
రూప్ కుమార్ మృతదేహం
సాక్షి, చైన్నై: ఆంధ్రాకు చెందిన వైద్య కళాశాల ప్రొపెసర్ రూప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడలోని పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురువారం మూడు గంటల సమయంలో కళాశాల గెస్ట్ హౌస్‌లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాలు... రూప్ కుమార్‌ది చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. కుమార్‌కు ఇద్దరు పిల్లలు, ఆయన భార్య ఉషారాణి ఆంధ్రాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబందించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఈ ఘటనపై విల్లియనూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.