
మీ కోరికలు న్యాయబద్ధం
కర్నూలు: ఆర్టీసీ కార్మికుల కోర్కెలు న్యాయబద్ధమైనవేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు బుధవారం వైఎస్ జగన్ ను కలిసి, తమ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడంతో ఈ మేరకు వారికి ఆయన భరోసా ఇచ్చారు.
వేతన సవరణలో తమకు 43శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలన్న కార్మిక సంఘాలు ఆ డిమాండ్తో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి. దీంతో వారు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసింది.