సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మె చేపట్టిన ఏపీ ఎన్జీవోలు సంఘం నేటి అర్థరాత్రి నుంచి సమ్మెకు సిద్ధమైంది.
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మె చేపట్టిన ఏపీ ఎన్జీవోలు సంఘం సమ్మెకు సిద్ధమైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలోని మున్సిపల్ ఉద్యోగులు సైతం నిరవధిక సమ్మెకి దిగనున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్జీవోల సంఘం ఈరోజు ప్రభుత్వ కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు తలపెట్టిన సమ్మె నేటి అర్థరాత్రి నుంచి ప్రారంభం అవుతోంది. దాదాపు ఆరులక్షల మంది సమ్మెలో పాల్గొంటున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహించబోయే సమ్మెపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె కొనసాగుతోంది.