మెడికల్ కళాశాలకు అందుబాటులో లేకుండా పోయిన సీనియర్ రెసిడెన్సియల్ డాక్టర్లు నాలుగు రోజుల క్రితమే కళాశాల ప్రిన్సిపాల్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు.
నిజామాబాద్‌అర్బన్: మెడికల్ కళాశాలకు అందుబాటులో లేకుండా పోయిన సీనియర్ రెసిడెన్సియల్ డాక్టర్లు నాలుగు రోజుల క్రితమే కళాశాల ప్రిన్సిపాల్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. తాము ఇక్కడ ఉండేందుకు ఇబ్బందికరంగా ఉందని, సౌకర్యాలు లేవని, ఇచ్చే భత్యం ఏమాత్రం సరిపోవడంలేదని, సక్రమంగా అందడం లేదని నోటీసులో పేర్కొన్నారు. ఈ సమ్మె నోటీసు ఇచ్చిన వైద్యులు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు , నిరసనలు చేయకుండా మౌనంగా ఉన్నారు. అసలు ఈ వైద్యులు ఎక్కడ ఉన్నారన్నది కూడా కళాశాల అధికారులకు తెలియడం లేదు.
మంత్రి వచ్చిన రోజు కేవలం 16 మంది వైద్యులు ఉండడంతో మిగితా వారిపై ఆరా తీయగా విషయం తెలిసింది. సమ్మె నోటీసు ఇచ్చి విధులకు రాకుండా ఉండిపోయారు. ఈ విషయమై కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్లు నాలుగు రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చారని తెలిపారు. అయితే శుక్రవారం జిల్లా ఆస్పత్రి ఆర్‌ఎంవోకు జూనియన్ డాక్టర్ సమ్మె నోటీస్ ఇచ్చారు.