ఆర్టీసీ యాజమాన్యానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్ నేతలు గురువారం సమ్మె నోటీసు ఇచ్చారు.
హైదరాబాద్ : ఆర్టీసీ యాజమాన్యానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్ నేతలు గురువారం సమ్మె నోటీసు ఇచ్చారు. ఏప్రిల్ 16 తర్వాత సమ్మె చేపడతామని వారు స్పష్టం చేశారు. ఎన్టీవోలకు సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు సవరణ చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను రెండు ప్రభుత్వాలు ఆదుకోవాలని, లేకుంటే రెండు రాష్ట్రాల్లో సమ్మె తప్పదని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు హెచ్చరించారు.
కాగా పీఆర్సీ అమలు కోసం ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. వేతన సవరణ ప్రధాన డిమాండ్‌గా ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాలు గురువారం బస్‌భవన్‌ను ముట్టడించాయి.