సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల మద్దతు | AP rtc unions supports to General strike | Sakshi
Sakshi News home page

సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల మద్దతు

Published Thu, Sep 1 2016 3:20 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల మద్దతు

సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల మద్దతు

అమరావతి : జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న జరిపే సార్వత్రిక సమ్మెకు ఆర్టీసీ యూనియన్లు సంఘీభావం ప్రకటించాయి. ఈ మేరకు వైఎస్సార్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లు బుధవారం వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశాయి. 
 
రోడ్ సేఫ్టీ బిల్లు పేరుతో ఎంవీ యాక్టు మార్పుచేయడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థలకు ఇబ్బందులు తలెత్తుతాయని, రవాణా బిల్లును పార్లమెంట్‌లో అడ్డుకోవాలని ఎంపీలకు యూనియన్ నేతలు వినతి చేశారు. సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ విధులకు ఎర్ర బ్యాడ్జీలు ధరించి హాజరవుతామని నేతలు పేర్కొన్నారు. వైఎస్సార్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నేత రాజారెడ్డి, నేషనల్ మజ్దూర్ యూనియన్ నేత చంద్రయ్యలు వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement