
సాక్షి, ఢిల్లీ: కులాలవారీగా జనగణన చేపట్టాలంటూ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ధర్నాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ సంక్షేమ సంఘాలు పాల్గొన్నాయి. కాగా ఈ ధర్నాకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ధర్నాలో ఎంపీలు మార్గాని భరత్, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య హాజరయ్యారు.
చదవండి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ
కాగా అనేక చిన్నచిన్న కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయంగా గుర్తింపు తెచ్చారన్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీలు బలహీన వర్గాలకు చెందిన వారే కానీ బలహీనులు కాదని.. బీసీలకు కేటాయించే బడ్జెట్ సరిపోవట్లేదని ఎంపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. సామాజిక వెనుకబాటు ఉన్నవారికి రిజర్వేషన్లు అందాలన్నారు. జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నామని బోస్ పేర్కొన్నారు.