ఆర్టీసీలో సమ్మె సైరన్‌ | TSRTC Workers Unions Give Strike Notice To TSRTC Management | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌

Published Tue, Sep 3 2019 6:06 PM | Last Updated on Tue, Sep 3 2019 6:09 PM

TSRTC Workers Unions Give Strike Notice To TSRTC Management - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. 2017 వేతన సవరణతో  పాటు పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టేందుకు సన్నద్దమవుతున్నాయి. ఈ మేరకు  తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్‌ యూనియన్‌(ఈయూ)  నోటీసులు అందించింది. బస్‌ భవన్‌లో ఆర్టీసీ యజమాన్యానికి ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సమ్మె నోటీసులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్‌ ఆర్టీసీ పరిరక్షణకు సంస్థ కృషి చేయాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామి ఇచ్చిన ప్రభుత్వం.. నేటికీ ఏ చర్యా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement