
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల స్టాండింగ్ కమిటీల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు నియమితులయ్యారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైవీ. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి.. విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి, రవాణా టూరిజం సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా విజయసాయిరెడ్డిలకు చోటు దక్కింది.
పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా గొల్ల బాబురావు, కెమికల్ ఫర్టిలైజర్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా మేడ రఘునాథ్ రెడ్డి.. గృహ పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, డాక్టర్ గుమ్మ తనుజారాణి, పెట్రోలియం నాచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా గురుమూర్తి, కమ్యూనికేషన్స్ ఐటి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నిరంజన్ రెడ్డి నియమితులయ్యారు.
ఇదీ చదవండి: తిరుమలకు జగన్.. కూటమి సర్కార్ ‘అతి’ చేష్టలు
Comments
Please login to add a commentAdd a comment