విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తాం: కేటీఆర్‌ | TRS Leader KTR Supports Visakha Steel Plant Protest | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తాం: కేటీఆర్‌

Mar 10 2021 1:57 PM | Updated on Mar 10 2021 2:14 PM

TRS Leader KTR Supports Visakha Steel Plant Protest - Sakshi

 ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం

సాక్షి, హైదరాబాద్‌: విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటాం. కేసీఆర్ అనుమతితో విశాఖ వెళ్లి మద్దతు ఇస్తాం. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రధాని ప్రైవేట్‌పరం చేసేలా ఉన్నారు’’ అంటూ కేటీఆర్‌ తీవ్రంగా మండి పడ్డారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తథ్యమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ విషయంలో అవసరమైతేనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని.. అది కూడా నిర్దిష్ట విషయాల్లో మాత్రమే సంప్రదిస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరమయ్యే అంశాల్లో ఈ సంప్రదింపులు ఉంటాయని పేర్కొంది.

చదవండి: 

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఎంతదూరమైనా వెళ్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement