మాడ్రిడ్: కొన్నాళ్ల క్రితం కరోనా ఉధృతంగా ఉన్న వేళ... క్రొయేషియా, సెర్బియా వేదికల్లో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ‘ఆడ్రియా ఎగ్జిబిషన్ టూర్’ పేరుతో మ్యాచ్‌లు నిర్వహించాడు. దీని వల్ల అతడితో పాటు మరికొందరు టెన్నిస్ ప్లేయర్లు కరోనా బారిన పడ్డారు. దాంతో కరోనా సమయంలో మ్యాచ్‌లు ఏంటని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెన్నిస్ ప్రేమికులు జొకోవిచ్‌పై విమర్శలు గుప్పించారు. అయితే ఈ విషయంలో జొకోవిచ్‌కు అతని చిరకాల ప్రత్యర్థి, మరో దిగ్గజ ఆటగాడు రాఫెల్ నాదల్ మద్దతుగా నిలిచాడు. ‘మంచి జరుగుతుందని భావించి మనం చేసే పనుల్లో కొన్ని సార్లు తప్పులు దొర్లుతాయి. దానివల్ల కొంతమంది ఇబ్బంది కూడా పడొచ్చు. అదే ఆడ్రియా టూర్‌లో జరిగింది. అంత మాత్రాన ఆ పనిని చేసిన వ్యక్తిని పనిగట్టుకొని తిట్టడం మంచిది కాదు’ అని విమర్శకులకు హితవు పలికాడు. ఇకనైనా జొకోవిచ్‌పై విమర్శలకు స్వస్తి పలకాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment