strike notice
-
ఆర్టీసీలో సమ్మె నోటీసు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయంలో ఆర్టీసీ(RTC) యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీలోని కొన్ని సంఘాలు, మరికొన్ని సంఘాల్లోని చీలిక వర్గాలు సోమవారం సాయంత్రం సమ్మె నోటీసు జారీ చేశాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులో ఉండటంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్‌ను కలిసి నోటీసు, డిమాండ్ల జాబితాను అందజేశాయి. ఆర్టీసీ యాజమాన్యం స్పందించని పక్షంలో ఫిబ్రవరి 9 నుంచి లేదా, ఆ తర్వాత ప్రకటించే తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించాయి. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ థామస్‌రెడ్డి వర్గం, ఎన్ఎంయూ మౌలానా వర్గం, బీకేయూ, బీడబ్ల్యూయూ, కార్మిక పరిషత్‌లు సమ్మె నోటీసు జారీ చేశాయి. 21 డిమాండ్లతో.. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ జరగక ఉన్న సిబ్బందిపై అదనపు భారం, ఆర్టీసీలో అద్దె బస్సులు పెరిగి పోస్టుల సంఖ్య తగ్గిపోతుండటం, అద్దె ప్రాతిపదికన తీసుకునే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వాహకులకు డిపోలు అప్పగించే యోచన, ఆర్టీసీ సొంతానికి వాడుకున్న సహకార పరపతి సంఘం, పీఎఫ్ ట్రస్టు నిధులను తిరిగి చెల్లించకపోవటం... ఇలా మొత్తం 21 డిమాండ్లను సంఘాలు ఆర్టీసీ అధికారుల ముందుంచాయి. కార్మికుల్లో అయోమయం.. సమ్మె విషయంలో ఆర్టీసీలోని సంఘాలు ఐక్యంగా లేకపోవటం ఇప్పుడు కార్మికుల్లో అయోమయానికి కారణమైంది. ⇒ గతంలో ప్రధాన సంఘాలుగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ముఖ్యనేత రాజిరెడ్డి వైదొలిగి కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ఎస్డబ్ల్యూయూలో ఉన్నారు. ఇప్పుడు ఆ సంఘం సమ్మెకు దూరంగా ఉంది. ⇒ మరో ప్రధాన సంఘం టీఎంయూలో అశ్వత్థామరెడ్డి, తిరుపతి వర్గం సమ్మెకు దూరంగా ఉంది. ⇒ ఎన్‌ఎంయూలో నరేందర్ వర్గం సమ్మెను వ్యతిరేకిస్తోంది. మిగతా సంఘాలు కూడా సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ⇒ ఇప్పుడు సమ్మెకు దూరంగా ఉన్న ఎస్‌డబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌లు ఈనెల 24, 25 తేదీల్లో డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ⇒ ప్రస్తుతం సమ్మెకు దూరంగా ఉన్న సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యలను కలుస్తూ డిమాండ్ల పరిష్కారానికి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇలా రెండు వర్గాలుగా విడిపోయిన సంఘాలు, వాటి చీలిక వర్గాల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో కార్మికుల్లో కూడా చీలిక ఏర్పడుతోంది. వచ్చే నెల 9 తర్వాత ఎప్పుడైనా సమ్మె మొదలు ‘చాలాకాలంగా ఉన్న సమస్యల విషయంలో యాజమాన్యం తీరుతో విసిగిపోయి సమ్మె నోటీసు ఇచ్చాం. వచ్చే నెల 9 తర్వాత ఎప్పుడైనా సమ్మె ప్రారంభిస్తాం. ఇప్పటికే సగం డిపోల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. మిగతా డిపోల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తాం’అని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు. -
కరెంటోళ్ల సమ్మెపై జోక్యం చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసుపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖను తెలంగాణ ట్రాన్స్‌కో కోరింది. ఈ మేరకు పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలతో చర్చలకు సంయుక్త సమావేశానికి ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌కు గురువారం లేఖ రాశారు. వేతన సవరణ, ఇతర డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఈ నెల 17న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ తెలంగా ణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఇటీవల యాజ మాన్యాలకు నోటిసులు అందజేసిన విషయం తెలి సిందే. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రజలు తీవ్ర అసౌకర్యాలకి గురి అవుతారని, సమ్మెకు వెళ్లకుండా వారితో రాజీ కుదర్చాలని కార్మిక శాఖ కమిషనర్‌ను తాజా లేఖలో ట్రాన్స్‌కో సీఎండీ కోరారు. మళ్లీ చర్చలకు సిద్ధం.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీలతో ఇప్పటికే ఐదు దఫాలుగా చర్చలు జరిపి 6శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలుకు హామీ ఇచ్చామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో వరుసగా 30శాతం, 35శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయడం, సర్విసు వెయిటేజీ, ఇతర ప్రయోజనాలను కల్పించడంతో ఉద్యోగుల వ్యయం గణనీయంగా పెరిగిందన్న అంశాన్ని సైతం జేఏసీలకు తెలియజేశామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలతో పోల్చితే రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రయోజనాలు అధికంగా ఉన్నట్టు జేఏసీలకు వివరించినట్టు పేర్కొన్నారు. యాసంగి పంటల సాగు, పదో తరగతి వార్షిక పరీక్షలు, టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయని జేఏసీలకు వివరించామన్నారు. తదుపరి చర్చలకు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని, సమ్మె పిలుపును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇటీవల తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీకి లేఖ సైతం రాసినట్టు ప్రభాకర్‌రావు వెల్లడించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితికి లోబడి డిమాండ్ల పరిష్కారానికి మళ్లీ చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఏర్పాట్లు చేయాలని కార్మికశాఖ కమిషనర్‌ను కోరారు. విద్యుత్ సమ్మె తథ్యం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ స్పష్టికరణ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు ఆత్మస్థైర్యంతో ఈ నెల 17 నుంచి సమ్మెకు సిద్ధం కా వాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, కన్వీనర్లు సాయిబాబు, రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు. సమ్మెలపై నిషేధాలు, చట్టాల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఎదురుదాడికి దిగాయని దుయ్యబట్టారు. సమ్మె తథ్యమని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని హెచ్చరిస్తూ జేఏసీకి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు లేఖ రాయ డాన్ని ఖండిస్తూ గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అత్యవసర సేవలైనందున విద్యుత్ సంస్థల్లో ప్రతి 6 నెలలకోసారి సమ్మెలపై నిషేధాన్ని పొడిగించడం ఆనవాయితీ అని, ఏ రోజూ ఈ ఉత్తర్వులను ఉద్యోగులు అతిక్రమించలేదని గుర్తుచేశారు. పీఆర్సీ అమలుపై ఏడాదిగా కాలయాపన చేస్తూ ఇప్పుడు పరీక్షా సమయం, యాసంగి కాలం అని పేర్కొనడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ అని యాజమాన్యాలు పేర్కొనడం అన్యాయ మన్నారు. గుజరాత్లో ఉద్యోగుల జీతాలు ఇక్కడి కంటే అధికమని పేర్కొన్నారు. 23 వేల మంది ఆర్టీజన్లు తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వారికికూడా న్యా యం చేయాలన్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు, ఆ ర్టీజన్లు, పెన్షనర్లకు మెరుగైన పీఆర్సీ వర్తింపజేయాలని, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సదుపాయం, ఆ ర్టీజన్ల సమస్యలను పరిష్క రించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో 17 నుంచి సమ్మె తథ్యమన్నారు. సమ్మెతో వినియోగదారులు, రైతులు, పరిశ్రమలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. -
సమ్మే పరిష్కార మార్గమా? ఆలోచించండి!
మొత్తం మీద ఏపీలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య యుద్ధం మొదలైనట్లే తోస్తున్నది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని, ఉద్యోగ సంఘాలను విమర్శించలేం లేదా సమర్ధించలేం. తమ నిస్సహాయతను ప్రభుత్వం ఉద్యోగ సంఘాల వారికి తెలియజేసింది. ఉద్యోగ సంఘాలవారు తమకు అన్యాయం జరిగిందని అంటున్నారు. గతంలో మనం ఇలాంటి యుద్ధాలను ఎన్నో చూశాము. రేపు వాళ్ళు వాళ్ళు ఒకటైపోతారు. ఇవాళ తిట్టిన నోళ్లే రేపు జై కొడతాయి. ఇదేం కొత్త కాదు. మెరుగైన జీతాల కోసం ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యవచ్చు. సమ్మె చేసి తమ ఆందోళనా తెలియచేయవచ్చు. కానీ ఇటువంటి సమయాల్లో ప్రభుత్వ సారథులు కఠినంగా వ్యవహరిస్తే... కోర్టులు కూడా వారికే అండగా నిలిచిన ఉదాహరణలు చరిత్రలో కనిపిస్తున్నాయి. తమిళనాడు ఉద్యోగులు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగారు. జయలలిత ఆగ్రహించి లక్షా డెబ్భైవేల మంది ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించారు. దీంతో ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సమ్మె అనేది ఉద్యోగుల హక్కు కాదని, ఉద్యోగులను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, అయితే మానవీయ కోణంలో చూసి... డిస్మిస్ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని జయలలితకు సూచించింది. ఇక్కడ తమిళనాడు పభుత్వానికి కోర్ట్ సూచించిందే తప్ప దాని నిర్ణయాన్ని తప్పు పట్టి ఆదేశించలేదు. కోర్టు తీర్పుతో చేసేది లేక డిస్మిస్ అయిన ఉద్యోగులు అందరూ ప్రభుత్వానికి మళ్ళీ సమ్మె జోలికి వెళ్లబోమని లిఖిత పూర్వకంగా ఎవరికి వారు హామీ పత్రాలు ఇవ్వడంతో తిరిగి ఉద్యోగంలోకి తీసుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లినప్పుడూ వారికి చుక్కెదురైంది. సుమారు యాభైవేలమంది ఆర్టీసీ కార్మికులు రెండు నెలలపాటు సమ్మె చేసినపుడు కేసీఆర్ చాలా దృఢంగా వ్యవహరించారు. ప్రైవేట్ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. బస్సు సర్వీ సులు ఆగకుండా చూశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చెయ్యాలని కూడా ఒకదశలో కేసీఆర్ ప్రకటించినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొన్న ఘట్టాలను గుర్తుంచుకుని... అంత తీవ్రచర్యకు పూనుకోలేదు. అలాగని మెత్తబడలేదు. ఆర్టీసీ కార్మికులు హైకోర్టుకు వెళ్లారు. సమ్మె సమస్య, డిమాండ్ల సమస్య లేబర్ కమిషనర్ చూసుకోవాలి తప్ప హైకోర్టు ఏమీ చెయ్యలేదని, లేబర్ కోర్టుకు వెళ్లండని హైకోర్టు స్పష్టం చెయ్యడంతో కార్మికులు డీలాపడి పోయి సమ్మె విరమించారు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పట్ల కనికరం చూపి... వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడమే కాకుండా సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లించింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్రెడ్డి ఎంతో ఉదారస్వభావం కలిగిన వ్యక్తి. కరోనా కష్టకాలంలో పేదలు ఆత్మహత్యలకు పాల్పడకుండా వారికి ఆర్థికసాయాలు అందించి ఆదుకున్న సంగతి తెలుసు. ఆర్థికంగా రాష్ట్రం బాగా దెబ్బతిని ఉంది. ఇలాంటి పరి స్థితుల్లో తాము సమ్మెబాట పట్టడం సబబేనా అని ఉద్యోగులు ఆలోచించుకోవాలి. (చదవండి: బీఎస్ఎన్ఎల్కు అన్యాయం...ప్రైవేటులో భాగస్వామ్యం!) ప్రభుత్వం కూడా ఉద్యోగుల న్యాయమైన కోరికలను తప్పకుండా పరిశీలిస్తామని, ఆర్థిక వెసులుబాటు కలిగినపుడు వారికి ప్రయోజనాలు అందిస్తామని చెప్పి ఉద్యోగులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో ఒక భాగం. కరోనా మహమ్మారి వంటి కీలక సమయాల్లో సమ్మెకు దిగితే ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా వారు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. (చదవండి: వారూ, వీరూ ఎదుర్కొనే పీడన ఒక్కటే!) - ఇలపావులూరి మురళీ మోహనరావు సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
హీటెక్కిన ఆర్టీసీ.. సమ్మె రూటులో
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఇప్పటికే ఎంప్లాయీస్ యూనియన్, టీజేఎంయూ సమ్మె నోటీసు ఇవ్వగా, గుర్తింపు కార్మిక సంఘమైన టీఎంయూ, మరో ప్రధాన సంఘం ఎన్‌ఎంయూలు బుధవారం నోటీసులిచ్చాయి. టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు బస్‌భవన్‌లో ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మకు సమ్మె నోటీసు ఇచ్చారు. ఎన్ఎంయూ నేతలు కూడా మంత్రి సమక్షంలోనే ఇన్చార్జి ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బస్‌భవన్‌లో అత్యవరసర భేటీ అయ్యారు. అయితే రవాణా శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించడంతో ఆర్టీసీ, రవాణా శాఖలపై అవగాహన, అధికారులతో పరిచయం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. సంస్థ ప్రస్తుత పరిస్థితి, అప్పులు, వాటిపై చెల్లిస్తున్న వడ్డీ, వేతనాలకు డబ్బుల్లేని పరిస్థితి ఉందని అధికారులు వివరించారు. ఆర్టీసీలో సమ్మె మొదలైతే తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. వీటిపై తాను ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీకి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదలయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ కూడా సొంత వనరులు పెంచుకోవాలని, ఆదాయాన్ని పెంచుకునేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా సంస్థ స్వరూపం, బస్సుల నిర్వహణ, సంస్థాగత విషయాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కాగా, సమావేశానికి ముందు ఎన్ఎంయూ నేత నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో బస్‌భవన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్లో ఆర్టీసీకి కేవలం రూ.550 కేటాయించటం సంస్థను అవమానపరచడమే అని ఆరోపించారు. రూ.800 కోట్ల పాతబకాయిలు చెల్లించి బడ్జెట్ కేటాయింపులను కనీసం రూ.3 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లపై తాను సీఎంతో మాట్లాడతానని, ఎవరూ తొందరపడొద్దని కార్మిక సంఘాల నేతలకు మంత్రి హామీ ఇచ్చారు. రవాణా శాఖ అధికారులతోనూ.. రవాణా శాఖ అధికారులతోనూ మంత్రి సుదీర్ఘరంగా చర్చించారు. రవాణా శాఖ సమకూర్చుకుంటున్న ఆదాయంతో పాటు విధివిధానాలను మంత్రి తెలుసుకున్నారు. శాఖలో పారదర్శకత కోసం ఆన్లైన్ విధానంతో పాటు ఎం–వాలెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు చెక్‌పోస్టుల దగ్గర వాహనాలను తనిఖీ చేయడం, అక్రమ రవాణాను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 2019 ఆగస్టు వరకు రూ.1,418 కోట్లు ఆదాయం వచ్చిందని, రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగేలా ఉన్న వాహనాల నియంత్రణపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలు పురుషోత్తం నాయక్, టీవీ రావు, యాదగిరి, రవాణా శాఖ సంయుక్త కమిషనర్లు రమేశ్, పాండురంగ నాయక్‌తోపాటు పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. 2017 వేతన సవరణతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టేందుకు సన్నద్దమవుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) నోటీసులు అందించింది. బస్ భవన్లో ఆర్టీసీ యజమాన్యానికి ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సమ్మె నోటీసులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ ఆర్టీసీ పరిరక్షణకు సంస్థ కృషి చేయాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామి ఇచ్చిన ప్రభుత్వం.. నేటికీ ఏ చర్యా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు
-
సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు
సాక్షి, విజయవాడ : ఆంధ్రపదేశ్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు ఎండీ సురేంద్రబాబుకు సమ్మె నోటీసులు అందించారు. గురువారం ఈయూ కార్యాలయంలో సమావేశమై న ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెపై చర్చించారు. ఇప్పటికే 46 డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ మరో 30 డిమాండ్లను కొత్తగా చేర్చి ఎండీ సురేంద్రబాబుకు అందజేశారు. అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో, యూనిట్లలో సమ్మె సన్నాహక ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 17, 18 తేదిలలో అన్ని స్థాయిల ఉద్యోగులు డిమాండ్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. 22న 13 జిల్లాలలో ఉన్న ఆర్ఎమ్ కార్యాలయాలవద్ద జేఏసీ ఆధ్యర్యంలో మహాధర్నా చేపట్టి అదే రోజు సమ్మెతేదిని ప్రకటిస్తామన్నారు. ఈ నెల 22 తర్వాత ఏ క్షణం నుంచైనా సమ్మే జరిగే అవకాశం ఉందని, తమతో ఎన్‌ఎమ్‌యూ కలిసి రావాలని జేఏసీ నేతలు కోరారు. ఆర్టీసీ జేఏసీ ప్రధాన డిమాండ్లు 2013 కి వేతనాల సవరణకు సంబందించిన పెండింగ్ అరియర్సు వెంటనే చెల్లించాలి. 4000 మంది సిబ్బందిని తగ్గించాలంటూ వీసీ, ఎండీలు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అద్దెబస్సుల పెంపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి ఆర్టీసీ బస్సులను పెంచాలి. ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రావాల్సిన రూ.650 కోట్లు వెంటనే చెల్లించాలి. సీసీఎస్ నుంచి ఆర్టీసి యాజమాన్యం వాడుకున్న రూ.285 కోట్ల కార్మికుల సొమ్మును వెంటనే యాజమాన్యం చెల్లించాలి. గ్రాడ్యుటీ, వీఆర్ఎస్ సర్క్యులర్‌లో ఉన్న లోపాలు సరిచేయాలి. కారుణ్యనియామాకాలు వెంటనే చేపట్టాలి. మిగిలి ఉన్న కాంట్రాక్టు కార్మికులను తీసుకోవాలి. అందరినీ రెగ్యూలర్ చెయాలి. ఆర్టీసి పాలకమండలిలో కార్మిక సంఘాలకు బాగస్వామ్యం కల్పించాలి. చట్ట ప్రకారం కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన సౌకర్యాలలో వీసీ, ఎండీ తొలగించిన సౌకర్యాలను పునరుద్దరించాలి. -
సంక్రాంతికి సమ్మె తప్పదు!
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సంక్రాంతి పండక్కి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. జనవరి 4 తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసి ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలతో ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎంప్లాయిస్ యూనియన్ నేతలు సోమవారం ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఎండీ సురేంద్రబాబులను కలిసి సమ్మె నోటీసును అందించారు. జనవరి 13 తర్వాత సమ్మెకు వెళతామని యాజమాన్యానికి తేల్చి చెప్పడంతో యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఆర్టీసీ కార్మికులకు ప్రతి నాలుగేళ్లకోమారు జరగాల్సిన వేతన సవరణ 2017 ఏప్రిల్ 1 నుంచి జరగలేదు. అప్పట్లో యాజమాన్యం ఆర్టీసీ నష్టాలను సాకుగా చూపి 19% మధ్యంతర భృతితో సరిపెట్టారు. వేతన సవరణ గడువు దాటి 17 నెలలు కావడం, ఇప్పటికే చర్చలు పలుమార్లు వాయిదా పడటంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుండటంపై కార్మికులు మండిపడుతున్నారు. ఫిట్మెంట్ 50% ఇవ్వాల్సిందేనని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఎంప్లాయిస్ యూనియన్ నేతలు సమ్మె నోటీసిచ్చారు. ఈ నోటీసుకు ఆర్టీసీలో మిగిలిన సంఘాలు మద్దతు ప్రకటించాయని ఈయూ నేతలు ప్రకటించారు. అయితే జనవరి 3న ఆర్టీసీ యాజమాన్యం ఈయూ నేతలతో వేతన సవరణపై చర్చలు జరపనుంది. సమ్మె నోటీసులో 18 డిమాండ్లు ఈయూ నేతలు ఇచ్చిన సమ్మె నోటీసులో 18 డిమాండ్లు ఉన్నాయి. ఫిట్మెంట్ 50 శాతంతో పాటు అలవెన్సులు వంద శాతం ఇవ్వాలని, డీజిల్ కొనుగోలుకు రాయితీ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సిబ్బంది కుదింపు చర్యలు ఉపసంహరించుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. యాజమాన్యం రెండ్రోజుల్లో చర్చలు జరిపేందుకు హామీ ఇచ్చిందని, కార్మికులకు అనుకూలంగా నిర్ణయాలు లేకుంటే సమ్మె తప్పదని ఈయూ నేతలు వైవీ రావు, పద్మాకరరావులు మీడియాకు వివరించారు. జనవరి 4న ఆర్టీసీలో అన్ని సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈయూ నేతలు ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యను కలిసి సమ్మె నోటీసు అందించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈయూ నేతలు సమాధానమివ్వగా, సీఎం చంద్రబాబు రూ.20 కోట్లు కేటాయిద్దామని తనకు చెప్పారని వర్ల రామయ్య యూనియన్ నేతలతో వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఏపీఎస్ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
-
ఏపీఎస్ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో(ఏపీఎస్ఆర్టీసీ) సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) నేతలు సోమవారం ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుని కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సమ్మె నోటీసుకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా మద్దతు ప్రకటించింది. ఈ నోటీసులో ఆర్టీసీ కార్మికులు తమ ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు. 50 శాతం వేతన సవరణతో పాటు అలవెన్సులు వంద శాతం పెంచాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నోటీసులో పేర్కొన్నారు. సంస్థ నష్టాలకు అనుగుణంగా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ కార్మికుల పదవి విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలన్నారు. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజిల్‌పై రాయితీ ఇవ్వాలని, ఖాళీ ఉద్యోగాల భర్తీ, కార్మికుల ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బలవంతంగా అమలు చేస్తున్న వీఆర్ఎస్ స్కీమ్ ఆపాలన్నారు. -
108 ఉద్యోగులపై సర్కారు కక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 108 వాహనాల్లో పనిచేస్తున్న సుమారు 2400 మంది ఉద్యోగులను తొలగించేందుకు సర్కారు పూనుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో కొత్తగా ఉద్యోగులను నియమించేం దుకు నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు వారం రోజుల కిందట తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 6 నుంచి సమ్మెలోకి వెళతామని నోటీసులో పేర్కొ న్నారు. ఈ నోటీసును అందుకున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోగా.. వారిని తొలగించి కొత్త వారిని నియమించుకోవాలని వార్తా పత్రికల్లో ప్రకటన ఇప్పించింది. 108 వాహనాల నిర్వహణ సంస్థ బీవీజీ(భారత్ వికాస్ గ్రూప్) సంస్థ ఈ ప్రకటన జారీచేసింది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పైలెట్స్ (డ్రైవర్లు) కావాలని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మంగళగిరిలోని తమ కార్యాలయంలో వారం రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహనాల నిర్వహణను సరిగా పట్టించుకోకపోవడం లేదు. వేతనాలు జాప్యం, కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగులు పలుసార్లు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. కండీషన్లో లేని వాహనాలుప్రాణాప్రాయ స్థితిలో, అత్యవసర సమయాల్లో రోగులను, బాధితులను ఆదుకునేందుకు కూతవేటు దూరంలో అందుబాటులో ఉండే 108 వ్యవస్థను ప్రభుత్వం దారుణ పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. సేవలకు వీలుగా వాహనాలను ఉంచాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న సిబ్బంది మెడపై తాజాగా తొలగింపు కత్తి పెట్టింది. కండీషన్లో లేని 108 వాహనాలను సరిచేయాలన్న విన్నపాలు వినిపించుకోకపోగా వాటి రిపేర్ల ఖర్చులను డ్యూటీలోని సిబ్బంది భరించాల్సి వస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సర్వీసులో తిరగని వాహనాలను కూడా తిరుగుతున్నట్లు సీఎం డ్యాష్‌బోర్డులో చూపిస్తూ మోసం చేస్తున్నారు. వాహనాల్లోని పేషెంట్ల క్యాబిన్లలో ఏసీ, లైట్లు పనిచేయవు. బీపీ, స్టెత్‌స్కోప్, గ్లూకోమీటర్లు లాంటి పరికరాల్లో పనిచేయనివే ఎక్కువగా ఉన్నాయి. అధికశాతం వాహనాలలో ఆక్సిజన్, కాటన్, డ్రస్సింగ్ ప్యాడ్స్, స్టెటరలైజ్డ్ దూది, అయోడిన్ కూడా ఉండడం లేదు. స్ట్రెచ్చర్లు ఉపయోగపడటంలేదు. చాలా వాహనాలకు బీమా సౌకర్యం, పొల్యూషన్ సర్టిఫికెట్లు లేవు. వాహనాలకు సకాలంలో ఇంజనాయిల్ కూడా మార్చడంలేదు. వాహనాల టైర్లు అరిగి పోయి, ఊడిపోయి తిరగడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి. హెడ్లైట్లు పనిచేయవు. బ్యాటరీ నిర్వహణలేదు. వర్షం పడితే అనేక వాహనాల్లోకి నీరు కారుతోంది. రాజధాని జిల్లా అయిన కృష్ణాలో ఇటీవల ఓ గర్భిణీని తీసుకెళుతుండగా వాహనం మొరాయించింది. చివరకు ఆమెను ఆటోలో ఆస్పత్రికి చేర్చాల్సి వచ్చింది. వైఎస్సాఆర్ కడప, నెల్లూరు జిల్లాల్లో వాహనాలు ఎక్కువగా షెడ్డుకే పరిమితం అవుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులని 108 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1100 నెంబరకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని సిబ్బంది వాపోతున్నారు. సమస్యల పరిష్కారం కోరితే బెదిరింపులా? దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించి వాహనాల నిర్వహణను మెరుగుపర్చాలని కోరితే కొత్తగా ఉద్యోగ ప్రకటన ఇస్తారా అని ఉద్యోగుల సంఘం తీవ్రంగా మండిపడింది. ఈనెల 5వ తేదీలోపు చర్చలకు ఆహ్వానించారని, ఆరోజు తమకు హామీ లభించకపోతే నోటీసులో పేర్కొన్నట్టు 6వ తేదీ నుంచి సమ్మెలోకి వెళతామని సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. రెండు మాసాల కిందట ప్రభుత్వమే చర్చలు జరిపి, పరిష్కారానికి హామీ ఇచ్చినా అది చేయకుండా ఉద్యోగులను వేధిస్తోందని, ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన తాము భయపడతామని అనుకోవడం పొరపాటు అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, తాము కూడా పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ఆయన తెలిపారు. నేడో రేపో 104 ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళుతున్నట్టు ప్రకటించనున్న నేపథ్యంలో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడనుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 108 వాహనాల సంఖ్య: 417 ప్రస్తుతం తిరుగుతున్న వాహనాలు: 297 ఆగిపోయిన వాహనాలు: 120 తిరుగుతున్న వాటిలో ఆక్సిజన్ లేని వాహనాలు: 97 -
టీటీడీలో తొలిసారిగా సమ్మె సైరన్
-
ప్రభుత్వ వైద్యుల సమ్మె నోటీసు
⇒ ఏప్రిల్ 10 నుంచి విడతల వారీ సమ్మె ⇒ జూన్ 2 నుంచి అన్ని వైద్య సేవల బహిష్కరణ ⇒ వేతనాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన తదితర డిమాండ్లు సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వ వైద్యులు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ 28 డిమాండ్లను 18 రోజుల్లోగా పరిష్కరించకుంటే వచ్చే నెల 10 నుంచి విడతల వారీ సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె.రమేష్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రవీణ్, సెక్రటరీ జనరల్ డాక్టర్ బి.రమేష్, కోశాధికారి డాక్టర్ పి.లాలూప్రసాద్ తదితరులు గురువారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేశారు. మరో ప్రతిని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి పంపించారు. డిమాండ్లు పరిష్కరించకుంటే... వచ్చే నెల 10 నుంచి 30 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి, మే ఒకటి నుంచి 15 వరకు రోజుకో గంట నిరసన కార్యక్రమం చేపడతామని అందులో పేర్కొన్నారు. అదే నెల 16 నుంచి జూన్ ఒకటి వరకు ఓపీ సేవలను, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి అన్ని రకాల వైద్య సేవలను బహిష్కరిస్తారు. సమస్యలు పరిష్కరించకుంటే... రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు జిల్లా ఆసుపత్రులు, ఉస్మానియా, గాంధీ సహా అన్ని బోధన, బోధనేతర ఆసుపత్రులన్నింటిలోనూ సమ్మె ఉంటుందని సంఘం కోశాధికారి డాక్టర్ లాలూప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల మందికి పైగా వైద్యులు సమ్మెలో పాల్గొంటారన్నారు. ప్రభుత్వ వైద్యుల ప్రధాన డిమాండ్లివే... – డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ కమిషనర్ పోస్టులను సీనియారిటీ ప్రకారం వైద్యులతో భర్తీ చేయాలి. – గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు, జిల్లా తదితర ఆసుపత్రులకు డైరెక్టర్లను నియమించాలన్న ఆలోచనను విరమించుకోవాలి. – వర్సిటీ అధ్యాపకుల మాదిరిగా యూజీసీ స్కేళ్లు, అలవెన్సులు ఇవ్వాలి. – అన్ని రకాల పదోన్నతులు, బదిలీలను కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే నిర్వహించాలి. – మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ, రిమ్స్ వంటి పాక్షిక స్వయంప్రతిపత్తి వాటిని సాధారణ మెడికల్ కాలేజీలుగా మార్పు చేయాలి. – తెలంగాణకు కేటాయించిన 171 మంది ఆంధ్రా డాక్టర్లను వెనక్కు పంపించాలి – తప్పుడు ధ్రువీకరణపత్రాలు ఇచ్చిన డాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి – ఆరోగ్య సంచాలకుల పరిధిలోని వారందిరికీ పేస్కేల్ పెంచాలి. 24 రకాల అలవెన్సులు అందజేయాలి. – పదో పీఆర్సీని అమలచేయాలి. పెండింగ్ ఎరియర్స్ ఇవ్వాలి. – వైద్య ఆరోగ్యశాఖపై కిందిస్థాయిలో తహసిల్దార్, ఎంపీడీవో, సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి వారి పర్యవేక్షణను రద్దు చేయాలి. ఈఎస్ఐ సిబ్బందిని విభజించి అందులోని వైద్యులకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. -
డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె
ఆదిలాబాద్: కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని ఐఎన్టీయూసీ బ్రాంచీ ఉపాధ్యక్షుడు జీ మహిపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఆర్కే న్యూటెక్ గనిపై కార్మికుల డిమాండ్లపై కార్మికులతో సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ప్రధాన డిమాండ్ల సాధన కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. యాజమాన్యం సమస్యల పరిష్కారం కోసం ముందుకు రాకుంటే సమ్మెను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ వైఫల్యం వల్లే నేడు యాజమాన్యం మొండి వైఖరి అవలంభిస్తూ డిమాండ్లను పరిష్కరించడం లేదన్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, సకల జనుల సమ్మె వేతనాలను వెంటనే చెల్లించాలని, సొంతింటి పథకం అమలు చేయాలని, 10 వేజ్‌బోర్డు కమిటీని వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. ఆర్కే న్యూటెక్ గనిలో 23 డీప్, 28డీప్‌లలో వెంటిలేషన్ , డ్రిల్బిట్లు నాణ్యతాలోపం సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డి అన్నయ్య, బ్రాంచీ ఉపాధ్యక్షుడు బోనగిరి కిషన్, నాయకులు గంగయ్య, శ్రీరాములు పాల్గొన్నారు. -
జీఓ 279 రద్దుకు రాష్ట్రవ్యాప్త ఉద్యమం
విజయనగరం: పట్టణ ప్రాంతాల్లో చెత్తలు ఎత్తుకుంటూ ప్రజారోగ్యాన్ని పర్యవేక్షించే ఎస్సీ, ఎస్టీల పొట్ట కొట్టేవిధంగా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ మండిపడ్డారు. జీఓ నంబర్ 279 రద్దు కోరుతూ రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు విజయవాడలో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో దీనిపై తీర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. ఆదివారం పట్టణంలోని కె.ఎల్.పురంలో ఉన్న సంఘం భవనంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని విజయనగరం మున్సిపాలిటీలో 309 మంది, బొబ్బిలిలో 152 మంది, సాలూరులో 140 మంది, పార్వతీపురంలో 125 మంది కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో 15 ఏళ్లుగా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వారందరినీ రోడ్డున పడేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. జీఓ నంబర్ 279ను అమలు చేసి యంత్రాలతో పారిశుధ్య పనులు నిర్వహించటంతోపాటు పనిని ఔట్సోర్సింగ్ చేసేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు. భవిష్యత్‌లో పూర్తిగా యంత్రాలతో పనులు చేపట్టి కార్మికులకు ఉపాధి లేకుండా చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. నూతన విధానం అమలుకు మున్సిపల్ యంత్రాంగం ప్రయత్నిస్తే పనులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు, ఉపాధ్యక్షుడు గొర్లె వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.గాంధీ, బి.భాస్కరరావు, టి.శంకరరావు పాల్గొన్నారు. -
22 అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటో బంద్
రవాణా కమిషనర్‌కు సమ్మె నోటీస్ ఇచ్చిన ఆటో సంఘాల జేఏసీ సాక్షి, హైదరాబాద్: ఆటోలపై పోలీసులు, ఆర్టీఏ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు నిరసనగా ఆటో సంఘాల జేఏసీ ఈ నెల 22 అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటోబంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, బీఎంఎస్, ఐఎన్టీయూసీ, టీఆర్‌ఎస్‌టీవీ, టీఏడీయూ తదితర సంఘాల జేఏసీ ప్రతినిధుల బృందం గురువారం రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియాకు సమ్మె నోటీసు అందజేసింది. మీటర్లు లేకుండా తిరగడం, మీటర్ల ట్యాంపరింగ్‌కు పాల్పడటం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటివి నియంత్రించేందుకు ఈ నెల 16 నుంచి ఆర్టీఏ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ స్పెషల్ డ్రైవ్‌పై వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టిన ఆటో సంఘాలు తాజాగా ఆటోల బంద్‌కు సన్నద్ధమయ్యాయి. మీటర్ ట్యాంపరింగ్ వంటి వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలను తాము వ్యతిరేకించడం లేదని, కానీ ఆ వంకతో పోలీసులు, ఆర్టీఏ, తూనికలు, కొలతలు శాఖ అధికారులు తమపై మూకుమ్మడిగా వేధింపులకు పాల్పడుతున్నారని జేఏసీ నాయకులు, ఏఐటీయూసీ అనుబంధ ఆటో సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకటేష్ చెప్పారు. మీటర్ సీళ్లు లేవని, డాక్యుమెంట్స్ లేవనే సాకుతో రూ.5,000 నుంచి రూ.15,000 వరకు జరిమానాలు విధిస్తున్నారన్నారని, దీంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. అలాగే... గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటోరిక్షాలకు ప్రధాన పోటీగా నిలిచిన ఓలా, ఉబెర్ క్యాబ్‌లను వెంటనే రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. వీటితోపాటు 50 ఏళ్లు నిండిన ఆటోడ్రైవర్లకు పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలనే తదితర డిమాండ్లతో సమ్మె నోటీసు అందించింది. -
సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కార్మిక సంఘాలు
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శికి కార్మిక సంఘాలు సోమవారం సమ్మెనోటీసును ఇచ్చాయి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలనీ, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ ఈ సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనం 14 వేలు రూపాయలు ఉండాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. సమ్మెనోటిసులో జీహెచ్ఎంసీ కార్మికులు కూడా భాగస్వాములైనారు. ఈ నెల 22 తర్వాత ఏ రోజైనా సమ్మెకు సిద్ధపడతామని హెచ్చరిక జారీ చేశారు. -
సమ్మె నోటీసు ఇచ్చిన ఎంప్లాయిస్, టీఎంయూ
హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్యానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్ నేతలు గురువారం సమ్మె నోటీసు ఇచ్చారు. ఏప్రిల్ 16 తర్వాత సమ్మె చేపడతామని వారు స్పష్టం చేశారు. ఎన్టీవోలకు సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు సవరణ చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను రెండు ప్రభుత్వాలు ఆదుకోవాలని, లేకుంటే రెండు రాష్ట్రాల్లో సమ్మె తప్పదని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు హెచ్చరించారు. కాగా పీఆర్సీ అమలు కోసం ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. వేతన సవరణ ప్రధాన డిమాండ్‌గా ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాలు గురువారం బస్‌భవన్‌ను ముట్టడించాయి. -
ఎదురుదెబ్బ!
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం అనే శిఖండిని అడ్డుపెట్టుకుని కార్మికులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న తెలుగుదేశం నేతలకు చెంపపెట్టు తగిలింది. ఆర్టీపీపీలో కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యానికి అనుగుణంగా అడుగులేస్తున్న పోట్లదుర్తి బ్రదర్స్ నిర్ణయాల్ని ప్రతిఘటించారు. అధికార పార్టీ నిర్ణయాలు అమలు చేస్తున్న ఆర్టీపీపీ సీఈ వైఖరిని నిరసిస్తూ కార్మిక యూనియన్లు ఏకమయ్యాయి. వెరసి సమ్మె నోటీసు ఇచ్చారు. కార్మికుల సమ్మెను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరించారు.. కార్మికుల పొట్టకొట్టి లబ్ధిపొందాలనే లక్ష్యంతో శల్యసారధ్యం చేపట్టారు. ఆర్టీపీపీలో భూనిర్వాసితుల్ని కాదని అనుచరుల్ని చేర్పించుకునే లక్ష్యంతో తెలుగుదేశం నేతలు పావులు కదిపారు. అందులో భాగంగా కార్మికులు న్యాయమైన డిమాండ్లను కాదని, యాజమాన్యానికి ఒత్తాసుగా నిలిచారు. 1200 మంది కార్మికులు ఏకతాటిపై నిలిచి ఆందోళనకు సిద్ధమైతే వ్యూహాత్మకంగా యాజమాన్యంతో చేతులు కలిపి ఉద్యమాన్ని నీరుగార్చారు. అర్ధరాత్రి విధుల్లోకి అనుచరగణాన్ని తీసుకువచ్చి కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఈమొత్తం వ్యవహారంలో పోట్లదుర్తి బ్రదర్స్ ప్రత్యక్షంగా, పరోక్షంగా పావులు కదుపుతూ వచ్చారు. వారి చర్యలను కార్మిక యూనియన్లు ప్రతిఘటించాయి. ఆర్టీపీపీకి సమ్మె నోటీసు జారీ చేసి కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని పరోక్ష ంగా హెచ్చరించారు. కడపు మండడంతోనే ఆందోళన... ఆర్టీపీపీ ఇంజనీరింగ్ అధికారులు ఇతర ఉద్యోగుల జీతాలు 30 శాతం పెంచుకుంటూ జిఓ నెంబర్ 34 జారీ చేశారు. అదే సమయంలో కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయాలని, వారి జీతభత్యాలు, స్థితిగతులపై అధ్యయనం చేయాలని జిఓ నెంబర్ 35 జారీ చేశారు. ఆమేరకు డెరైక్టర్ స్థాయి అధికారులతో కూడిన నలుగురు గల సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ జూలై చివరకు యాజమాన్యానికి నివేదిక అందజేయాల్సి ఉంది. అంటే దాదాపు 5నెలల క్రితం కాంట్రాక్టు కార్మికుల స్థితిగతులపై నివేదిక అందించాల్సి ఉంది. ఇవేవి పట్టించుకోకుండా కార్మికుల పొట్టకొట్టే చర్యల్లోనే నిమగ్నం కావడంతో ఆర్టీపీపీ కార్మికులు ఏకకాలంలో 1200 మంది ధర్నా చేపట్టారు. సీఈ నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కారించాల్సింది పోయి రాజకీయాల్ని చొప్పించారు. తెలుగుదేశం నేతలతో మిలాఖత్ అయి బయటి నుంచి 150మంది కార్మికుల్ని అనుమతించారు. దాంతో ఒక్కమారుగా కార్మికుల్లో అలజడి ఏర్పడింది. ఆందోళనలో ఉంటే ఎక్కడ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని కార్మికుల్లో ఐక్యత సన్నగిల్లింది. ఆమేరకు వారి ఆందోళన నీరుగారింది. అయితే కొంతమందిని విధుల్లోకి అనుమంతించకుండా సీఈ నిర్ణయం తీసుకోవడంపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వారిని కాదని, తెలుగుదేశం పార్టీ సిఫార్సులకు తలొగ్గి కార్మికులను తొలగిస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు. సీఈ ఆశించిన మేరకు స్పందించకపోవడంతో కార్మికుల యూనియన్లు సమ్మె నోటీసును జారీ చేశాయి. కార్మికులకు అన్యాయం జరిగితే సహించమని ఏకతాటిపైకి యూనియన్లు రావడాన్ని ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తున్నారు. అండగా నిలుస్తోన్న వైఎస్సార్సీపీ.... ఆర్టీపీపీలో కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ అండగా నిలుస్తోంది. అనేక పర్యాయాలు ప్రత్యక్ష ఆందోళన చేపట్టిన ఎంపీ, ఎమ్మెల్యేలు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని జన్కో డెరైక్టర్లును కలిశారు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్మికులను కాదని, వారి ఆందోళన చేస్తుండడగానే ఇతరుల్ని ఎలా అనుమతిస్తారంటూ నిలదీసినట్లు సమాచారం. ఆర్టీపీపీలో ఏ ఒక్క కార్మికునికి అన్యాయం చేసినా ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించినట్లు సమాచారం. -
సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు
నిజామాబాద్‌అర్బన్: మెడికల్ కళాశాలకు అందుబాటులో లేకుండా పోయిన సీనియర్ రెసిడెన్సియల్ డాక్టర్లు నాలుగు రోజుల క్రితమే కళాశాల ప్రిన్సిపాల్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. తాము ఇక్కడ ఉండేందుకు ఇబ్బందికరంగా ఉందని, సౌకర్యాలు లేవని, ఇచ్చే భత్యం ఏమాత్రం సరిపోవడంలేదని, సక్రమంగా అందడం లేదని నోటీసులో పేర్కొన్నారు. ఈ సమ్మె నోటీసు ఇచ్చిన వైద్యులు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు , నిరసనలు చేయకుండా మౌనంగా ఉన్నారు. అసలు ఈ వైద్యులు ఎక్కడ ఉన్నారన్నది కూడా కళాశాల అధికారులకు తెలియడం లేదు. మంత్రి వచ్చిన రోజు కేవలం 16 మంది వైద్యులు ఉండడంతో మిగితా వారిపై ఆరా తీయగా విషయం తెలిసింది. సమ్మె నోటీసు ఇచ్చి విధులకు రాకుండా ఉండిపోయారు. ఈ విషయమై కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్లు నాలుగు రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చారని తెలిపారు. అయితే శుక్రవారం జిల్లా ఆస్పత్రి ఆర్‌ఎంవోకు జూనియన్ డాక్టర్ సమ్మె నోటీస్ ఇచ్చారు. -
కలెక్టర్‌కు కార్మికుల సమ్మె నోటీసు
నల్లగొండ టుటౌన్ : మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఔట్ సోర్సింగ్ కార్మికులు బుధవారం కలెక్టర్ టి.చిరంజీవులు సమ్మె నోటీసు అందజేశారు. తమ డిమాండ్లను ఈ నెల 24లోగా పరిష్కరించాలని కోరారు. డిమాండ్ల పరిష్కారం కోసం చర్యలు తీసుకోకుంటే 25 నుంచి సమ్మెకు దిగుతామని వివరించారు. ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులను కార్మికుల వ్యక్తిగత ఖాతాలో జమ చేసి బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. అలాగే మూడేళ్ల సర్వీస్ పూర్తయిన కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, నైపుణ్యం బట్టి పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేడి రాజు, ఎస్.వెంకటేశ్, బొర్ర సుధాకర్, పెరిక కరణ్‌జయరాజ్, పెరిక రాజు, పి.వెంకటేశ్, పి.సైదులు, కె.పరశురాం పాల్గొన్నారు. -
ఆగని ఆందోళనలు
సాక్షి, చెన్నై: ఎన్ఎల్సీ కార్మికులు మరో మారు సమ్మె నోటీస్ ఇచ్చారు. కార్మికుడి కాల్చివేత ఘటనను కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. మంగళవారం ఆందోళనలతో నైవేలి అట్టుడికింది. బంద్ వాతావరణం నెలకొనడంతో జన జీవనం స్తంభించింది. ఉద్యోగుల హెచ్చరికలతో లిగ్నైట్ కార్పొరేషన్ యాజమాన్యం దిగి వచ్చింది. తమ డిమాండ్లకు యాజమాన్యం ఏ మేరకు తలొగ్గుతుందో దాని ఆధారంగా తదుపరి తమ నిర్ణయం ఉంటుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. కడలూరు జిల్లా నైవేలిలోని కేంద్ర ప్రభుత్వ లిగ్నైట్ కార్పొరేషన్లో వివాదం రాజుకుంది. కాంట్రాక్టు కార్మికుడు రాజా అలియాస్ రాజశేఖర్‌ను సీఐఎస్ఎఫ్ జవాన్ కాల్చి చంపడంతో ఆ పరిసరాలు సోమవారం రణరంగాన్ని తలపించాయి. ఈ ఘటనను కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. ఇప్పటికే తమ మీద పలు మార్లు ప్రతాపం చూపించిన సీఐఎస్ఎఫ్ను వెనక్కు పంపించాలన్న డిమాండ్‌తో ఆందోళనలు ఉధృతం చేయడానికి నిర్ణయించారు. మంగళవారం ఇంజనీర్లు మినహా తక్కిన కార్మికులందరూ విధులు బహిష్కరించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, జీవా కాంట్రాక్టు కార్మికులు, తోముసా, పీఎంకే అనుబంధ కార్మిక సంఘాల నేతృత్వంలో పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. ధర్నాలు, రాస్తారోకోలతో నైవేలి అట్టుడికింది. దుకాణాలన్నీ మూతబడ్డాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బంద్‌ను తలపించే రీతిలో నైవేలి నిర్మానుష్యంగా మారింది. సోమవారం అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్‌పై దాడి చేసి, అక్కడి వస్తువులు, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ పరిసరాల్లో భారీ బలగాల్ని మోహరింప చేశారు. డీఐజీ మురుగేషన్, ఎస్పీ రాాధిక అక్కడే తిష్ట వేసి పరిస్థితిని సమీక్షించారు. అలాగే ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేశాయి. చెన్నైలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టి.పాండియన్ నేతృత్వంలో సైదాపేటలో ఆందోళన చేశారు. అయితే, కార్మిక సంఘాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. కార్మికుడిని సీఐఎస్ఎఫ్ హతమార్చినా, యాజమాన్యం నోరుమెదపక పోవడాన్ని తీవ్రంగా పరిగణించాయి. యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఎండగట్టే రీతిలో సమ్మె నోటీసు జారీ చేశారుు. దీంతో యాజమాన్యం ఉలిక్కి పడింది. ఇది వరకు సాగిన సమ్మె ప్రభావం నుంచి తేలుకోని యాజమాన్యం మళ్లీ సమ్మె బాటలో కార్మికులు పయనించకుండా ముందు జాగ్రత్తల్లో పడింది.చర్చలు : ఎన్ఎల్సీ ఉన్నతాధికారులు కార్మిక సంఘాలతో మధ్యాహ్నం చర్చలు చేపట్టారు. అయితే, కొన్ని డిమాండ్లను యాజమాన్యం ముందు కార్మిక సంఘాలు ఉంచాయి. కార్మికుల డిమాండ్ల మంగళవారం రాత్రి ఎన్ఎల్సీ దిగి వచ్చింది. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. అంత్యక్రియల నిమిత్తం రూ.50 వేలు మంజూరు చేసింది. మృతుడి భార్యకు పర్మినెంట్‌గా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తమ సానుభూతిని రాజా కుటుంబానికి తెలియజేశారు. అదే సమయంలో సీఐఎస్ఎఫ్ను వెనక్కు తీసుకునే విషయమై ఎలాంటి హామీని ఎన్ఎల్సీ ఇవ్వలేదు. అయితే, కొన్ని చోట్ల ఉత్తరాదివారిని కాకుండా, తమిళనాడుకు చెందిన సిబ్బందిని భద్రతా విధుల్లో దించే రీతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చర్చలు సత్ఫలితాన్ని ఇవ్వడంతో కార్మిక సంఘాలు తదుపరి కార్యాచరణకు సమావేశం అయ్యారు. ఈ సమావేశానంతరం తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అన్ని సంఘాలు ఏకాభిప్రాయానికి వచ్చిన పక్షంలో అర్ధరాత్రి నుంచి విధులకు వెళతామని, లేని పక్షంలో బుధవారం ఉదయం విధులకు హాజరు అవుతామని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. ఏకాభిప్రాయం కుదరని పక్షంలో అని విలేకరులు ప్రశ్నించగా బుధవారం ఉదయాన్నే ప్రకటిస్తామన్నారు. హత్యకేసు...అరెస్టు: రాజాను కల్చి చంపడాన్ని పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. రాజాను తుపాకీతో కాల్చిన సీఐఎస్ఎఫ్ జవాన్‌ను అతి కష్టం మీద గుర్తించారు. జవాన్ నోమన్‌ను అరెస్టు చేసి కడలూరు కోర్టులో హాజరు పరిచారు. అతడిని ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో అతడిని కడలూరు జైలుకు తరలించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్ నేతృత్వంలో ఆ పార్టీనాయకులు పెద్ద ఎత్తున నైవేలికి చేరుకుని లాఠీ చార్జ్‌లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. రాజాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒకరు చంటి బిడ్డ. భర్తను కోల్పోయిన వేదనలో ఆస్పత్రి ఆవరణలో ఆమె విలపిస్తుండడం కార్మికులను కంట తడి పెట్టించింది. రాజా కుటుంబాన్ని ఓదార్చారు. -
ఎన్ఎంయూ సమ్మె నోటీసు
-
ఆర్టీసీ ఎన్ఎంయూ సమ్మె నోటీసు
సాక్షి, హైదారబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయూ సీమాంధ్ర కమిటీ బుధవారం ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చింది. గుంటూరు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నోటీసు ఇచ్చినట్టు ఆ విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వెంటనే రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయాలని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని అందులో పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేస్తే మెరుపు సమ్మెకు దిగుతామని ఎన్ఎంయూ తెలంగాణ ప్రాంత కమిటీ హెచ్చరించింది. సమ్మెకు దిగకుండానే సీమాంధ్ర ఉద్యమానికి సంఘీభావం తెలపాలని ఎంప్లాయీస్ యూనియన్ భావిస్తోంది. గురువారం జరిగే బంద్‌కు మద్దతివ్వాలని తీర్మానించింది. -
ఎన్ఎంయూ సమ్మె నోటీసు
ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణే ఏకైక ఎజెండా సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణే ఏకైక డిమాండ్‌గా సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) తెలిపింది. కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్ల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం తమతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఎన్ఎంయూ అధ్యక్షుడు ఎం.నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్, మరికొందరు ప్రతినిధులతో కలిసి ఆయన మంగళవారం ఆర్టీసీ పరిపాలన విభాగం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వెంకటేశ్వరరావుకు సమ్మె నోటీస్‌ను అందజేశారు. జనవరి 8లోపు కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని నాగేశ్వర్రావు యాజమాన్యాన్ని హెచ్చరించారు. గతేడాది జూలై 28న రవాణామంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సి ఉందన్నారు. సీమాంధ్రలో సకల జనుల సమ్మె సమయంలో ప్రభుత్వం కార్మికసంఘాలతో చర్చించిందని, ఉద్యోగుల క్రమబద్ధీకరణకు డిసెంబర్‌లోపు జీవో విడుదల చేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదన్నారు. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లోనే తాము సమ్మెకు సిద్ధమవ్వాల్సి వస్తోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులైరె జ్ చేసేవరకు విశ్రమించబోమని చెప్పారు. గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్‌కు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఆ సంఘం ఇచ్చిన సమ్మె నోటీస్‌లో కార్మికుల డిమాండ్లపై స్పష్టత లేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాగా ఆర్టీసీలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని నాగేశ్వర్రావు అంతకుముందు బస్‌భవన్ ఎదుట జరిగిన కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ డిమాండ్ చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూలు కార్మికుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని, ఏడాది కాలంలో ఒక్క సమస్యనూ పరిష్కరించ లేకపోయాయని విమర్శించారు. ఈ ధర్నాలో పలు డిపోలకు చెందిన కాంట్రాక్టు కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
'ఈసారి నోటీసు ఇవ్వకుండా సమ్మె చేస్తాం'
-
సచివాలయంలో బైఠాయించిన సీమాంద్ర ఉద్యోగులు
-
నేడు సీఎస్‌కు సమ్మె నోటీసు
-
ఇక బడి బంద్
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని ఎక్కువమంది ఉపాధ్యాయులు గురువారం నుంచి సమ్మెకు దిగనుండడంతో బడి బంద్ కానుంది. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో పలు సంఘాలు సమ్మెలోకి దిగుతున్నట్టు డీఈఓ రామలింగానికి మంగళవారం సమ్మె నోటీస్ ఇచ్చారు. జిల్లాలో బలమైన సంఘాలైన యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్టీయూ మాత్రమే సమ్మెకు దూరంగా ఉన్నాయి. ఆయా సంఘాల్లోని ఉపాధ్యాయుల్లో మెజార్టీ వర్గం తమ సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాం ధ్రుల మనోభావాలననుసరించి సంఘాలు నడుచుకోవాల్సి ఉంటుందని తమ అధిష్టానానికి తెలియచేసిన ట్టు సమాచారం. దీంతో సమ్మెలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు పరోక్ష మద్దతుగా ప్రకటించేందుకు కొందరు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. జిల్లాలోని 3568 ప్రభుత్వ పాఠశాలల్లో 14,128 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జిల్లాలోని 14 ఉపాధ్యాయ సంఘాల్లో పలు సంఘాలు సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి పేరుతో ఇప్పటికే చురుగ్గా ఉద్యమిస్తున్నాయి. అయితే ప్రధాన సంఘాలు దూరంగా ఉండడంతో సమ్మె ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని అనుమానాలు రేకెత్తుతున్నాయి. -
సమ్మెకు వెళ్లే యోచనలో సీమాంధ్ర ఉద్యోగులు
-
సమ్మెకు వెళ్లే యోచనలో సీమాంధ్ర ఉద్యోగులు
హైదరాబాద్ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగులు నిరసనలో భాగంగా నేడు సామూహిక సెలవులు పెట్టారు. దాదాపు 2 వేల మంది ఉద్యోగులు సెలవు పెట్టి విధులు గైర్హాజయ్యారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అటెండర్ మొదలు అడిషనల్ సెక్రటరీ వరకూ నేడు సెలవు పెట్టారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సెలవులో ఉండటంతో సచివాలయం బోసిపోయింది. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు వెళ్లే యోచనలో ఉన్నారు. శనివారం లేదా సోమవారం వారు సమ్మె నోటీసు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవ్వనున్నారు. కాగా విభజనపై జరుగుతున్న సీమాంధ్ర ఉద్యోగుల నిరసన నిన్న ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. అబిడ్స్‌లో బీమాభవన్‌లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్వాదంతో పాటు ఒకరికొకరు తోపులాటలు జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న ఏపీ ఎన్జీవోలు
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మె చేపట్టిన ఏపీ ఎన్జీవోలు సంఘం సమ్మెకు సిద్ధమైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలోని మున్సిపల్ ఉద్యోగులు సైతం నిరవధిక సమ్మెకి దిగనున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్జీవోల సంఘం ఈరోజు ప్రభుత్వ కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు తలపెట్టిన సమ్మె నేటి అర్థరాత్రి నుంచి ప్రారంభం అవుతోంది. దాదాపు ఆరులక్షల మంది సమ్మెలో పాల్గొంటున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహించబోయే సమ్మెపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె కొనసాగుతోంది. -
ఎడుకొండల వాడికి సమైక్య సెగ