supports
-
పేదోళ్ల వకీలమ్మ
‘న్యాయవాది కావడం అనేది కేవలం వృత్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం... సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం కూడా’ అనే ప్రసిద్ధ మాటను న్యాయవాదుల గురించి చెబుతుంటారు.నిజామాబాద్‌కు చెందిన కాటిపల్లి సరళ మహేందర్‌రెడ్డి న్యాయవాదిగా పేదలకు అండగా ఉండటమే కాదు...‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే ఎరుకతో తన పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తోంది. పిల్లలు వివిధ ఆటల్లో జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేస్తోంది.డిగ్రీ చదువుతున్నప్పుడే వివాహం అయినప్పటికీ భర్త, హైకోర్ట్ న్యాయవాది మహేందర్‌రెడ్డి(Sarala Mahender Reddy) ప్రోత్సాహంతో ఎల్ఎల్బీ పూర్తి చేసిన సరళ నిజామాబాద్ జిల్లా కోర్టులో ఎన్ రోల్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసింది. ఉమ్మడి ఏపీ హైకోర్టులో ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలు చూసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన బావగారు (భర్త అన్న) కాటిపల్లి రవీందర్‌రెడ్డి పేరుమీద ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 300 మంది పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యనందించారు. ఈ ఏడాది నుంచి ‘బాలసదన్ ’లో ఉంటున్న 30 మంది అనాథ పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. ‘బాలసదన్ ’ చిన్నారుల కోసం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భవిష్య జ్యోతి’ ట్రస్ట్‌కు చైర్పర్సన్ గా సరళ మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆటల్లో మెరిసేలా...గ్రామీణ విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించేందుకు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాలు పాఠశాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఖోఖో ఆటలను స్పాన్సర్ చేస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు హాకీలో జాతీయ స్థాయిలో అడారు. రెండుసార్లు రాష్ట్రస్థాయి జూడో మీట్ నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు జూడోలో రాష్ట్రస్థాయిలో అండర్–17 విభాగంలో 3 కాంస్య పతకాలు సాధించారు. జూనియర్స్, సబ్ జూనియర్స్ సైతం జూడో రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నారు. – తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్సామాజిక సేవే... విలువైన సంపదన్యాయవాదిగా పేదలకు అండగా నిలవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాల్లో భాగం కావాలనుకుంటున్నాను. – సరళ మహేందర్‌రెడ్డి -
వైఎస్ జగన్ ను కలిసి మద్దతు ప్రకటించిన అఖిలేష్ యాదవ్
-
బర్రెలక్కని సీఎం చేస్తా !...కేఏ పాల్ హామీ
-
గతంలో షాపులో పనిచేసే నేను ఈరోజు ఒక షాపుకు యజమానురాలు అయ్యానంటే కారణం జగనన్న అందించిన తోడ్పాటే..!
-
ఢిల్లీ జంతర్‌మంతర్: బీసీ సంఘాల ఆందోళన.. వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, ఢిల్లీ: కులాలవారీగా జనగణన చేపట్టాలంటూ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ధర్నాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ సంక్షేమ సంఘాలు పాల్గొన్నాయి. కాగా ఈ ధర్నాకు వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ధర్నాలో ఎంపీలు మార్గాని భరత్, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య హాజరయ్యారు. చదవండి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ కాగా అనేక చిన్నచిన్న కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయంగా గుర్తింపు తెచ్చారన్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీలు బలహీన వర్గాలకు చెందిన వారే కానీ బలహీనులు కాదని.. బీసీలకు కేటాయించే బడ్జెట్ సరిపోవట్లేదని ఎంపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. సామాజిక వెనుకబాటు ఉన్నవారికి రిజర్వేషన్లు అందాలన్నారు. జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నామని బోస్ పేర్కొన్నారు. -
వైరముత్తుకు సీఎం, రాజకీయ నేతలు అండగా నిలవాలి : భారతీరాజా
చెన్నై: సినీ గీత రచయిత వైరముత్తుకి సీఎం, రాజకీయ నాయకులు అండగా నిలవాలని సీనియర్ దర్శకుడు భారతీరాజా విజ్ఞప్తి చేశారు. గీత రచయిత వైరముత్తు నాలుగైదు రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ప్రఖ్యాత దివంగత కవి, గీత రచయిత ఓఎన్వీ గురుప్ పేరుతో నెలకొల్పిన ఓ ఎన్ వి జాతీయ సాహితీ అవార్డును వైరముత్తుకు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనంతరం ఆయన ఈ అవార్డును ప్రకటించడంపై మలయాళనటి పార్వతి, గాయని చిన్మయి వంటి వారు తీవ్రంగా వ్యతిరేకించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఓ ఎన్ వి జాతీయ సాహితీ అవార్డును ప్రధానం చేయడమా? అంటూ విమర్శించారు. దీంతో ఓ ఎన్ వి సాంస్కృతిక అకాడమీ నిర్వాహకులు వైరముత్తుకు ఈ అవార్డును ప్రదానం చేయనుండటంపై పునరాలోచన చేస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారం వైరముత్తుకు తీవ్ర అవమానమే అనిచెప్పవచ్చు. అయితే ఈ అవార్డును అందుకోకుండానే వైరముత్తు దాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి విమర్శలకు గురయ్యారు. ఇలాంటి పరిణామాల మధ్య సీనియర్ దర్శకుడు భారతీరాజా వైరముత్తుకు అండగా నిలిచారు. ఆయన శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. భాష, రాజకీయ విద్వేషాలు కలిగి ఎక్కడి నుంచో వచ్చి మాతృభూమికి కళంకం ఏర్పరిచే విధంగా కొందరు మతం, జాతి, భాష పేరుతో విడగొట్టే దాడులు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను తమిళులమైన మనమందరం పుల్‌స్టాప్ పెట్టాలి. ప్రపంచ తమిళుందరితో కవి పేరరసు అనే బిరుదుతో గంభీరంగా నిలబడే కవి మిమ్మల్ని వంచాలని ప్రయత్నించే వారి కల కలగానే మిగిలిపోతుంది. తమిళులకు ఎప్పుడు అండగా నిలబడి తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు, ఇతర రాజకీయ వాదులు వైరముత్తుకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నానని దర్శకుడు భారతీరాజా పేర్కొన్నారు. చదవండి : వైరముత్తుకు భారీ షాక్.. ఓఎన్వీ అవార్డు వెనక్కి? లైంగిక ఆరోపణలేగా!.. మేమూ తగ్గం -
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటాం. కేసీఆర్ అనుమతితో విశాఖ వెళ్లి మద్దతు ఇస్తాం. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రధాని ప్రైవేట్‌పరం చేసేలా ఉన్నారు’’ అంటూ కేటీఆర్ తీవ్రంగా మండి పడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తథ్యమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ విషయంలో అవసరమైతేనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని.. అది కూడా నిర్దిష్ట విషయాల్లో మాత్రమే సంప్రదిస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరమయ్యే అంశాల్లో ఈ సంప్రదింపులు ఉంటాయని పేర్కొంది. చదవండి: స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఎంతదూరమైనా వెళ్తాం -
ఇదే నా నిరసన...
న్యూయార్క్: అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో పట్టపగలే నల్లజాతి వ్యక్తి జాకబ్ బ్లేక్పై పోలీసుల కాల్పుల ఘటన నిరసన సెగలు టెన్నిస్ ప్రపంచాన్నీ తాకాయి. జేకబ్‌కు మద్దతుగా వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ (సిన్సినాటి ఓపెన్) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రపంచ పదో ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్) ప్రకటించింది. ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన 22 ఏళ్ల ఒసాకా జాతి వివక్షకు వ్యతిరేకంగా తన గళమెత్తింది. అథ్లెట్ కన్నా ముందు నల్లజాతి మహిళగా అన్యాయంపై పోరు కోసమే టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు 2018 యూఎస్ ఓపెన్, 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల చాంపియన్ అయిన ఒసాకా ట్విట్టర్లో పేర్కొంది. ‘నేను ఈ మ్యాచ్ ఆడనంత మాత్రాన ఏదో అద్భుతం జరుగుతుందని అనుకోవట్లేదు. కానీ శ్వేత జాతీయుల ఆధిపత్యం ఉండే టెన్నిస్‌లో నా గళాన్ని వినిపిస్తే కాస్తయినా ఈ అంశంపై కదలిక వస్తుందని భావిస్తున్నా’ అని ఆమె రాసుకొచ్చింది. ఆమెకు సహచరుల నుంచి మద్దతు లభించడంతో నిర్వాహకులు టోర్నీని ప్రస్తుతానికి నిలిపివేశారు. దీంతో గురువారం జరగాల్సిన సెమీఫైనల్ పోటీలు ఒకరోజు పాటు ఆగిపోయాయి. వర్ణ వివక్షపై పోరు, సామాజిక న్యాయం కోసం పాటుపడే టెన్నిస్ క్రీడ మరోసారి దానికే కట్టుబడి ఉందని పేర్కొన్న యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్‌టీఏ), అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) వర్గాలు జేకబ్‌కు మద్దతుగా నిలుస్తున్నామని ప్రకటించాయి. ఈ టోర్నీ క్వార్టర్స్ ఫైనల్లో ఒసాకా 4–6, 6–2, 7–5తో అనెట్ కొంటావీ (ఎస్తోనియా)పై, యోహానా కొంటా (బ్రిటన్) 6–4, 6–3తో మారియా సాకరి (గ్రీస్)పై గెలుపొందారు. మరోవైపు నల్లజాతీయులకు న్యాయం జరగాలంటూ అథ్లెట్లు డిమాండ్ చేయడంతో బుధవారం నాటి ఎన్బీఏ, డబ్ల్యూఎన్బీఏ, బేస్‌బాల్, సాకర్ లీగ్‌లు మ్యాచ్‌లన్నీ వాయిదా పడ్డాయి. -
జొకోవిచ్‌కు నాదల్ మద్దతు
మాడ్రిడ్: కొన్నాళ్ల క్రితం కరోనా ఉధృతంగా ఉన్న వేళ... క్రొయేషియా, సెర్బియా వేదికల్లో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ‘ఆడ్రియా ఎగ్జిబిషన్ టూర్’ పేరుతో మ్యాచ్‌లు నిర్వహించాడు. దీని వల్ల అతడితో పాటు మరికొందరు టెన్నిస్ ప్లేయర్లు కరోనా బారిన పడ్డారు. దాంతో కరోనా సమయంలో మ్యాచ్‌లు ఏంటని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెన్నిస్ ప్రేమికులు జొకోవిచ్పై విమర్శలు గుప్పించారు. అయితే ఈ విషయంలో జొకోవిచ్‌కు అతని చిరకాల ప్రత్యర్థి, మరో దిగ్గజ ఆటగాడు రాఫెల్ నాదల్ మద్దతుగా నిలిచాడు. ‘మంచి జరుగుతుందని భావించి మనం చేసే పనుల్లో కొన్ని సార్లు తప్పులు దొర్లుతాయి. దానివల్ల కొంతమంది ఇబ్బంది కూడా పడొచ్చు. అదే ఆడ్రియా టూర్లో జరిగింది. అంత మాత్రాన ఆ పనిని చేసిన వ్యక్తిని పనిగట్టుకొని తిట్టడం మంచిది కాదు’ అని విమర్శకులకు హితవు పలికాడు. ఇకనైనా జొకోవిచ్పై విమర్శలకు స్వస్తి పలకాలని కోరాడు. -
‘ఎస్సీ, ఎస్టీ చట్టం’ రాజ్యాంగబద్ధమే
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం –2018 చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిరూపించలేకపోతే సదరు వ్యక్తికి బెయిల్ మంజూరు చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే ప్రాథమిక విచారణ అవసరం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరులంతా సమానమనీ, సోదరభావాన్ని పెంపొందించుకోవాలనీ, ముందస్తు బెయిల్ అవకాశాన్ని దుర్వినియోగం చేయడం పార్లమెంట్ ఉద్దేశాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ ఈ చట్టంలోని సెక్షన్ 18ఏ కింద పార్లమెంట్ ç2018లో సవరణలు చేసింది. అంతకుముందు డాక్టర్ సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టింది. ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు కొన్ని నిబంధనలను విధించింది. వీటిలో ప్రధానమైవి.. ‘నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండటం. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే ప్రాథమిక విచారణ చేపట్టడం, అరెస్టు చేయడానికి అనుమతి పొందాల్సి రావడం’. ప్రభుత్వోద్యోగుల విషయంలో అయితే నియామక అధికారి ఆమోదం, ప్రభుత్వేతర ఉద్యోగైతే సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆమోదం పొందాకే అరెస్టు చేయాలని అప్పట్లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిష్ప్రయోజకంగా మార్చిందంటూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో తీర్పును సమీక్షించాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వపు హక్కులకు భంగకరమంటూ చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ ఇంకొందరు కోర్టుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీల పట్ల దేశంలో కొనసాగుతోన్న వివక్ష కారణంగా చట్టం రూపకల్పనకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ప్రాథమిక విచారణ అక్కర్లేదని స్పష్టంచేసింది. -
‘మూడు ప్రాంతాల అభివృద్ధికి జైకొడదాం’
కదిరి: కోస్తా, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని..ఈ నిర్ణయానికి జై కొడదామని సినీ నటుడు కత్తి మహేష్ అన్నారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో టీడీపీ పెద్దలు భారీగా భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. జనసేనాని పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సేనానిలా మారిపోయారని విమర్శించారు. -
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా యూత్ కాంగ్రెస్ ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కు మద్దతుగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్ కోరారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కేసీఆర్ వ్యవహారశైలికి నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించాలని కోరారు. కేంద్రం అవలంబిస్తోన్న ఆర్థిక తిరోగమన విధానాలకు నిరసనగా ఈనెల 30న ఏఐసీసీ ఆధ్యర్వంలో నిర్వహించనున్న ‘భారత్ బచావో ర్యాలీ’కి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. అనంతరం గాంధీభవన్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి మాథెర్‌తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు కోసం ఎందాకైనా..
సాక్షి, అమరావతి: తీవ్ర మానసిక వేదనతో కుమిలిపోతున్న అగ్రిగోల్డ్ పాలుకావడంతో బాధితులకు న్యాయం జరిగేలా అండగా నిలిచి ఎందాకైనా పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ప్రాంతీయ సమావేశం ఉద్ఘాటించింది. విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన బాసట కమిటీ అసెంబ్లీ నియోకవర్గాల కో– ఆర్డినేటర్లు హాజరయ్యారు. బాసట కమిటీ రాష్ట్ర కో– ఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఖాతాదారులకు సంబంధించిన అగ్రిగోల్డ్ సమస్యపై రాజకీయ కోణంలో కాకుండా, వారికి న్యాయం జరగాలన్న లక్ష్యంతోనే తమ ఉద్యమం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదుకుంటామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అవకాశం ఉన్నప్పటికీ కావాలనే కాలయాపన చేసిందని, ఎన్నికల ముందు మళ్లీ బాధితులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. బాధితులకు బాసటగా నిలుద్దామని, వారిలో ఆత్మస్థైర్యం నింపడం ద్వారా ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోకుండా చూడాలని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు అసెంబ్లీ కో– ఆర్డినేటర్లు మాట్లాడుతూ జనవరి 3వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేసేలా శ్రేణుల్ని సమాయత్తం చేస్తామన్నారు. బాధితుల్ని కలసి ధర్నాలో పాల్గొనేలా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఉద్యమంలో ఎవరు కలిసి వచ్చినా ఆహ్వానిస్తామని, బాధితులకు న్యాయం జరుగుతుందంటే అన్ని సంఘాలతోనూ కలిసి పోరాడాతామని వారు ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే పాలనను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ నుంచి బాధితులకు ఇవ్వాల్సిన ప్రతి పైసా వసూలు చేసి ఇస్తారని, ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గ కో– ఆర్డినేటర్లు రావూరి వీరవెంకట సత్యదుర్గాప్రసాద్(ఏలూరు), కొఠారి శ్రీనివాస్(మచిలీపట్నం), అడపా శేషు(విజయవాడ), మర్రి సుబ్బారెడ్డి(నరసరావుపేట), వనమా బాల వజ్రబాబు(గుంటూరు), చేజర్ల నారాయణరెడ్డి(బాపట్ల) మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల కో– ఆర్డినేటర్లు రాయప్రోలు శ్రీనివాసమూర్తి(భీమవరం), బాలం వెంకటేశ్వరరావు(గోపాలపురం), ఆర్.సూర్యనారాయణ(నిడదవోలు), కడియాల సూర్యనారాయణ(తణుకు), చింతకాయల సత్యనారాయణ(తాడేపల్లిగూడెం), గాజుల వెంకటేశ్వరరావు(ఉంగుటూరు), టి.నాగమురళి(దెందులూరు), బాలేపల్లి నాగరాజు(చింతలపూడి) తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన చక్కా జగన్మోహనరావు(కైకలూరు), ఎండీ హాఫీజు రెహమాన్(మచిలీపట్నం), బంక ప్రసాద్(తిరువూరు), బొడ్డు అప్పలనాయుడు(విజయవాడ తూర్పు), లింగాల నిరిక్షణంకుమార్(మైలవరం), ముత్యాల వెంకటచలం(జగ్గయ్యపేట) మాట్లాడారు. గుంటూరు జిల్లాకు చెందిన టి.బ్రహ్మారెడ్డి(తాడికొండ), బొమ్మ నాగిరెడ్డి(తెనాలి), మామిడి రాము(గుంటూరు పశ్చిమ), ఈర్ల శివరామకృష్ణ (పెద్దకూరపాడు), సీహెచ్. పుల్లారెడ్డి(వినుకొండ), ఎన్.సత్యనారాయణ(గురజాల), కె.చంద్రశేఖర్(మాచర్ల), సన మహేందర్(బాపట్ల) ప్రసగించారు. -
కంచె ఐలయ్యకు మవో మద్దతు
-
వైఎస్ జగన్ దీక్షకు అనంత రైతుల మద్దతు
-
ముగింపు పలకాల్సిన టైం వచ్చింది
-
ఏపీటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థికి డీటీఎఫ్ మద్దతు
అనంతపురం: ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘురామయ్యకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేష¯ŒS (డీటీఎఫ్)సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవ¯ŒSలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యాంసుందర్‌రెడ్డి రఘురామయ్య, రాష్ట్ర కార్యదర్శి నరశింహులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధవ, ప్రభాకర్, గౌరవాధ్యక్షులు రామచంద్ర మాట్లాడారు. ఏపీటీఎఫ్, డీటీఎఫ్ ఫెడరేష¯ŒSల విధానాలు, లక్ష్యాలు, ఆశయాలు ఒకే విధంగా భావసారూప్యం కలిగి ఉండడం వల్ల డీటీఎఫ్ ఏపీటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థికి భేషరతుగా మద్దతు ఇస్తున్నామన్నారు. డీటీఎఫ్ అధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు పాల్గొన్నారు. -
‘అంగన్వాడీల సమస్యలపై పోరాడతాం’
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన దీక్షలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుజయరంగారావు మద్దతు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను తమ పార్టీ తరఫున ప్రస్తావిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బొబ్బిలిలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. వేతన పెంపు జీవో వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు కొనసాగిస్తున్న విషయం విదితమే. -
వైఎస్ జగన్ దీక్షకు హర్షకుమార్ మద్దతు
రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం వైఎస్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు మాజీ ఎంపీ జి వి హర్షకుమార్ మద్దతు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నేతల చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం హర్షకుమార్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ దీక్ష తన స్వార్థం కోసం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం కలిసి పోరాడాలని హర్షకుమార్ అన్ని పార్టీలకు సూచించారు. -
వైఎస్ జగన్ దీక్షకు కాకినాడ మహిళల మద్దతు
-
దీక్షతోనైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి
-
రాజధాని నిర్మాణమంతా గ్రాఫిక్స్
-
జగన్ దీక్షకు విద్యార్ధులు మద్దతు
-
ఎయిర్‌పోర్టు బాధితులకు అండగా ఉంటా
-
పోరాటానికి వామపక్షాల మద్దతు
- కేంద్రం జోక్యం చేసుకోకపోవడాన్ని ఖండిస్తున్నామన్న ఏచూరి - సీపీఐ నుంచి సంఘీభావం తెలిపిన ఎంపీ జయదేవన్ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్సీపీ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు వామపక్షాలు మద్దతు పలికాయి. ఈ పోరాటానికి తాము మద్దతు తెలుపుతున్నామని సీపీఐ, సీపీఎంలు ప్రకటించాయి. మధ్యాహ్నం 3 గంటలకు జగన్ ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాగా.. ఆయనను ఆహ్వానిస్తూ ప్రసంగించాలని జగన్ కోరారు. దాంతో ఏచూరి మాట్లాడారు. ‘మీ న్యాయమైన డిమాండ్‌పై నేను ఏకీభవిస్తున్నా. పూర్తి మద్దతు ఇవ్వడానికి నేడు మీ ముందున్నా.. పార్లమెంటులో విభజన అంశం వచ్చిననాడే మేం వ్యతిరేకించాం. కానీ వినిపించుకోలేదు. బీజేపీ నాయకులు అప్పుడు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. ఏడాది దాటినా ఏ సమస్యా పరిష్కారం కాలేదు. కేంద్రం వైఖరిని ఖండిస్తున్నాం. దీనిపై అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకహోదాపై పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్‌కు పూర్తి మద్దతు తెలుపుతున్నాం..’ అని ప్రకటించారు. సీపీఐ ఎంపీ జయదేవన్ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ...‘ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ పోరాటానికి మద్దతు తెలుపుతున్నాం. హోదా సాధించే వరకూ వైఎస్సార్సీపీ పోరాటంలో భాగస్వామ్యులమవుతాం..’ అని పేర్కొన్నారు. -
ఆర్టీసీ సమ్మెకు వైఎస్సార్సీపీ మద్దతు
-
'ఆర్టీసీ సమ్మెకు మంత్రి హరీష్‌రావు మద్దతు'
-
సమ్మెకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్సీపీ
విజయనగరం(పార్వతీపురం): పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదుట ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వైఎస్సాసీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణా రంగారావు, పుష్పశ్రీవాణిలు సంఘీభావం తెలిపారు. శనివారం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదుట ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమ్మెలో వైఎస్సార్సీపీతో పాటు సీపీఐ, సీఐటీయూ, పలు విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులను డిపో నుంచి బయటకు వెళ్లకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. -
అనుష్కశర్మకు ఆసిన్ వకాల్తా
నటి అనుష్క శర్మకు ఆసిన్ వకల్తా పుచ్చుకున్నారు. సినిమా నటిగా ప్రాచుర్యం కంటే అధికంగా ఇప్పుడు వేరే విధంగా జనాల నోళ్లలో నానిపోతున్నారు నటి అనుష్కాశర్మ. ఆమెకు క్రికెట్ కళాకారుడు విరాట్‌కోహ్లికి మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే వీరి సంబంధం గురించి ఇప్పుడు నిక్కర్లు తొడుక్కునే కుర్రాళ్ల వరకు తెలిసిపోయింది. ఇక సోషల్నెట్ వర్క్సులో అయితే ఈ సంచలన జంట గురించి రకరకాలుగా ఏకేస్తున్నారు. కారణం చెప్పనక్కరలేదు. ఇటీవల జరిగిన ప్రపంచకప్ క్రికెట్ క్రీడలో విరాట్‌కోహ్లి ఆట తీరు అది తిలకించడానికి సిడ్నీ వెళ్లిన నటి అనుష్క శర్మ ప్రవర్తన ఇండియా సెమీఫైనల్లో ఓడిపోవడానికి కారణం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. విరాట్‌కోహ్లి ఒకే ఒక్క రన్‌తో పెవిలియన్‌కు దారి తీయడం క్రికెట్ క్రీడా ప్రియులు జీర్ణం చేసుకోవడం లేదు. కోహ్లి, అనుష్కశర్మపై పెట్టిన ఏకాగ్రత క్రికెట్‌పై పెట్టలేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నటి అనుష్క శర్మకు నటి ఆసిన్ వకాల్తా పలకడం విశేషం. ఆమె ఈ వ్యవహారం గురించి తన ట్విట్టర్లో పేర్కొంటూ అనుష్కశర్మను తప్పుపట్టడం మూర్ఖులు చేసే పని అన్నారు. భారత క్రికెట్ జట్టుకు మద్దతు ఇవ్వడానికి వెళ్లటం ఆమె చేసిన తప్పా అంటూ ప్రశ్నించారు. పని లేని కొందరు తన అమాయకత్వాన్ని వేరే విధంగా చూపుతున్నారని దుయ్యబట్టారు. ఇంతకుముందు ఆసిన్, భారత క్రికెట్ కెప్టెన్ ధోని మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగింది. అది నిజం చేస్తూ ఆసిన్ అనుష్కశర్మకు వకాల్తా పలికే ధోరణిలో ధోనిని వెనకేసుకొస్తున్నట్లు టాక్ స్ప్రెడ్ అవడం గమనార్హం. -
ముద్దు పెట్టుకోవడం తప్పేమీ కాదు!
‘కిస్ ఆఫ్ లవ్’... ఈ వ్యవహారం ప్రస్తుతం చాపకింద నీరులా దేశం మొత్తం వ్యాప్తి చెందుతోంది. కేరళ బీచ్‌లో నిదానంగా మొదలై ఇప్పుడో ఉద్యమంలా రూపుదాల్చుతోంది. ‘పరస్పరం ప్రేమించుకున్నప్పుడు బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం తప్పుకాదు..’ అనేది ‘కిస్ ఆఫ్ లవ్’ కాన్సెప్ట్. దీనిని వ్యతిరేకించేవారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. కేరళ రాష్ట్రంలో ‘కిస్ ఆఫ్ లవ్’ నిర్వహించాలనుకున్నప్పుడు ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) వాళ్లు అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగాయి. పోలీసులు కూడా ‘మోరల్ పోలీసింగ్’ చేస్తూ ఈ ముద్దుల పండుగను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై ఇప్పటివరకూ సినిమా సెలబ్రిటీలెవరూ స్పందించలేదు. అయితే... మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మాత్రం సామాజిక మాధ్యమం ద్వారా ‘కిస్ ఆఫ్ లవ్’కి మద్దతు పలికారు. ‘‘నచ్చిన వారిని ముద్దు పెట్టుకునే హక్కు మనకుంది. అంతే తప్ప మన ముందు ఇతరులు ముద్దు పెట్టుకోకూడదు అని నియంత్రించే హక్కు ఎవరికీ లేదు. ‘ముద్దు’ అనేది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. దీన్ని చట్టపరిధిలోకి తీసుకురావడం తప్పు’’ అని పేర్కొన్నారు మోహన్‌లాల్. ‘మోరల్ పోలీసింగ్’పై స్పందిస్తూ- ‘‘ప్రేమను తెలియజెప్పే గొప్ప సాధనం ముద్దు. దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం. వంతెనలు కూలిపోతున్నప్పుడు, రోడ్లు గోతులుగా మారిపోతున్నప్పుడు, పసికందులు అత్యాచారాలకు గురి అవుతున్నప్పుడు, తాగే నీరు కలుషితంగా మారుతున్నప్పుడు, కన్న తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొడుతున్నప్పుడు, యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల్లో పడి ఉన్న మనిషిని పట్టించుకోకుండా ఎవరి మానాన వాళ్ల్లు పోతున్నప్పుడు.. పట్టించుకోనివాళ్ళకు ఈ బహిరంగ చుంబనం మాత్రం ఘోరంగా కనిపించటం శోచనీయం. ఇష్టం లేకపోతే తల తిప్పుకోండి. బాహాటంగా ముద్దు పెట్టుకోవడం తప్పేమీ కాదు’’ అని ఘాటుగా స్పందించారు మోహన్‌లాల్. -
తూర్పులో సమైక్య సెగలు
సమైక్యాంధ్రకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లాలో సమైక్య సెగలు మిన్నంటాయి. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆమరణ నిరాహరదీక్షలు చేపట్టారు. జగన్ దీక్షకు మద్దతుగా ముమ్మిడివరంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష బుధవారం 5వ రోజుకు చేరింది. అలాగే అయినవల్లి మండలం ముక్తేశ్వరంలో మందపాటి కిరణ్‌కుమార్ చేపట్టిన దీక్ష 2 రోజుకు చేరుకుంది. వీటీతోపాటు ఉప్పలగుప్తంలో కమిడి చిన్నపరాజు చేపట్టిన దీక్ష కూడా రెండవ రోజుకు చేరుకుందన్నారు. అయితే జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి నదిలో జలయాత్ర చేపట్టింది. మధ్యాహ్నం గంటి పెదపూడి నుంచి పి.గన్నవరం వరకు ఆ యాత్ర కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. సరైన ప్రయాణ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే విద్యాసంస్థలకు యాజమాన్యం సెలవులు ప్రకటించారు. దుకాణదారులు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేశారు. -
విజయమ్మ దీక్షకు కడపలో మద్దతు