కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని ఐఎన్టీయూసీ బ్రాంచీ ఉపాధ్యక్షుడు జీ మహిపాల్‌రెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్: కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని ఐఎన్టీయూసీ బ్రాంచీ ఉపాధ్యక్షుడు జీ మహిపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఆర్కే న్యూటెక్ గనిపై కార్మికుల డిమాండ్లపై కార్మికులతో సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ప్రధాన డిమాండ్ల సాధన కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
యాజమాన్యం సమస్యల పరిష్కారం కోసం ముందుకు రాకుంటే సమ్మెను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ వైఫల్యం వల్లే నేడు యాజమాన్యం మొండి వైఖరి అవలంభిస్తూ డిమాండ్లను పరిష్కరించడం లేదన్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, సకల జనుల సమ్మె వేతనాలను వెంటనే చెల్లించాలని, సొంతింటి పథకం అమలు చేయాలని, 10 వేజ్‌బోర్డు కమిటీని వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. ఆర్కే న్యూటెక్ గనిలో 23 డీప్, 28డీప్‌లలో వెంటిలేషన్ , డ్రిల్‌బిట్లు నాణ్యతాలోపం సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు డి అన్నయ్య, బ్రాంచీ ఉపాధ్యక్షుడు బోనగిరి కిషన్, నాయకులు గంగయ్య, శ్రీరాములు పాల్గొన్నారు.