాండ్ల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ధర్మాసనం ఆదేశాల మేరకు సీఎస్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణ కొనసాగనుంది. సమస్యలు కొలిక్కి రావు... ‘హైకోర్టు ఆదేశించిన మేరకు నాలుగు డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీకి రూ. 47 కోట్లు చెల్లించినా సమస్యలేవీ కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. ధర్మాసనం సూచనల్ని పరిశీలిస్తే రూ. 2,209 కోట్లను విధిగా చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రూ. 47 కోట్లు ఏమాత్రం చాలవు. ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడల్లా ప్రభుత్వం చేయూత ఇస్తూనే ఉంది. ఇలా ఎంతకాలం సాయం చేస్తూ ఉండాలి? ఎన్నిసార్లు ఆర్థికంగా ఆదుకున్నా సంస్థ పరిస్థితుల్లో మార్పు రానప్పుడు ఎన్నిసార్లు సాయం చేయాలి?’ అని కౌంటర్లో సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్‌కు ముడిపెట్టి చర్చలు జరపాలని యూనియన్లు మొండిగా వ్యవహరి స్తున్నాయని సీఎస్ గుర్తుచేశారు. అయోధ్య తీర్పునాడే చలో ట్యాంక్‌బండ్... ‘పండుగలు, విద్యార్ధులకు పరీక్షలప్పుడు సమ్మెలోకి వెళ్లడం, ఇంకా చెప్పాలంటే యూనియన్ ఎన్నికల షెడ్యూల్ ఉన్నప్పుడల్లా సమ్మె చేయడం యూనియన్లకు అల వాటుగా మారింది. ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే ఆలోచన లేకుండా బాధ్యతారహితంగా సమ్మెలోకి వెళ్లారు. యూనియన్లు ఒత్తిళ్లు తెచ్చి వ్యూహాలు పన్ను తున్నాయి. ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రయత్నించడంతో పాటు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయి. యూనియన్లవి ధిక్కార చర్యలని స్పష్టమైనప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సమ్మె చట్టవ్యతిరేకం అవుతుంది. అయోధ్య వ్యవహారంపై సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనుందని తెలిసి కూడా ఆర్టీసీ జేఏసీ ‘చలో ట్యాంక్‌బండ్’కు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని కాపాడాల్సిన పరిస్థితుల్లో ‘చలో ట్యాంక్‌బండ్’ నిర్వహించారు. శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులపై ఒత్తిడి తెచ్చేలా జేఏసీ పని చేసింది. పోలీసులు, ప్రజల భద్రతతోనూ ఆడుకుంది’ అని కౌంటర్లో సీఎస్ ఆరోపించారు. పండుగల్లో ఆదాయానికి గండి... బతుకమ్మ, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సమయంలో ఆర్టీసీకి అదనంగా ఆదాయం వస్తుందని, ఈ కాలంలో సమ్మె చేయడం వల్ల అప్పులు చెల్లించేందుకు దోహదపడే అదనపు ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయిందని సీఎస్ అఫిడవిట్లో పేర్కొ న్నారు. సమ్మె జరుగుతుండగా ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి రూ. 200 కోట్లు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, పీఎఫ్ బకాయిల చెల్లింపు విషయంలో ఈ నెల 15న ఆర్టీసీ ఎండీ హాజరుకావాలని పీఎఫ్ కమిషనర్ నోటీసు జారీ చేశారని, మోటారు వాహన పన్ను రూ. 452 కోట్లు చెల్లించాలని రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు అ«థారిటీ నోటీసు ఇచ్చిందని చెప్పారు. విలీనంపై మొండిగా.. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ అమలు సాధ్యం కాదు. అయినా యూనియన్లు మొండిగా ఉన్నాయి. అర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. నవంబర్ 7న హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వంలోని ఇతర అధికారులతో సంప్రదించాక వాస్తవాల్ని హైకోర్టు దృష్టికి తేవాలని నిర్ణయించి అఫిడవిట్ దాఖలు చేస్తున్నా. టీఎస్ఆర్టీసీ ఆర్థిక స్థితిగతుల గురించి తెలిసినా సమ్మెలోకి వెళ్లిన యూనియన్లు బాధ్యతారహితంగా వ్యవహరించాయి. టీఎస్ఆర్టీసీ ఏర్పాటు నాటికి 10,350 బస్సులు ఉండేవి. మార్చాల్సిన, కాలం చెల్లిన బస్సులు 2,609 ఉన్నాయి. వాటిని స్థానంలో కొత్తవి కొనేందుకు రూ.750 కోట్లు అత్యవసరం. 2020లో మరో 476 బస్సుల్ని మార్చాల్సి ఉంది. లేకపోతే కాలుష్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. బస్సులను తొలగించినా లేక కొత్త బస్సులను భర్తీ చేయకపోయినా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితుల వల్ల ఆర్టీసీ తక్షణ, మధ్యస్థం నుంచి దీర్ఘకాలిక పద్ధతుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఆర్థికంగా ఏమాత్రం సానుకూల పరిస్థితులు లేవు. చెల్లింపుల భారం అధికంగా ఉంది. ఆ వివరాలను పరిశీలిస్తే చెల్లింపుల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది’ అని సీఎస్ వివరించారు. అప్పుల్లో అత్యధికం ఉద్యోగుల చెల్లింపులవే... ‘ఆర్టీసీ బకాయిలను పరిశీలిస్తే ఉద్యోగుల చెల్లింపులకు సంబంధించిన మొత్తమే అత్యధికంగా రూ .1,521.25 కోట్లు ఉంది. టీఎస్ఆర్టీసీకి ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి నష్టాలు రూ. 5,269.25 కోట్లకు పెరిగిపోయాయి. ఇదే మాదిరిగా భారీ నష్టాల్లో ఆర్టీసీ కార్పొరేషన్ కొనసాగితే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుగా ఎలా అందించాలి? బ్యాంకులు, ఇతర సంస్థలకు రూ. 1,786.81 కోట్ల మేరకు అప్పులు ఎలా చెల్లించాలి? ఈ ఆర్థిక పరిస్థితుల గురించి ఆర్టీసీ కార్మిక సంఘాలకు పూర్తిగా తెలుసు. అయినప్పటికీ వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్టీసీ తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లొద్దని కమిటీ సూచించినా ఫలితం లేకపోయింది. దసరాకు ముందు సమ్మె చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పినా ఉపయోగం లేకపోయింది. ఆర్టీసీ భవిష్యత్తుతోపాటు ప్రజలకు కలిగే అసౌకర్యాల గురించి యూనియన్లు పట్టించుకోలేదు. యూనియన్లతో చర్చలు విఫలమయ్యాయి కాబట్టి చట్ట ప్రకారం ఈ వ్యవహారంపై కార్మికశాఖలోని జాయింట్ కమిషనర్ వద్ద పరిష్కరించుకోవాలి. అయితే హైకోర్టులో వ్యాజ్యం విచారణలో ఉన్న కారణంగా ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాం’ అని సీఎస్ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను సర్కారు గౌరవించినా... పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టంలోని సెక్షన్ 22 (1) (డీ)తోపాటు అత్యవసర సర్వీసుల చట్టం (ఎస్మా)–1971 ప్రకారం కూడా సమ్మె చట్ట విరుద్ధమని తెలిసినా హైకోర్టు ఆదేశాలను గౌరవించి గత నెల 26న 11 ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులకు చర్చలకు పిలిచిందని సీఎస్ గుర్తుచేశారు. అయితే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్‌తో ముడిపెట్టి ఇతర అంశాలపై చర్చించాలని జేఏసీ మొండిగా వ్యవహరించిందని కౌంటర్లో వివరించారు. -
ఆర్టీసీ సమ్మె: ఔదార్యమేదీ?
ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలను అమలు చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే ఓట్లేసి తిరిగి గెలిపిస్తున్నారు, వారి విశ్వాసాన్ని ఏ రకంగానూ వమ్ము చేయడానికి వీల్లేదు... కార్మికులు కూడా ఓ మెట్టు దిగి రావడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. శక్తివంతమైన రాజ్యాల ఎదుగుదలను, అవి కుప్పకూలిపోవడాన్ని తెలంగాణ చూసింది. ప్రజలపట్ల చూపాల్సింది అధికారం కాదు, ఔదార్యం. సాక్షి, హైదరాబాద్: ‘దేశం మొత్తం అబ్బురపడేలా ఈ రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయి. సాగునీరు సహా పలు ప్రాజెక్టుల కోసం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రైతుల కోసం కేంద్రం రూ. 2 వేలు ఇస్తుంటే ఇక్కడ మరింత ఔదార్యంతో రూ. 4 వేలు ఇస్తున్నారు. విద్యుత్ రంగంలో ఎంతో పురోగతి సాధించారు. ఒకే ఒక్క భారీ ప్రాజెక్టుతో 80 శాతం నీటి అవసరాలను తీరుస్తున్నారు. ఒకే నియోజకవర్గానికి అభి వృద్ధి నిమిత్తం రూ. 100 కోట్లు కేటాయిం చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. అటు వంటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో ఔదార్యం చూపడం లేదు. సమస్య పరిష్కారానికి అవసరమైన రూ. 47 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. రాజు తండ్రిలాంటి వాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలను కాపా డాలి. అధికారం ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని అంత తక్కువ వాడాలి. మా వద్దా కోర్టు ధిక్కారణ అధికారం ఉంది. మా ముందు అధికారులు దాఖలు చేసిన అఫి డవిట్లన్నీ కోర్టు ధిక్కార పరిధిలోకి వచ్చేవే. మేం ఇప్పుడు ఆలోచిస్తోంది 48 వేల మంది ఉద్యోగుల గురించి కాదు. 3 కోట్ల మంది ప్రజల గురించి. ఈ ప్రభుత్వానికి రూ. 47 కోట్లు పెద్ద కష్టమేమీ కాదు. ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికులతో చర్చలు జరపండి. వారితో సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయానికి రండి’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మలతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు మా అనుమతి తీసుకోలేదు: కేంద్రం ఈ సందర్భంగా కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నామవరపు రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తమ అనుమతి తీసుకోలేదన్నారు. తమ దృష్టిలో టీఎస్ఆర్టీసీకి ఎటువంటి గుర్తింపు లేదన్నారు. ఆర్టీసీ విభజనకు కేంద్రం అనుమతి తప్పనిసరన్నారు. కేంద్రం అనుమతి ఇచ్చిన తరువాతే విభజన సాధ్యమవుతుందని వివరించారు. తమకున్న వాటా ఏపీఎస్ఆర్టీసీలోనే ఉందని వివరించారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్–3 కింద టీఎస్ఆర్టీసీ ఆవిర్భవించిందన్నారు. కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందే... ఈ వాదనతో ధర్మాసనం విబేధిస్తూ ఆర్టీసీ విభజనకు కేంద్రం ఆమోదం తప్పనిసరని స్పష్టం చేసింది. సెక్షన్–3 కింద టీఎస్ఆర్టీసీ ఏర్పాటైనప్పుడు ఆస్తి, అప్పుల విభజన గురించి ఎందుకు మాట్లాడతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టీసీకి ప్రత్యేక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టం ప్రకారమే నడుచుకోవాలే తప్ప ఇతర చట్టాల ప్రకారం కాదని తేల్చిచెప్పింది. ఆర్టీసీ చట్టం ప్రకారం విభజనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరని, ఇతర చట్టాలను సాకుగా చూపుతూ అనుమతి తీసుకోకుండా తప్పించుకోజాలరని స్పష్టం చేసింది. టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించింది. వాస్తవానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం అనుమతి తీసుకోవడం తప్పనిసరని తెలిపింది. సమస్య పరిష్కారానికి అవసరమైన రూ. 47 కోట్లు విడుదల చేయాలని చెబుతుంటే ఇరు వైపుల నుంచి స్పందన రావడం లేదని, ప్రభుత్వ వైఖరి వల్ల రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయని వ్యాఖ్యానించింది. సామాన్య ప్రజల ఇబ్బందులు ఎవరికీ పట్టడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. అంత మొండి పట్టుదల ఎందుకు? రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి ధర్మాసనం ప్రస్తావిస్తూ రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రూ. 47 కోట్ల విషయంలో ఎందుకు మొండి పట్టుదల ప్రదర్శిస్తోందో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ రాష్ట్రం రూ. 30 వేల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని చెప్పగా అన్ని వేల కోట్ల అప్పులో రూ. 47 కోట్లు ఎంత? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలను అమలు చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే ఓట్లేసి తిరిగి గెలిపిస్తున్నారని, వారి విశ్వాసాన్ని ఏ రకంగానూ వమ్ము చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కార్మికులు కూడా ఓ మెట్టు దిగి రావడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని పేర్కొంది. ప్రభుత్వం ముందుకు రావడం లేదు... దీనికి కార్మిక సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ గడువు పెట్టి మరీ బేషరతుగా విధుల్లో చేరాలంటూ కార్మికులకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కార్మిక సంఘాలతో చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఈ సమయంలో జోషి జోక్యం చేసుకుంటూ మూడుసార్లు కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించామని, ముఖ్యమంత్రి కూడా కార్మికులకు విజ్ఞప్తి చేశారన్నారు. ముఖ్యమంత్రిది బెదిరింపులా ఉంది... దీనికి ధర్మాసనం స్పందిస్తూ ముఖ్యమంత్రిది విజ్ఞప్తి.. హామీ కాదని, అది బెదిరింపులా ఉందని తేల్చిచెప్పింది. ప్రభుత్వంపై ఉన్న గౌరవంతో మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీపై ఔదార్యం చూపాలని సూచించింది. బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు చిత్ర కళల పోటీల్లో బహుమతులు ఇవ్వాలని తాము నిర్ణయించామని, అయితే బస్సుల సమ్మె వల్ల పిల్లలను తీసుకురావడం సాధ్యం కాదని జిల్లా జడ్జీలు చెప్పారని ధర్మాసనం గుర్తుచేసింది. సమ్మె వల్ల పిల్లలను ప్రోత్సహించేందుకు సైతం అవకాశం లేకుండా పోతోందని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. శక్తివంతమైన రాజ్యాల ఎదుగుదలను, అవి కుప్పకూలిపోవడాన్ని తెలంగాణ చూసిందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రజలపట్ల చూపాల్సింది అధికారం కాదని, ఔదార్యమని స్పష్టం చేసింది. ‘మాది పేద కుటుంబం. మా అమ్మ 13 మందిని పెంచింది. మా అన్నదమ్ములతోపాటు మరో 10 మందిని కూడా పెంచింది. పిల్లలందరికీ అన్నం సరిపోదని తెలిసీ అన్నం వండేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసి, అన్నాన్ని పిల్లలకు పెట్టి మా అమ్మ గంజి తాగి బతికింది. అదీ తల్లి మనసు’ అని సీజే చెప్పారు. ప్రజలకు రాజే తండ్రని, అటువంటి రాజు ప్రజలపట్ల ఔదార్యం చూపాల్సిన అవసరం ఉందన్నారు. గజిబిజి లెక్కలతో తెలివి ప్రదర్శిస్తున్నారు... న్యాయస్థానాలైనా.. ప్రభుత్వాలైనా ఉన్నది ప్రజల కోసమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారులు, గజిబిజి లెక్కలతో చాలా తెలివి ప్రదర్శిస్తూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించింది. లెక్కలతో తాము ఎప్పుడు నివేదిక కోరినా అంతకుముందు ఇచ్చిన నివేదికకూ, తాజా నివేదికకూ ఏమాత్రం పొంతన ఉండటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ విచారణకు వారికి తోచిన లెక్కలు చెబుతున్నారని మండిపడింది. తప్పుడు లెక్కలతో న్యాయస్థానాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రిని తప్పుదోవ పట్టించిన అధికారులను తామెలా విశ్వసించగలమని ప్రశ్నించింది. ప్రమాణపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేసి అందులో అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మండిపడింది. ఇలా చేయడం కోర్టు ధిక్కారం కిందకు రాదా? అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని ప్రశ్నించింది. కోర్టు లేవనెత్తిన అంశాలకు అధికారులు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారని జోషి చెప్పగా ఆ అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్లు చదివే ఈ మాట చెబుతున్నారా? అంటూ జోషిని ధర్మాసనం నిలదీసింది. గతంలో వేసిన అఫిడవిట్‌కు, ఇప్పుడు వేసిన అఫిడవిట్‌కు ఏమాత్రం పొంతన లేదని గుర్తుచేసింది. ఇలాంటి అధికారులను ఎలా నమ్మగలమని ప్రశ్నించింది. క్షమాపణ వల్ల ప్రయోజనం ఉండదు... ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, తక్కువ సమయంలో కౌంటర్ దాఖలు చేయాల్సిన పరిస్థితి వల్ల తప్పులు దొర్లాయని, ఇందుకు క్షమించాలని కోరగా క్షమాపణ వల్ల ప్రయోజనం ఉండదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కోర్టు ఓ నిర్ణయానికి వచ్చి శిక్ష విధించాక ఆ సాక్షి వచ్చి తన వాంగ్మూలం తప్పని చెబితే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించింది. వాస్తవాలను పరిశీలించేందుకు కాగ్ నివేదికలు ఇంటర్నెట్లో సులభంగా అందుబాటులో ఉన్నాయని గుర్తుచేసింది. ఆర్టీసీకి చెల్లించిందని రూ. 3,903 కోట్లని ఓసారి, రూ. 3,400 కోట్లని మరోసారి అధికారులు చెబుతున్నారని, వీటిలో ఏది వాస్తవమో అర్థం కాని పరిస్థితి నెలకొందని విమర్శించింది. అలాగే ఆర్టీసీకి రుణం ఇచ్చామని ఓసారి, గ్రాంటు అని మరోసారి చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. జీవోల్లో రుణంగా చెప్పి ఇప్పుడు వాటిని గ్రాంటుగా పేర్కొనడంలో అర్థం ఏమిటని నిలదీసింది. జీహెచ్ఎంసీ బకాయిల విషయంలోనూ అస్పష్టత ఉందని ధర్మాసనం విమర్శించింది. ఒకసారేమో జీహెచ్ఎంసీ డబ్బు ఇచ్చిందని, మరోసారి అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదని ఎలా పడితే అలా చెబుతున్నారని ఆక్షేపించింది. ముఖ్యమంత్రిని, మంత్రిని తప్పుదోవ పట్టించే అధికారులను ఆ పోస్టుల్లో కొనసాగించడం సబబు కాదని అభిప్రాయపడింది. డబ్బు తీసుకొని బకాయి ఉందంటే ఎలా? 2019–20లో రూ. 565 కోట్లు రీయింబర్స్మెంట్ ఇచ్చి అందులో రూ. 540 కోట్లను మోటారు వాహన పన్ను కింద ప్రభుత్వం మినహాయించుకుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయని ధర్మాసనం తెలిపింది. అలాంటప్పుడు తీసేసుకున్న మోటారు వాహన పన్నును ఆర్టీసీ బకాయి ఉందని ప్రభుత్వం ఎలా చెబుతుందని నిలదీసింది. ఎవరు చెప్పేది నిజమో.. ఎవరిది అబద్ధమో దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ సీఎం చెప్పినా కార్మికులు వినడం లేదని, కేవలం 300 మందే విధుల్లో చేరానన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రూ. 47 కోట్లు ఇచ్చి ఉంటే నాలుగు డిమాండ్లు పరిష్కారమై ఉండేవని, తద్వారా సమస్య పరిష్కారానికి సుహృద్భావ వాతావరణం నెలకొని ఉండేదని అభిప్రాయపడింది. రూ. 47 కోట్లు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని మేం భావిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఓసారి ఎక్కువ ఇచ్చామని, మరోసారి ఇవ్వాల్సింది ఏమీ లేదని చెబుతోందని తెలిపింది. ఇలా మాట్లాడుతుంటే సమస్య ఎప్పుడు పరిష్కారం కావాలని ప్రశ్నించింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. మరోవైపు 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
కార్మికుల పట్టు... సర్కార్ బెట్టు!
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ జరగని తరహాలో ఇప్పుడు సమ్మె కొనసాగుతోంది. గతంలో చర్చల్లో ప్రతిష్టంభన వల్లనే సమ్మె పొడిగింపు ఉండేది. ఇప్పుడు పరిస్థితి వేరు. చర్చలు కాదు కదా.. అసలు ఆర్టీసీనే ఉండదని ప్రభుత్వం అంటోంది. డిమాండ్లలో వేటిని అంగీకరిస్తారో, వేటిని తిరస్కరిస్తారో తర్వాత, ముందు చర్చలకు పిలవండి అని కార్మిక సంఘాలు పేర్కొనాల్సిన పరిస్థితి. వెరసి అసలు సమ్మె ఎప్పుడు ముగుస్తుందో, తిరిగి పూర్వపు పరిస్థితి ఎప్పుడు కనిపిస్తుందోనని యావత్ తెలంగాణ జనం ఎదురు చూస్తున్నారు. సమ్మె వదిలి విధుల్లోకి రండి అంటూ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేసిన వినతిని సైతం కార్మికులు తిరస్కరించటంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఇదే చివరి అవకాశమని, కార్మికులు విధుల్లోకి రాని పక్షంలో ఇక వారికి సంస్థతో సంబంధాలే ఉండవని తేల్చి చెబుతూ సీఎం ఇచ్చిన గడువును కార్మికులు బేఖాతరు చేయటంతో పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టులో మరోసారి వాదనలు జరగబోతున్నాయి. కోర్టు ఏం చెబుతుందోనని జనం ఆసక్తిగా, కార్మికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం.. ముందే ప్రకటించినట్టుగా ప్రైవేటు బస్సులతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటూపోతోంది. ‘ప్రైవేటు’కు అనుమతి.. విధుల్లోకి నామమాత్రంగానే కార్మికులు చేరటంతో ఆర్టీసీలోని ప్రధాన మార్గాలన్నింటిలోకి ప్రైవేటు బస్సులను అనుమతించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 5,100 రూట్లలో ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మిగ తా రూట్లను ఆర్టీసీకి వదిలేయా లని అప్పట్లో నిర్ణయిం చారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కేవలం 1,700 మంది మాత్రమే మిగిలారు. ఐదో తేదీ అర్ధరాత్రి వరకు విధుల్లో చేరిన వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని, మిగతా వారికి సంస్థతో సంబంధం ఉండదని గత శనివారం సీఎం స్వయంగా ప్రకటించారు. ఐదో తేదీ అర్ధరాత్రి వరకు కేవలం 495 మంది మాత్రమే విధుల్లో చేరారు. సమ్మెకు మద్దతివ్వని 1,200 మందితో కలుపుకొంటే ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న వారి సంఖ్య 1,700గా ఉంది. ముఖ్యమంత్రి చెబుతున్నట్టు 5 వేల ఆర్టీసీ బస్సుల(సగం ప్రైవేటు పోను)ను నిర్వహించాలంటే 23 వేల మంది ఉద్యోగులు అవసరమవుతారు. ఇప్పుడు సమ్మెలో ఉన్నవారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించటం లేదని చెబుతున్నందున, ఇక గత్యంతరం లేక మిగతా రూట్లను కూడా ప్రైవేటు బస్సులతోనే నడిపించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియాలతో సీఎం కేసీఆర్ దీనిపై కొద్దిసేపు చర్చించారు. గురువారం హైకోర్టులో వాదనలున్నందున, అక్కడ అనుసరించాల్సిన విషయాలపై ప్రధానంగా చర్చ జరగ్గా, ప్రైవేటు బస్సులకు పర్మిట్ల జారీపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు కూడా స్పందించలేదు. కానీ.. తొలుత 5,100 రూట్లకు సంబంధించి పర్మిట్ల జారీ ప్రక్రియ ప్రారంభించి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఆ తర్వాత మిగతా రూట్లకు సంబంధించి విడుదల చేయాలనే దిశలో చర్చలు జరిగినట్టు సమాచారం. హైకోర్టు ఆదేశాలకనుగుణంగా.. ఏడో తేదీన కోర్టు వాదనల తర్వాత ప్రభుత్వానికి ప్రత్యేక ఆదేశం/సూచన ఉంటుందేమో చూసి తదనుగుణంగా చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమ్మె విరమణ, ఉద్యోగులను తిరిగి తీసుకోవాలనే సూచన... తదితర పరిస్థితి ఎదురైతే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మె ప్రారంభమైన రోజు సాయంత్రం 6 లోపు విధుల్లోకి వచ్చిన వారిని మాత్రమే చేర్చుకుంటామని, రాని వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని ముఖ్యమంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ ఆరోజు ఎవరూ రాలేదు. ఆ తర్వాత మరోసారి.. అర్జీ పెట్టుకుని విధుల్లోకి రావచ్చంటూ పేర్కొన్నారు. ఒకరిద్దరు తప్ప ఎవరూ రాలేదు. గత శనివారం మూడో అవకాశం కల్పించారు. ఇదే చివరిదన్న తరహాలో ఆయన స్పష్టం చేశారు. ఇక మరో అవకాశం విషయంలో ఆయన సుముఖంగా లేరని అధికారులంటున్నారు. ఒకవేళ హైకోర్టు ఆ విషయంలో ఆదేశించినా, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముందని పేర్కొంటున్నారు. కేంద్రం అండ పొందే యోచన ఆర్టీసీ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా చేయాలని కార్మిక సంఘాల జేఏసీ గట్టిగా యత్నిస్తోంది. సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ మద్దతు సంపూర్ణంగా లభిస్తోంది. బీజేపీ నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటూ, స్థానిక అగ్రనేతలు విలేకరుల సమావేశాల ద్వారా కార్మికుల మద్దతును ప్రకటిస్తూ వస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓ అడుగు ముందుకేసి, ఆర్టీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేంద్రం నిశితంగా గమనిస్తోందంటూ చాలాసార్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నేరుగా కేంద్ర హోంమంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ కావాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. లక్ష్మణ్ ద్వారా ఆయన అపాయింట్మెంట్ కోరారు. ఆయన సమయం ఇవ్వగానే ఢిల్లీ వెళ్లి ఆయనను కలసి, ప్రైవేటీకరణ, సిబ్బంది తొలగింపు విషయంలో జోక్యం చేసుకునేలా కోరాలని నిర్ణయించారు. ఆర్టీసీలో కేంద్రం 31% వాటా కలిగి ఉన్నందున, చట్టప్రకారం జోక్యం చేసుకోవాలని గట్టిగా కోరనున్నారు. ఉద్యోగ సంఘాల సాయం కోసం.. సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి డ్యూటీలో చేరకుండా చేయడంలో విజయం సాధించిన కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి సమ్మె ప్రత్యక్ష కార్యాచరణలో పూర్తి మద్దతు కూడగట్టలేకపోయారు. ఇప్పుడు మరోసారి వారి మద్దతు కోసం యత్నిస్తున్నారు. ముఖ్యంగా అన్ని ఉద్యోగ సంఘాలు ఒకరోజు పెన్‌డౌన్ నిరసనలో పాల్గొనేలా చేయాలని నిర్ణయించారు. ఈనెల 8 లేదా 9 తేదీల్లో దీనికి వారిని అంగీకరించేలా చేసే పనిలో ఉన్నారు. సరూర్‌నగర్ సభ తరహాలో ఈ నెల 9న పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించిన చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేసి సామాన్య జనం మద్దతు పూర్తిస్థాయిలో కూడగట్టాలని భావిస్తున్నారు. బకాయిలు చెల్లించండి.. ఆర్టీసీ కార్మికుల సహకార పరపతి సంఘా(సీసీఎస్)నికి రూ.200 కోట్లు చెల్లించాలని హైకోర్టు సూచించటంతోపాటు రూ.452.86 కోట్ల ఎంవీ ట్యాక్స్ చెల్లించాలని ట్రాన్స్‌పోర్టు అథారిటీ తాజాగా హుకుం జారీ చేయటం ఆర్టీసీకి ఇబ్బందిగా పరిణమించింది. గతంలో కార్మికులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు డబ్బుల్లేక, అంతర్గత పనులకు నిధులు లేక కార్మికుల వేతనాల్లోంచి మినహాయించి సహకార పరపతి సంఘానికి చెల్లించే మొత్తాన్ని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకుంది. తాజాగా ఎంవీ ట్యాక్స్ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌పోర్టు అథారిటీ ఆర్టీసీకి శ్రీముఖం జారీ చేసింది. ప్రభుత్వం రాయితీ మొత్తం తరచూ బకాయి పడుతుండటం, ఆర్టీసీ ఎంవీ ట్యాక్స్ రూపంలో ట్రాన్స్‌పోర్టు అథారిటీకి బకాయి పడుతుండటం సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలో కొన్ని నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించే పరిస్థితి లేక ప్రభుత్వం నుంచి బకాయిలు వసూలు చేసుకుని చెల్లిస్తోంది. ఇలాంటి గడ్డు పరిస్థితిలో ఎంవీ ట్యాక్స్ బకాయిలు చెల్లించలేకపోయింది. దీంతో అలా పేరుకుపోయిన రూ.452.86 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ కార్యదర్శి మమతా ప్రసాద్ బుధవారం నోటీసులు జారీ చేశారు. హైకోర్టుపైనే ఆశలు హైకోర్టులో జరుగుతున్న వాదనల ఆధారంగా కోర్టు స్పందిస్తున్న తీరు తమకు అనుకూలంగా ఉందని ముందు నుంచి కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. డిమాండ్ల పరిష్కారానికి వీలుగా చర్చల విషయంలోనూ గురువారం కోర్టు ప్రభు త్వానికి సూచన చేస్తుం దన్న ఆశాభావంతో ఉన్నట్టు చెబుతు న్నారు. సీఎం డెడ్‌లైన్‌తో కార్మికులు విధుల్లో చేరేందుకు ఆసక్తి కనబరిచినా న్యాయపోరాటంలో గెలుస్తామని సంఘాలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాయి. దీంతో సమ్మెలో కొనసాగేం దుకే కార్మిక లోకం మొగ్గుచూపింది. -
తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు అండగా నిలుద్దాం
సాక్షి, విజయనగరం అర్బన్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి అండగా నిలుద్దామని ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. స్థానిక డిపో కార్యాలయం ఎదుట ఆదివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ నెల 19న తెలంగాణ బంద్ సందర్భంగా ఎర్ర బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరై మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సమ్మె 9వ రోజుకు చేరినా అక్కడి ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వెంటనే తెలంగాణ జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రానున్న కాలంలో జేఏసీ రాష్ట్ర కమిటీ ఎలాంటి ఉద్యమానికి పిలుపునిచ్చినా సిద్ధంగా కార్మికులు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి పి.భానుమూర్తి, డిపో అధ్యక్ష, కార్యదర్శులు జీవీఎం రాజు, చవక శ్రీనివాసరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు ఏ.చంద్రయ్య పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మెపై విచారణ 15కు వాయిదా
-
ఆర్టీసీ సమ్మెపై విచారణ 15కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరు పక్షాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాది రామచందర్ రావు, ఆర్టీసీ యాజమన్యం, కార్మిక సంఘాల తరఫున న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. సమ్మె ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై కార్మిక సంఘాలు వివరణనిచ్చాయి. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కార్మిక సంఘాల తరపు న్యాయవాది.. సమ్మెను విరమించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు... పూర్తి వివరాలతో మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. డిమాండ్లు పరిష్కరిస్తే.. తక్షణమే విరమణ అంతకుముందు ఇరుపక్షాలు కోర్టుకు తమ వాదనలు వినిపించాయి. ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన ప్రయత్నం కార్మికులు చేయడం లేదని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలని కార్మికులు సమ్మె బాట పట్టారని కార్మిక సంఘాల తరపున న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు నెల రోజుల ముందే ప్రభుత్వాన్ని కోరారన్నారు. అంతేకాక గత నెల 3, 24, 26 తేదీల్లో ఆర్టీసీకి, ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారని వెల్లడించారు. కార్పొరేషన్ ఫండ్స్ రూ.545 కోట్లతో పాటు ఇతర రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన జీత భత్యాలు, ఇతరత్రా వాటిని పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే కార్మికులు సమ్మెకు వెళ్లారన్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తే.. కార్మికులు వెంటనే సమ్మె విరమిస్తారని రచనా రెడ్డి కోర్టుకు వివరించారు. సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అని ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ రామచందర్ రావు తెలిపారు. కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి సమయం ఇవ్వాలని కోరినా.. వారు వినిపించుకోలేదని కోర్టుకు తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు గత నెల 29వ తేదీన సునీల్ శర్మ ఆధ్వర్యంలో కమిటీ నియమించడం జరిగిందని తెలిపారు. కమిటీ నిర్ణయం తీసుకోకముందే.. కార్మికులు సమ్మెలోకి వెళ్లారన్నారు. సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు తెలిపారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. 2017 వేతన సవరణతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టేందుకు సన్నద్దమవుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) నోటీసులు అందించింది. బస్ భవన్లో ఆర్టీసీ యజమాన్యానికి ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సమ్మె నోటీసులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ ఆర్టీసీ పరిరక్షణకు సంస్థ కృషి చేయాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామి ఇచ్చిన ప్రభుత్వం.. నేటికీ ఏ చర్యా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. జూన్ 13 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. బుధవారం ఆర్టీసీ హౌస్‌లో యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించలేదని కార్మిక నేతలు పేర్కొన్నారు. యాజమాన్యం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. సమ్మె నోటీసులు ఇచ్చి 14 రోజులు అయినా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి చూపుతుందని మండిపడ్డారు.తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు 2013 కి వేతనాల సవరణకు సంబందించిన పెండింగ్ అరియర్సు వెంటనే చెల్లించాలి. 4000 మంది సిబ్బందిని తగ్గించాలంటూ వీసీ, ఎండీలు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అద్దెబస్సుల పెంపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి ఆర్టీసీ బస్సులను పెంచాలి. ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రావాల్సిన రూ.650 కోట్లు వెంటనే చెల్లించాలి. సీసీఎస్ నుంచి ఆర్టీసి యాజమాన్యం వాడుకున్న రూ.285 కోట్ల కార్మికుల సొమ్మును వెంటనే యాజమాన్యం చెల్లించాలి. గ్రాడ్యుటీ, వీఆర్ఎస్ సర్క్యులర్‌లో ఉన్న లోపాలు సరిచేయాలి. కారుణ్యనియామాకాలు వెంటనే చేపట్టాలి. మిగిలి ఉన్న కాంట్రాక్టు కార్మికులను తీసుకోవాలి. అందరినీ రెగ్యూలర్ చెయాలి. ఆర్టీసి పాలకమండలిలో కార్మిక సంఘాలకు బాగస్వామ్యం కల్పించాలి. చట్ట ప్రకారం కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన సౌకర్యాలలో వీసీ, ఎండీ తొలగించిన సౌకర్యాలను పునరుద్దరించాలి. -
సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు
సాక్షి, విజయవాడ : ఆంధ్రపదేశ్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు ఎండీ సురేంద్రబాబుకు సమ్మె నోటీసులు అందించారు. గురువారం ఈయూ కార్యాలయంలో సమావేశమై న ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెపై చర్చించారు. ఇప్పటికే 46 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ మరో 30 డిమాండ్లను కొత్తగా చేర్చి ఎండీ సురేంద్రబాబుకు అందజేశారు. అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో, యూనిట్లలో సమ్మె సన్నాహక ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 17, 18 తేదిలలో అన్ని స్థాయిల ఉద్యోగులు డిమాండ్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. 22న 13 జిల్లాలలో ఉన్న ఆర్ఎమ్ కార్యాలయాలవద్ద జేఏసీ ఆధ్యర్యంలో మహాధర్నా చేపట్టి అదే రోజు సమ్మెతేదిని ప్రకటిస్తామన్నారు. ఈ నెల 22 తర్వాత ఏ క్షణం నుంచైనా సమ్మే జరిగే అవకాశం ఉందని, తమతో ఎన్‌ఎమ్‌యూ కలిసి రావాలని జేఏసీ నేతలు కోరారు. ఆర్టీసీ జేఏసీ ప్రధాన డిమాండ్లు 2013 కి వేతనాల సవరణకు సంబందించిన పెండింగ్ అరియర్సు వెంటనే చెల్లించాలి. 4000 మంది సిబ్బందిని తగ్గించాలంటూ వీసీ, ఎండీలు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అద్దెబస్సుల పెంపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి ఆర్టీసీ బస్సులను పెంచాలి. ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రావాల్సిన రూ.650 కోట్లు వెంటనే చెల్లించాలి. సీసీఎస్ నుంచి ఆర్టీసి యాజమాన్యం వాడుకున్న రూ.285 కోట్ల కార్మికుల సొమ్మును వెంటనే యాజమాన్యం చెల్లించాలి. గ్రాడ్యుటీ, వీఆర్ఎస్ సర్క్యులర్‌లో ఉన్న లోపాలు సరిచేయాలి. కారుణ్యనియామాకాలు వెంటనే చేపట్టాలి. మిగిలి ఉన్న కాంట్రాక్టు కార్మికులను తీసుకోవాలి. అందరినీ రెగ్యూలర్ చెయాలి. ఆర్టీసి పాలకమండలిలో కార్మిక సంఘాలకు బాగస్వామ్యం కల్పించాలి. చట్ట ప్రకారం కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన సౌకర్యాలలో వీసీ, ఎండీ తొలగించిన సౌకర్యాలను పునరుద్దరించాలి. -
‘ఆర్టీసీ నష్టాలకు అధికారులే బాధ్యులు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాలకు కార్మికుల పనితీరుకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం నేతలు తేల్చి చెప్పారు. అధికారుల పనితీరు సరిగా లేకపోవటం, గతంలో తీసుకున్న అప్పులకు ఇప్పటికీ వడ్డీలు చెల్లిస్తుండటం, భారీగా పెరిగిన డీజిల్ ధరల వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందని, దానికి కార్మికులను బాధ్యులను చేయటం సరికాదని స్పష్టంచేశారు. వాస్తవాలను దాచి అధికారులు తప్పుడు లెక్కలతో సీఎంనే తప్పుదారి పట్టించారని ఆరోపించారు. బుధవారం ఆర్థిక మంత్రి ఈటల అధ్యక్షతన మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో మరోసారి ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ప్రతినిధులతో భేటీ అయింది. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో జీతాల కోసం పట్టుపట్టడం, సమ్మె నోటీసు ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం, ఆర్టీసీ అధికారులతో చర్చ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశంలో గుర్తింపు సంఘం నేతలు దానికి కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయటం ఏమాత్రం సరికాదని, నష్టాల బూచి చూపి వేతన సవరణ నుంచి తప్పించుకునే ప్రయత్నం సరికాదని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ సిబ్బంది వేతనాలు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కంటే తక్కువగా ఉన్నాయని సీఎం అన్న మాటలను ఖండించారు. మహారాష్ట్ర లాంటి చోట్ల ఆర్టీసీ కార్మికుల బేసిక్ తక్కువగా ఉన్నా అలవెన్సులు మనకంటే చాలా ఎక్కువని, మొత్తంగా చూస్తే వారి వేతనాలు తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది వేతనాల కంటే ఎక్కువే ఉంటాయని వివరించారు. ‘‘ఢిల్లీ, హరియాణ లాంటి చోట్ల ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? కావాలంటే ఆర్టీసీ అధికారులతో కలసి తాము అధ్యయనానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యమంలో ముందున్న ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవాల్సిందే’’అని పేర్కొన్నారు. జాప్యమైతే 25% ఐఆర్ ప్రకటించండి వేతన సవరణ ఇవ్వటం సాధ్యం కాదనుకుంటే ఇంటీరియమ్ రిలీఫ్ (ఐఆర్) 25 శాతం ప్రకటించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. హరీశ్‌పై గుర్రు: టీఎంయూ గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు బుధవారం నాటి సమావేశానికి హాజరయ్యారు. కానీ ఆయన తమకు అనుకూలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాము డి మాండ్లపై మొత్తుకుంటున్నా ఏమీ పట్టనట్టు కూర్చున్నారని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాదనతో మంత్రులు ఏకీభవించారని, వేతన సవరణ విషయంలో సీఎంతో మరోసారి చర్చిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని సమావేశానంతరం ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణరావు, సంఘం ప్రతినిధులు తిరుపతి, థామస్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేస్తామంటే చేసుకోమనండి ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ఉదంతం ఎప్పుడైనా ఉందా? మా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని తరహాలో కార్మికులు అడిగినదాని కంటే ఎక్కువ ప్రకటిస్తే.. ఇప్పుడు ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారా? వేతన సవరణ చేయకుంటే సమ్మె చేస్తామని హెచ్చరిస్తారా? అదీ రూ.750 కోట్ల మేర వార్షిక నష్టాలున్నప్పుడు... ఏమనుకుంటున్నారు..? చేస్తామంటే చేసుకోమనండి.. చేస్తే అట్నుంచి అటే పోతే?’’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. బుధవారం రాత్రి మంత్రివర్గ ఉప సంఘం, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెరసి కార్మిక సంఘాల డిమాండ్‌కు తగ్గట్టు వేతన సవరణ జరగదనే స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయినా ఈ అంశం మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనలో ఉందని, సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘నేను ఓ దినమంతా ఆర్టీసీ సమీక్షలో గడిపాను. వేల ఆటోలు, బైకులు రోడ్డుమీదకు వచ్చిన తరుణంలో ఆర్టీసీ ఎలా మనుగడ సాగించాలో స్పష్టంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని చెప్పాను. ఆర్టీసీని రక్షించేందుకు రూ.3,400 కోట్ల మొత్తాన్ని విడుదల చేశాం. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు పెట్టాం. అయినా ఇంకా డిమాండ్లు చేస్తే ఏమనాలి? సమ్మె చేస్తామంటే చేసుకోమనండి. కార్మికులు, యాజమాన్యం అంతా కలిసి మునుగుతారు’’అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లాంటి కొన్ని రాష్ట్రాల్లో అసలు ఆర్టీసీలే లేవని, కేరళలో బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుంటే వారు పట్టించుకోకుండా సమ్మెకు పోతామంటే చేసేదేముంటుందని ప్రశ్నించారు. అధికారులు తనకు ఇచ్చిన లెక్కలు తప్పులని, నన్ను తప్పుదోవ పట్టించారని కార్మిక సంఘాలు అనడం తప్పన్నారు. ఓ ముఖ్యమంత్రికి తప్పుడు లెక్కలు ఎలా ఇవ్వగలుగుతారని, వాస్తవ పరిస్థితిని తనకు అధికారులు వివరించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ విషయంలో పూర్తి సానుకూలత వ్యక్తం చేయటమే కాకుండా ఉద్యోగుల పనితీరుపై అభినందనల వర్షం కురిపించిన సీఎం.. అదే వేదికపై ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై విమర్శల వర్షం కురిపించటం విశేషం. -
'ఎర్ర' ఉచ్చులో ఆర్టీసీ డ్రైవర్లు అరెస్ట్
► ఆరుగురిని అదుపులోకి తీసుకున్న వైఎస్సార్ జిల్లా పోలీసులు ► తమిళ కూలీలు, మేస్త్రీలతో సత్సంబంధాలు ► ఇప్పటికే ముగ్గురి అరెస్ట్ కావలి : ఎర్రచందనం నరికే తమిళ కూలీలు, మేస్త్రీలతో కావలి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ల బంధంలో మరి కొందరి పాత్ర వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన వైఎస్సార్ జిల్లా పోలీసులు.. సోమవారం మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి కావలికి వచ్చే బస్సుల్లో ఎర్ర చందనం చెట్లు నరికే తమిళ కూలీలను వైఎస్సార్ జిల్లా అడవుల్లో దించారని, అందుకు ఈ కూలీల మేస్త్రీలతో సంబంధాలు పెట్టుకుని ఒక్కొ కూలీ వద్ద టికెట్ ఛార్జీ కన్నా అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు తీసుకున్నట్లు పోలీసుల అభియోగం. ఇప్పటికే ముగ్గురు డ్రైవర్లను గత నెల 24న అదుపులోకి తీసుకున్న వైఎస్సార్ జిల్లా పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. వీరిచ్చిన సమాచారంతో పాటు పోలీసులు దగ్గరున్న సమాచారంతో తాజాగా ఆదివారం షేక్ మాబు సుభాని (టంగుటూరు ప్రకాశం జిల్లా), ఎన్. మాలకొండారెడ్డి (కుమ్మరకొండూరు కలిగిరి మం డలం), పి.ప్రభాకర్ (జలదంకి), ఎస్.వెంకటేశ్వర్లు (నెల్లూరు) కడప పోలీసులు విచారణ పేరుతో తీసుకెళ్లగా, సోమవారం ఎస్.సురేష్ (సింగరాయకొండ ప్రకాశం జిల్లా), సుధాకర్ (కుమ్మరకొండూరు కలిగిరి మండలం)ను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన బాటలో కార్మికులు ఈ పరిణామాలపై ఎన్ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేయ డానికి రంగంలోకి దిగాయి. తొలుత ముగ్గురు డ్రైవర్లను తీసుకెళ్లిన కడప పోలీసులను ఆర్టీసీ అధికారులు కారణాలు అడిగినా చెప్పలేదు. అరెస్ట్ చూపిన తర్వాత కూడా కనీసం ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడానికి కూడా పోలీసులు ఇష్టపడలేదు. ఇదిలా ఉండగానే మరో ఆరుగురు డ్రైవర్లను పోలీసులు తీసుకెళ్లడంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కార్మిక సంఘాలకు ఏమి చెప్పాలో అధికారులకు అర్థంకాక, వారితో సామరస్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే కార్మిక సంఘాల నాయకులతో డిపో మేనేజర్ వై.సుష్మ సమావేశమై సమీక్షించారు. ఆందోళనకు సిద్ధమవుతామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. విధి నిర్వహణలో డ్రైవర్లు తప్పు చేయకపోతే అన్ని రకాలుగా అండగా ఉంటామని డిపో మేనేజర్ కార్మిక నాయకులకు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో డ్రైవర్ మాబు సుభాని తల్లి రాజాబీ డీఎంను కలిసి నా బిడ్డ ఏమయ్యాడని బోరున విలపించింది. అనంతరం మూడు సంఘాల నాయకులు, కార్మికులు డిపో మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఎన్ఎంయూ కావలి డిపో కార్యదర్శి ఎస్కేఎం మస్తాన్, అధ్యక్షుడు నాగరాజరావు, ఈయూ కార్యదర్శి విజయబాబు, అధ్యక్షుడు వి.ప్రసాద్, ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యదర్శి ప్రసాద్, అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. సింగిల్ డ్రైవర్లే టార్గెట్ కావలి డిపో నుంచి బెంగళూరుకు బద్వేల్ మీదగా నాలుగు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. వాటిలో రెండు బస్సులకు సింగిల్ డ్రైవర్లు డ్యూటీ చేస్తున్నారు. మరో రెండు బస్సులకు ఇద్దరు డ్రైవర్లు డ్యూటీలో ఉంటారు. కడప పోలీసులు సింగిల్ డ్రైవర్లు డ్యూటీ చేసే వారినే టార్గెట్ చేయడం గమనార్హం. సింగిల్ డ్రైవర్లుగా డ్యూటీ చేసేవారు ఈ రూట్లో 14 మంది ఉన్నారు. వారిలో ఇప్పటికి ముగ్గురు డ్రైవర్లను అరెస్ట్ చేయగా, తాజాగా మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉండి వి«ధులకు హాజరుకావడం లేదు. మిగిలిన నలుగురు మాత్రం డ్యూటీలోనే ఉన్నారు. డ్రైవర్లను కడప పోలీసులు పంచుకుని విచారణ ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోలీసులతో నియమించిన ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. అయితే ఇప్పటికే ఎర్ర చందనం తరలింపుపై కేసులు నమోదైన మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట పోలీసులు ఆరుగురు డ్రైవర్లను పంచుకుని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. -
'ఆర్టీసీ బకాయిలను విడుదల చేయాలి'
ఒంగోలు : ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఒంగోలు డిపో కార్యదర్శి జి.మాధవరావు డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో ఎస్డబ్లూ్యఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ నష్టాలకు కారణం ప్రభుత్వ చర్యలేనన్నారు. అక్రమ రవాణాద్వారా ఆర్టీసీకి ఏడాదికి 2 వేల కోట్ల నష్టం వాటిల్లుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆర్టీసీకి డీజిల్‌పై టాక్స్ రద్దుచేయాలని, మోటార్ వెహికల్ ట్యాక్స్‌కు కనీసం 5 సంవత్సరాలు హాలిడే ప్రకటించాలన్నారు. టోల్గేట్ ఫీజు, వ్యాట్టాక్స్ మినహాయింపులు ఇచ్చి ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. నష్టాల పేరుతో గ్రామీణ ప్రాంత సర్వీసులు రద్దుచేయడం మానుకోవాలన్నారు. పనిభారం పెంపు పేరుతో ఇప్పటికే ప్రకాశం రీజియన్‌లో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, చిత్తూరు రీజియన్‌కు డిప్యుటేషన్‌పై పంపిన కార్మికులను ప్రకాశం రీజియన్‌కు పిలిపించాలని కోరారు. అధికారులు కూడా దుబారా ఖర్చు తగ్గించుకొని ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజనల్ నాయకులు ఎస్కే మీరావలి, వీఎన్‌రెడ్డి, ఎస్కే మాబు, బి.వెంకట్రావు, ఎస్పి విజయ్‌కుమార్, షేక్ కబీర్, సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల మద్దతు
అమరావతి : జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న జరిపే సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ యూనియన్లు సంఘీభావం ప్రకటించాయి. ఈ మేరకు వైఎస్సార్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లు బుధవారం వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశాయి. రోడ్ సేఫ్టీ బిల్లు పేరుతో ఎంవీ యాక్టు మార్పుచేయడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థలకు ఇబ్బందులు తలెత్తుతాయని, రవాణా బిల్లును పార్లమెంట్లో అడ్డుకోవాలని ఎంపీలకు యూనియన్ నేతలు వినతి చేశారు. సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ విధులకు ఎర్ర బ్యాడ్జీలు ధరించి హాజరవుతామని నేతలు పేర్కొన్నారు. వైఎస్సార్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నేత రాజారెడ్డి, నేషనల్ మజ్దూర్ యూనియన్ నేత చంద్రయ్యలు వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు. -
మీ కోరికలు న్యాయబద్ధం
-
మీ కోరికలు న్యాయబద్ధం
కర్నూలు: ఆర్టీసీ కార్మికుల కోర్కెలు న్యాయబద్ధమైనవేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు బుధవారం వైఎస్ జగన్ ను కలిసి, తమ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడంతో ఈ మేరకు వారికి ఆయన భరోసా ఇచ్చారు. వేతన సవరణలో తమకు 43శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలన్న కార్మిక సంఘాలు ఆ డిమాండ్‌తో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి. దీంతో వారు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసింది. -
నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె...
-
'సీఎం లేరు, సమయం కావాలి'
హైదరాబాద్: వేతన సవరణపై కార్మికశాఖతో ఆర్టీసీ యూనియన్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేతన సవరణపై మరికొంత సమయం కావాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. సీఏం చంద్రబాబు అందుబాటులో లేనందున వెంటనే నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. ఈ నెల 18లోపు వేతన సవరణపై ప్రకటన చేయాలని ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ), టీఎమ్ యూ డిమాండ్ చేశాయి. ఈనెల 22 తర్వాత సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ కార్మికులకు యూనియన్ నేతలు పద్మాకర్, అశ్వద్థామరెడ్డి పిలుపునిచ్చారు. -
ఆర్టీసీ కార్మిక సంఘాల్లో ఎన్నికల వివాదం
ఎన్నికలు వస్తే వేతన సవరణ ప్రక్రియకు బ్రేక్ నివారణ చర్యల్లో గుర్తింపు సంఘం కూటమి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కార్మిక సంఘాల మధ్య చిచ్చు రగిలింది. వేతన సవరణ కోసం ఓవైపు సమ్మెకు కార్మికులు సై అంటున్న తరుణంలో గుర్తింపు సంఘాల ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడిది కార్మికుల్లో కొత్త వివాదాన్ని రగిలించింది. ఎన్నికల నగారా మోగితే కోడ్ అమలులోకి వస్తుంది. దాంతో వేతన సవరణ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూని యన్(టీఎంయూ)ల కూటమి గుర్తింపు సంఘంగా వ్యవహరిస్తోంది. రెండేళ్ల కాలం ముగియటంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) నేతలు కొందరు ఇటీవల ఆ కూటమి గుర్తింపు హోదాను సవాల్ చేస్తూ కార్మికశాఖకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమా అని కార్మిక శాఖ ప్రశ్నించగా అందుకు సిద్ధమని ఆర్టీసీ యాజమాన్యం చెప్పింది. దీంతో కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి కార్మిక సంఘాల సమావేశం నిర్వహించినప్పటి నుంచి ఎన్నికల కోడ్ మొదలవుతుంది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు వేతన సవరణ ప్రక్రియ నిలిచిపోనుంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా తమకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలంటూ ఇప్పటికే గుర్తింపు కార్మిక సంఘాల కూటమి యాజమాన్యాన్ని కోరింది. దానివల్ల వార్షికంగా ఆర్టీసీపై పడే రూ.1,800 కోట్ల భారాన్ని సంస్థ భరించలేదని యాజమాన్య తేల్చటం.. దీంతో ఈనెల 15లోపు నిర్ణయం రానిపక్షంలో 16 నుంచి సమ్మె చేస్తామం టూ నోటీసు జారీచేయటం వెంటవెంటనే జరిగిపోయా యి. ఇలాంటి తరుణంలో ఎన్నికల కోడ్ వచ్చి వేతన సవరణ ప్రక్రియ ఆగిపోతుందనే అంశం కలకలం రేపుతోం ది. దీంతో కార్మికశాఖ యూనియన్లతో సమావేశం ఏ ర్పాటు చేయకుండా గుర్తింపు సంఘాలు యత్నిస్తున్నాయి.