సాక్షి, విజయవాడ : ఆంధ్రపదేశ్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు ఎండీ సురేంద్రబాబుకు సమ్మె నోటీసులు అందించారు. గురువారం ఈయూ కార్యాలయంలో సమావేశమై న ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెపై చర్చించారు. ఇప్పటికే 46 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ మరో 30 డిమాండ్లను కొత్తగా చేర్చి ఎండీ సురేంద్రబాబుకు అందజేశారు. అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో, యూనిట్లలో సమ్మె సన్నాహక ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 17, 18 తేదిలలో అన్ని స్థాయిల ఉద్యోగులు డిమాండ్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. 22న 13 జిల్లాలలో ఉన్న ఆర్‌ఎమ్ కార్యాలయాలవద్ద జేఏసీ ఆధ్యర్యంలో మహాధర్నా చేపట్టి అదే రోజు సమ్మెతేదిని ప్రకటిస్తామన్నారు. ఈ నెల 22 తర్వాత ఏ క్షణం నుంచైనా సమ్మే జరిగే అవకాశం ఉందని, తమతో ఎన్‌ఎమ్‌యూ కలిసి రావాలని జేఏసీ నేతలు కోరారు.
ఆర్టీసీ జేఏసీ ప్రధాన డిమాండ్లు
- 2013 కి వేతనాల సవరణకు సంబందించిన పెండింగ్ అరియర్సు వెంటనే చెల్లించాలి.
- 4000 మంది సిబ్బందిని తగ్గించాలంటూ వీసీ, ఎండీలు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలి.
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
- అద్దెబస్సుల పెంపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి
- ఆర్టీసీ బస్సులను పెంచాలి.
- ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రావాల్సిన రూ.650 కోట్లు వెంటనే చెల్లించాలి.
- సీసీఎస్ నుంచి ఆర్టీసి యాజమాన్యం వాడుకున్న రూ.285 కోట్ల కార్మికుల సొమ్మును వెంటనే యాజమాన్యం చెల్లించాలి.
- గ్రాడ్యుటీ, వీఆర్‌ఎస్ సర్క్యులర్‌లో ఉన్న లోపాలు సరిచేయాలి.
- కారుణ్యనియామాకాలు వెంటనే చేపట్టాలి.
- మిగిలి ఉన్న కాంట్రాక్టు కార్మికులను తీసుకోవాలి. అందరినీ రెగ్యూలర్ చెయాలి.
- ఆర్టీసి పాలకమండలిలో కార్మిక సంఘాలకు బాగస్వామ్యం కల్పించాలి.
- చట్ట ప్రకారం కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన సౌకర్యాలలో వీసీ, ఎండీ తొలగించిన సౌకర్యాలను పునరుద్దరించాలి.
Comments
Please login to add a commentAdd a comment