'సీఎం లేరు, సమయం కావాలి'
హైదరాబాద్: వేతన సవరణపై కార్మికశాఖతో ఆర్టీసీ యూనియన్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేతన సవరణపై మరికొంత సమయం కావాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. సీఏం చంద్రబాబు అందుబాటులో లేనందున వెంటనే నిర్ణయం తీసుకోలేమని తెలిపింది.
ఈ నెల 18లోపు వేతన సవరణపై ప్రకటన చేయాలని ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ), టీఎమ్ యూ డిమాండ్ చేశాయి. ఈనెల 22 తర్వాత సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ కార్మికులకు యూనియన్ నేతలు పద్మాకర్, అశ్వద్థామరెడ్డి పిలుపునిచ్చారు.