పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదుట ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వైఎస్సాసీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణా రంగారావు, పుష్పశ్రీవాణిలు సంఘీభావం తెలిపారు
విజయనగరం(పార్వతీపురం): పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదుట ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వైఎస్సాసీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణా రంగారావు, పుష్పశ్రీవాణిలు సంఘీభావం తెలిపారు. శనివారం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదుట ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమ్మెలో వైఎస్సార్‌సీపీతో పాటు సీపీఐ, సీఐటీయూ, పలు విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులను డిపో నుంచి బయటకు వెళ్లకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు.