BC communities
-
బీసీలకు ద్రోహం...టీడీపీ కూటమిలో బీసీలకు కోత..
-
బాబుకు బీసీలు బైబై
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బైబై బాబూ..! అంటూ బీసీలు ‘‘సిద్ధం’’ అవుతున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబును ఛీకొట్టగా తమను సామాజికంగా, రాజకీయంగా అక్కున చేర్చుకున్న వైఎస్సార్ సీపీ వెంట బీసీలు నడుస్తున్నారు. బలహీన వర్గాలు అత్యధికంగా ఉండే అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ తాజాగా నిర్వహించిన సిద్ధం సభకు తరలివచ్చిన జనసందోహమే అందుకు నిదర్శమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బీసీల గడ్డ కుప్పంలో సైతం వలస నేత చంద్రబాబును తరిమేందుకు బలహీన వర్గాలు సిద్ధం కావడంతో సొంత సామాజిక వర్గాన్ని శరణు వేడుతూ చంద్రబాబు పక్క చూపులు చూడటాన్ని ఉదహరిస్తున్నారు. ‘కుప్పం’లో చొరబడి మూడున్నర దశాబ్దాలుగా పీడిస్తున్న చంద్రబాబు రాజకీయ జీవితానికి తెర పడటం ఖాయమైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గత ఎన్నికల్లో గెలుపొందిన కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఆధిక్యాన్ని కట్టబెట్టడం ద్వారా ప్రజలు తమ అభీష్టాన్ని ఇప్పటికే తేటతెల్లం చేశారు. కుప్పం నియోజకవర్గ ఓటర్లలో బీసీలే అత్యధికం. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంలో బీసీలే ప్రధాన భూమిక పోషించినట్లు టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. దీంతో కుప్పం నుంచి మరోసారి బరిలోకి దిగితే రాజకీయ సమాధి తప్పదని పసిగట్టిన చంద్రబాబు పరువు కాపాడుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇక తనకు విశ్రాంతి అవసరమని స్వయంగా భార్య ద్వారా చెప్పించడం ద్వారా చంద్రబాబు ఇప్పటికే ఓటమిని అంగీకరించి చేతులెత్తేశారు. సొంత సామాజిక వర్గాన్ని నమ్ముకుంటూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సురక్షిత స్థావరాల కోసం అన్వేషిస్తున్నారు. టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లె వేస్తూ రాజకీయ అవసరాలు తీరాక ఆ వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు బీసీలకు ఇచ్చిన హామీల కంటే మిన్నగా గత 58 నెలలుగా ముఖ్యమంత్రి జగన్ సామాజిక న్యాయం చేయడంతో ఆ వర్గాలు వైఎస్సార్సీపీ వెంట నడుస్తున్నాయి. భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు ఒకదానికి మించి మరొకటి విజయవంతం కావడంతో ఇది ప్రస్ఫుటితమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తరిమిన ‘కోట’.. చంద్రబాబు 1978 ఎన్నికల్లో సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందగా 1983లో అక్కడ చిత్తుగా ఓడిపోయారు. ఆ వెంటనే టీడీపీ పంచన చేరిన చంద్రబాబు ఓటమి భయంతో 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్టీఆర్ అభిమానులు, బీసీలు అధికంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎన్.రంగస్వామినాయుడు అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో 1989లో కుప్పం వలస వెళ్లిన చంద్రబాబు తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారి దొంగ ఓట్లను చేర్చి వరుసగా నెగ్గుకొస్తున్నారు. అయితే ఇటీవల అధిక భాగం దొంగ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. మరోవైపు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్, మున్సిపాల్టీగా చేసిన సీఎం జగన్ అభివృద్ధి బాట పట్టించారు. సంక్షేమ పథకాల ద్వారా కుప్పం వాసులకు మంచి చేస్తున్నారు. కుప్పం పరిధిలో మున్సిపాల్టీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 2,12,049 ఓట్లు ఉంటే 1,43,820 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్సార్సీపీకి 99,586 ఓట్లు రాగా టీడీపీకి కేవలం 34,235 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే టీడీపీ కంటే వైఎస్సార్సీపీకి 65,351 ఓట్ల మెజార్టీ వచి్చనట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో చంద్రబాబుకు లభించిన మెజార్టీ 30,722 ఓట్లు మాత్రమే. వీటిని పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబుకు వచ్చిన మెజార్టీ కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 34,629 ఓట్ల ఆధిక్యత లభించింది. తద్వారా చంద్రబాబు కోట ఇప్పటికే కుప్పకూలినట్లు స్పష్టమవుతోంది. కుప్పం నియోజక వర్గానికి కృష్ణా జలాలను తరలించే పేరుతో చంద్రబాబు నాడు ప్రభుత్వ ఖజానాను దోచేయగా ఇప్పుడు సీఎం జగన్ ఆ పనులను పూర్తి చేసి సాగు, తాగు నీరు అందిస్తుండటంతో వైఎస్సార్సీపీ పట్ల ప్రజలలో ఆదరణ మరింత పెరిగింది. తోకలు కత్తిరిస్తా.. తాటతీస్తా 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే అధికంగా రాజ్యసభకు పంపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారీ పోకడలను చాటుకున్నారు. న్యాయం చేయాలని విన్నవించుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ హూంకరించారు. హామీని నెరవేర్చాలని కోరిన పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులను బెదిరించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యానించి దళితులను దారుణంగా అవమానించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ బాబు అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన విద్యావేత్తలు గుర్తు చేస్తున్నారు. వెన్నుకు దన్నుగా గత ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో చెప్పిన దాని కంటే మిన్నగా 58 నెలలుగా ఆ సామాజిక వర్గాలకు సీఎం జగన్ గరిష్ట స్థాయిలో ప్రయోజనం చేకూర్చారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా 58 నెలల్లో డీబీటీతో పేదల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు జమ చేయగా రూ. 1,20,022.96 కోట్ల మేర బీసీలకే లబ్ధి చేకూరడం గమనార్హం. నాన్ డీబీటీ రూపంలో పలు వర్గాలకు రూ. 1.76 లక్షల కోట్ల వరకు మేలు జరగ్గా అందులో బీసీలకు రూ.50,657.39 కోట్ల దాకా ప్రయోజనం దక్కింది. డీబీటీ, నాన్ డీబీటీతో కలిపి రూ. 1,71,290.37 కోట్ల మేర బీసీలకు సీఎం జగన్ లబ్ధి చేకూర్చారు. రాజ్యాధికారంలో సింహభాగం.. సీఎం జగన్ మంత్రివర్గంలో 25 మంది ఉండగా అందులో 11 మంది బీసీలకే అవకాశం ఇచ్చారు. ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించడంతోపాటు ప్రధానమైన రెవెన్యూ, విద్యా, పౌరసరఫరాలు, వైద్యం, ఆరోగ్యం లాంటి ప్రధానమైన శాఖలను బలహీన వర్గాలకే అప్పగించి పరిపాలనలో సముచిత భాగస్వామ్యం కల్పించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశమిచ్చారు. బీసీ వర్గాలకు చెందిన నలుగురిని రాజ్యసభకు పంపిన సీఎం జగన్ శాసనమండలిలో సైతం సింహభాగం పదవులు ఆ వర్గాలకే ఇచ్చారు. స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి దక్కిన 13 జడ్పీ ఛైర్మన్ పదవులకుగానూ 6 బీసీలకే ఇచ్చారు. 84 మున్సిపల్ ఛైర్మన్ పదవులకుగానూ 44 బలహీన వర్గాలకే కేటాయించారు. 14 కార్పొరేషన్ల మేయర్ పదవులకుగానూ తొమ్మిది బీసీలకే దక్కేలా చేశారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించేలా ఏకంగా చట్టం చేసి మరీ ఇచ్చారు. దాంతో రాజకీయ, ఆర్థిక, విద్యా, మహిళా సాధికారత ద్వారా సామాజిక సాధికారతను బీసీలు సాధించారు. తమను అవహేళన చేసిన చంద్రబాబును ఛీకొట్టిన బీసీలు సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దుతున్న సీఎం జగన్ వెంట నడుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించగా 39 శాతం ఓట్లతో 23 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఆ పార్టీ చరిత్రలో అదే ఘోర పరాజయం. సీఎం జగన్ అందిస్తున్న సుపరిపాలనతో బీసీలు వైఎస్సార్సీపీని అక్కున చేర్చుకుంటున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడులో జరిగిన ‘సిద్ధం’ సభలకు లక్షలాది మంది పోటెత్తగా వారిలో బీసీలే అత్యధికంగా ఉన్నట్లు టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. బీసీలు వైఎస్సార్సీపీ వెంట నడుస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో మరో చారిత్రక పరాజయం తప్పదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. -
ఢిల్లీ జంతర్‌మంతర్: బీసీ సంఘాల ఆందోళన.. వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, ఢిల్లీ: కులాలవారీగా జనగణన చేపట్టాలంటూ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ ధర్నాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ సంక్షేమ సంఘాలు పాల్గొన్నాయి. కాగా ఈ ధర్నాకు వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ధర్నాలో ఎంపీలు మార్గాని భరత్, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య హాజరయ్యారు. చదవండి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ కాగా అనేక చిన్నచిన్న కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయంగా గుర్తింపు తెచ్చారన్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీలు బలహీన వర్గాలకు చెందిన వారే కానీ బలహీనులు కాదని.. బీసీలకు కేటాయించే బడ్జెట్ సరిపోవట్లేదని ఎంపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. సామాజిక వెనుకబాటు ఉన్నవారికి రిజర్వేషన్లు అందాలన్నారు. జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నామని బోస్ పేర్కొన్నారు. -
బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్: సజ్జల
సాక్షి, అమరావతి: బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ అని, బలహీనవర్గాల ఎదుగుదల కోసం ఆయన కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని అన్నారు. దుష్ప్రచారాలను మనందరం కలిసి తిప్పి కొట్టాలన్నారు. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ అని గుర్తుచేశారు. గత నాయకులు బలహీనవర్గాలను ఓటుబ్యాంకుగా చూస్తే, బలహీనవర్గాల ఎదుగుదల కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. సంప్రదాయ బద్దమైన రాజకీయాలు చేసి లబ్ది కోసం కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం చూసే నాయకుడు సీఎం జగన్ అన్నారు. కొంతమంది చేయలేని పనులను ముఖ్యమంత్రి జగన్ చేస్తుంటే రాజకీయ శూన్యంతో ఆరోపణలు చేస్తూ, పిచ్చిరాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుష్పచారాలను మనమంతా కలిసి తిప్పికొట్టాలన్నారు. బీసీల్లోని 139 కులాలకు గొప్ప అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ఈ అవకాశం ఉపయోగించుకొని సామజికంగా, రాజకీయంగా ఎదగాలన్నారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సీఎం జగన్ ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నానని సజ్జల తెలిపారు. -
తెలంగాణ: బీసీల కోసం కొత్త పథకం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారత కోసం కొత్త పథకాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీల సంక్షేమం కోసం 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో రూ.5,200 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం.. అందులోనూ అత్యంత వెనుకబడిన వర్గాలు (ఎంబీసీలు), బీసీల్లోని మహిళల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే దిశలో ‘కేసీఆర్ ఆపద్బంధు’పేరుతో కార్యాచరణ రూపొందిస్తోంది. ఎంబీసీల్లోని నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడం కోసం అంబు లెన్స్‌లు మంజూరు చేయడం, స్వయం సహాయక సంఘాల్లోని బీసీ మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి వారికి అధునాతన పరికరాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక సాధికారత చేకూర్చడం, కొన్ని బీసీ కులాలు సంచార పద్ధతిలో కొనసాగించే వృత్తులను సులభతరం చేసేందుకుగాను వాహనాలు సమకూర్చడం, మరికొన్ని కులాల వారికి వృత్తి పనిముట్లను పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలను బీసీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27 నుంచి ఈ ఆపద్బంధు పథకాన్ని ప్రారంభించేందుకు బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ త్వరలో విధివిధానాలు ఖరారు చేయనుంది. 80 శాతానికి పైగా సబ్సిడీతో అంబులెన్సులు ఆపద్బంధు పథకం కింద రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన ఎజెండాగా కార్యాచరణ సిద్ధమవుతోంది. బీసీ సంక్షేమ శాఖ వెల్లడించిన ప్రకారం.... రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎంబీసీ యువకులకు అంబులెన్సులు అందజేయనున్నారు. ఐదారుగురు యువకులతో ఒక గ్రూపును ఏర్పాటు చేసి, ఆ గ్రూపును లబ్ధిదారులుగా ఎంపిక చేసి అంబులెన్సులు ఇస్తారు. వీటిలో మినీ ఐసీయూతో పాటు వెంటిలేటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో అంబులెన్సు (యూనిట్) ధర రూ.26 లక్షలు ఉంటుంది. ఇందులో లబ్ధిదారులైన గ్రూపు సభ్యులు 10–15 శాతం మార్జిన్ మనీ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఎంత శాతం చెల్లించాలన్నది ఇంకా ఖరారు కాకపోయినా యూనిట్ ధరలో 85 శాతానికి పైగా ప్రభుత్వమే సబ్సిడీ కింద భరించనుంది. రోడ్ సేఫ్టీ అథారిటీతో పాటు ప్రైవేటు సంస్థలతో ఈ ఆంబులెన్సుల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకుని వారికి ఖచ్చితమైన, శాశ్వత ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మహిళా సంఘాలకు నిఫ్ట్‌లో తర్ఫీదు మరోవైపు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న బీసీ మహిళలకు అత్యాధునిక పద్ధతుల్లో కుట్టు శిక్షణ కూడా ఆపద్బంధు ద్వారా ఇప్పించనున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ద్వారా ఈ శిక్షణను ఇప్పించి అందులో ఉత్తీర్ణులైన సభ్యులకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ లాంటి ఆధునిక సామాగ్రిని అందించనున్నారు. ముందుగా పట్టణ ప్రాంతాల్లోని సభ్యులకు ఈ అవకాశం కల్పించాలని, ఆ తర్వాత మండల స్థాయి వరకు వెళ్లాలని బీసీ సంక్షేమ శాఖ యోచిస్తోంది. మారుతున్న ఫ్యాషన్ పోకడల నేపథ్యంలో ఇలాంటి శిక్షణ బీసీ మహిళలకు ఉపకరిస్తుందని, వారికి ఆర్థిక సాధికారత చేకూరుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం తొలి విడతలో 50 వేల మంది బీసీ మహిళా సభ్యులను ఎంపిక చేయనున్నారు. పూసలమ్ముకునేందుకు ప్రత్యేక వాహనం ఇక బీసీ కులవృత్తులకు ఆసరాగా నిలిచే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆపద్బంధు విధివిధానాలు రూపొందిస్తోంది. సంచార వృత్తితో జీవనం సాగించే పూసల కులస్తుల కోసం ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. వీరి వృత్తికి అనుగుణంగా ఉండే విధంగా ప్రత్యేక వాహనాలు (మోపెడ్లు) తయారు చేయించి ఇవ్వాలని నిర్ణయించారు. వీరితో పాటు రజక, నాయీ బ్రాహ్మణ, కుమ్మరి, మేదర, విశ్వ బ్రాహ్మణ, సగర, వడ్డెర కులస్తులకు ప్రతి కులానికి కనీసం 5వేల మందికి చొప్పున వారి వారి వృత్తి పనిముట్లను అందజేసే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధికి నిదర్శనం: మంత్రి గంగుల రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ మదిలో ప్రత్యేక ఆలోచనలున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ‘సాక్షి’తో చెప్పారు. వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు అమల్లో ఉన్నాయని, ఇప్పుడు ఆపద్బంధు పథకం అమలు చేయడం ద్వారా బీసీలపై తనకున్న చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటోందని అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమని చెప్పిన గంగుల.. ఆపద్బంధు కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
నాడు భయమేసింది.. నేడు సంతోషంగా ఉంది: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: బీసీల అభ్యున్నతికి ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు పాలకవర్గాలను కూడా నియమించడం ఓ చరిత్ర. బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. మంత్రి వర్గంలో కూడా బీసీలకు పెద్దపీట వేశారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వివిధ బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమితులైన వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో నలుగురికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. వైఎస్ జగన్ పాదయాత్రలో చెప్పిన హామీలు, మెనిపెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చారు. మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేశారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రం, జిల్లాలో కాదు, కనీసం కుప్పంలో కూడా ఏమి చెయ్యలేకపోయారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 63 శాతం బీసీలకు కల్పించిన ఘనత సీఎం జగన్‌దే. జగన్ సీఎం కాక ముందు ఏం చేస్తారో అని కాస్త భయం వేసేది. కానీ నేడు ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు. డిప్యూటీ సీయం నారాయణ స్వామి మట్లాడుతూ.. సీఎం ఓ కులానికో, మతానికో పరిమితం కాదు. అందుకే వెనుకబడిన కులాలను ఆభివృద్ధి చెయ్యడానికే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మేకపాటి గౌతమ్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 4 చైర్మన్లు, 58 డైరెక్టర్లు దక్కడం చాలా సంతోషకరమైన విషయం. సీఎం వైఎస్ జగన్ ఆర్థికంగా, రాజకీయంగా బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు వారి కులాలకు అందుబాటులో ఉండాలి, బీసీల అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరుతున్నట్లు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పేర్కొన్నారు. చదవండి: (హెరిటేజ్‌పై ఐటీ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం) వారందరికీ అభినందనలు: భూమన సీఎం జగన్ ఆశీస్సులతో బీసీ కార్పొరేషన్ చైర్మన్లుగా ఎన్నికయిన వారిందరికీ అభినందనలు. దేశంలో 56 బీసీ కార్పొరేషన్లను అధికారికంగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌దే. బీసీలు సీఎంలుగా ఉన్న రాష్ట్రాలలో కూడా బలహీన వర్గాలకి ఇంత పెద్ద పీట వెయ్యలేదు. అది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యం అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కరపత్రాలు పంచి అసత్య ప్రచారాలు: ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి చంద్రబాబు కావాలనే మాపై కరపత్రాలు పంచి అసత్య ప్రచారాలు చేయిస్తున్నాడని ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు కావాలనే రెచ్చగొట్టే విధంగా మనుషులను ఉసిగొలుపుతున్నాడు. చంద్రబాబూ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి వచ్చి చర్చించు. అంతే కానీ, హైదరాబాదులో కూర్చొని రాజకీయ, కుయుక్తులు చేయడం సరికాదు అని అన్నారు. సీఎం జగన్‌కి కృతజ్ఞతలు: ఆర్కే రోజా బీసీల పార్టీగా చెప్పుకున్న చంద్రబాబు చెయ్యలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్‌కి కృతజ్ఞతలు. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారు. 15 నెలల కాలంలోనే 35 వేల కోట్లు రూపాయలు బీసీలకు అందించారంటే అది ఒక్క జగన్ మాత్రమే అని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు పబ్లిసిటీ అవసరం లేదు: బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు పబ్లిసిటీ అవసరం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్‌లో సినిమా చూపించేవాడు. బీసీల పార్టీ అని చెప్పుకునే ఆయన ఎంతమందిని చైర్మన్లను చేశారని అడుగుతున్నాను. లోటు బడ్జెట్, కరోనా కష్టకాలంలో ఉన్నా కూడా చెప్పిన పథకాలన్ని నెరవేరుస్తున్నారు.. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. వెనుకబడిన తరగతులగానే జీవించాలా: చెవిరెడ్డి 139 బీసీ కులాలలు ఇంకా ఎంత కాలం ఈ మాట వినాలి. సామాజిక కట్టుబాట్లతో ఇంకా ఎంతకాలం వెనుకబడిన తరగతులగానే జీవించాలి. ఇది కరెక్ట్ కాదుని సీఎం వైఎస్ జగన అనుకున్నాడు. అందుకే బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్థిక స్వావలంబన కలిగినప్పుడే బీసీ కలాలు అభివృద్ధి చెందుతాయని ఆలోచించాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చెయ్యనంత ఆర్థిక సహాయం వైఎస్ జగన్ చేశారు. గతంలో బీసీ అంటే రాజకీయ అవసరాలకు వాడుకోనేవారు. కానీ నేడు బీసీలంటే వెన్నుముకగా బావించిన సీఎం వారికి పెద్దపీట వేశారు. అందులో భాగంగానే రాష్ట్ర పాలనలో అవకాశం ఇచ్చారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. -
బడుగు వర్గాలకు బాబు ద్రోహం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటిల రాజకీయ చాణక్యానికి కాలం చెల్లింది. ఆయన వేసే ఎత్తుగడలు, కుతంత్రాలు, చేసే మాయామర్మాలు సామాన్య ప్రజలకు సైతం అర్ధమైపోతున్నాయి. అయినా అయన ఇంకా వాటినే నమ్ముకున్నారు, అమలుచేస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణం బయటపడి అందులో... చంద్రబాబు క్యాబినేట్లో మంత్రులుగా పని చేసిన అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణల ప్రమేయం ఉందని వెల్లడి కాగానే... ఉలిక్కిపడిన చంద్రబాబు ‘వారు బీసీలు కనుకనే ఆరోపణలు చేస్తున్నారు. బీసీలంటే సీఎం జగన్మోహన్రెడ్డికి పడదు’ అంటూ పాత పల్లవినే కొత్త రాగంలో అందుకున్నారు. ఐదేళ్ల తన పాలనలో బీసీ, ఎస్సీ, మైనారిటీలతో సహా అనేక వర్గాలను దూరం పెట్టి, వారిని దూరం చేసుకొన్నది స్వయంగా చంద్రబాబే! దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవడానికి తాపత్రయపడుతున్న చంద్రబాబు... సీఎం వైఎస్ జగన్‌పైన, రాష్ట్ర ప్రభుత్వపైన పసలేని ఆరోపణలతో బురద జల్లడానికి యధాశక్తి ప్రయత్నిస్తున్నారు. ఏ నాయకుడికి లేనివిధంగా ప్రతి చిన్న అంశాన్ని కులం కోణంలో చూడటం చంద్రబాబుకు అలవాటు. చట్టానికి కులం, మతం, ప్రాంతం ఉంటాయా? తప్పు చేసిన వారిని కులం దృష్టితో చూసి వదిలి వేసే విధానం భారతీయ శిక్షాస్మృతిలో గానీ, రాజ్యాంగంలో గానీ ఉన్నదా? ఈ విషయాలు చంద్రబాబుకు తెలియక కాదు. బడుగు బలహీన వర్గాలను తన రాజకీయ ఆయుధాలుగా, తన రక్షణ కవచాలుగా ఉపయోగించుకోవడానికి అలవాటు పడ్డ చంద్రబాబు ఈఎస్ఐ కుంభకోణంలో తన సహచర నాయకుల ప్రమేయం ఉన్నదని తెలియగానే వారి కులాన్ని తన రాజకీయ ప్రయోజనానికి వాడుకోవడానికి సిద్ధపడ్డారు. బాబు ‘బీసీ’ థియరీ బలహీనవర్గాలను రాజకీయంగా ఉపయోగించుకోవాలి కానీ వారు రాజకీయంగా సాధికారత సాధించరాదన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది. తాజా ఉదంతాన్ని పరిశీలిస్తే... స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08 శాతం ఎస్టీలకు 6.77 శాతం మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీర్మానం చేసి ఆ మేరకు జీవో జారీ చేసింది. హైకోర్టు దీనిపై అభ్యంతరం తెలపలేదు. కానీ... తెలుగుదేశం పార్టీ నేత అయిన బి. ప్రతాపరెడ్డి అనే వ్యక్తి దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో... తొలుత ‘స్టే’ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర హైకోర్టులో నిర్ణయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. చివరకు హైకోర్టు అన్ని రకాల రిజర్వేషన్లు 50 శాతం మించరాదని రూలింగ్ ఇవ్వడంతో బీసీలకు వర్తింపజేయాలనుకున్న కోటాలో 9.85 శాతం కోత పడి బీసీలకు వేలాది సంఖ్యలో పదవులు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. బీసీలకు మరోమారు అన్యాయం చేయడానికి టీడీపీ పాల్పడిన అనైతిక చర్య బయటపడగానే తమకు అలవాటైన రీతిలో ‘దొంగే దొంగ దొంగ...’ అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే పనిగట్టుకొని బీసీ రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం చేసిందంటూ పచ్చ మీడియాతో బురద జల్లిస్తున్నారు. బీసీలంటే బాబుకు చులకన బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప... బీసీలను అన్ని రంగాలలో ప్రోత్సహించి, గౌరవించి వారికి సాధికారత కల్పించాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడు లేదు. ఈఎస్ఐ కుంభకోణంలో చిక్కుకొన్న తన పార్టీనేతలు బీసీలు కనుకనే... వారిని ఇరికించారని మాట్లాడిన చంద్రబాబు ఒకసారి గతంలోకి తొంగి చూడాల్సిన అవసరం ఉంది. 2000వ సంవత్సరంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న కృష్ణాయాదవ్ ‘తెల్గీ స్టాంప్‌ల’ కుంభకోణంలో చిక్కుకొన్నాడని తెలియగానే... క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. సీఎంగా ఉన్న చంద్రబాబు అతనిని మంత్రి పదవి నుంచి తప్పించాడు. పైగా, ఎంతో సాహాసోపేతంగా వెంటనే చర్య తీసుకున్నట్లుగా పత్రికల్లో రాయించుకున్నారు. కృష్ణాయాదవ్ బీసీ నేత అయినా తప్పుచేశారు కనుక ఉపేక్షించలేదు. ఆ ధర్మం ఇప్పుడు వర్తించదా? వందలాది కోట్ల విలువైన స్కామ్ జరిగితే.. కులాన్ని చూసి నిందితులను వదిలిపెట్టాలా? తన ప్రభుత్వంలో ఒక ధర్మం... వేరొకరి ప్రభుత్వంలో మరో ధర్మం ఉంటుందా? కులం కార్డును బాబు తనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకుంటాడో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలో డా‘‘ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో తెలుగుదేశం ఓటమి పాలయిన తర్వాత... బీసీ కులాలను దగ్గర చేసుకోవడానికి ప్రతిపక్షనేతగా చంద్రబాబు 2007లో వరంగల్‌లో ‘బీసీ గర్జన’ పేరిట భారీ సభ నిర్వహించారు. ప్రధాన బీసీ వర్గాల వారి సమక్షంలో జరిగిన ఆ సభలో బీసీలకు తెలుగుదేశం పార్టీ 33 శాతం మేర.. అంటే 100 పార్టీ టిక్కెట్లు కేటాయిస్తుందంటూ ఓ డిక్లరేషన్ రూపొందించి అందరి హర్షధ్వానాల మధ్య దానిని ఆమోదించారు’. రెండేళ్ల తర్వాత, అంటే... 2009 ఎన్నికలలో చంద్రబాబు అర కొరగా బీసీలకు సీట్లు ఇచ్చి యధావిధిగా బీసీలను మోసం చేశారు. బీసీలు ఆర్థికంగా బలహీనులు కనుక వారికి 33 శాతం టిక్కెట్లు ఇచ్చినా గెలవలేరంటూ సాకు చూపి మరీ మోసం చేశారు. 1999లో ఆనాడు కేంద్రంలోని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీని చేరమని బీజేపీ కోరింది. అయితే ఎంపీలుగా ఉన్న కె. ఎర్రన్నాయుడు, అల్లాడి రాజ్‌కుమార్ మొదలైన బీసీ నాయకులు కేంద్ర మంత్రులయితే... తన ఇమేజ్ తగ్గిపోతుందనే ఏకైక కారణంతో 29 మంది లోక్‌సభ సభ్యుల బలం ఉన్నప్పటికి ఎన్డీయే ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి సపోర్టు చేస్తాం అనే పేరుతో సరిపెట్టారు. కాగా, 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరడానికి సిద్ధపడి, సీనియర్, సమర్ధుడు అయిన బీసీ నేత కొనకళ్ల నారాయణను పక్కన పెట్టి... ఒకటి అశోకగజపతి రాజుకు, రెండోది జూనియర్ అయిన సుజనా చౌదరికి కట్టబెట్టి... బీసీలకు చంద్రబాబు మరోసారి అన్యాయం చేశారు. బీసీల పట్ల బాబు వ్యతిరేక వైఖరి 2014 ఎన్నికలలో నరేంద్రమోదీ, పవన్‌కళ్యాణ్‌ల బలంతో స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో అధికార పీఠం ఎక్కిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అడుగడునా బలహీనవర్గాల వ్యతిరేక వైఖరిని నిసిగ్గుగా బహిర్గతపర్చారు. న్యాయమూర్తులుగా పని చేయడానికి బీసీ వర్గాల అభ్యర్థులు పనికిరారంటూ బాబు రాసిన లేఖ బహిర్గతమైనప్పుడు... ఆయన అసలు స్వరూపం ఏమిటో ప్రజలకు అవగతమైంది. అదే విధంగా, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సచివాలయానికి వచ్చిన బలహీనవర్గాల ప్రతినిధులను సీఎం హోదాలో చంద్రబాబు బెదిరించిన వైనాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. పార్టీలో సీనియర్ నేతగా, నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకొన్న దళితనేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని అడుగుతున్నానంటూ ప్రచారం చేసి... చివరకు చంద్రబాబు ఆయనకు అన్యాయం చేశారు. రాజ్యసభ సీటును ఎగ్గొట్టడానికి ఆయనకు గవర్నర్ పదవి ఆశ చూపి... చివరకు ఏదీ లేకుండా ఆయనంతట ఆయనే పార్టీ నుంచి నిష్క్రమించే పరిస్థితుల్ని చంద్రబాబు కల్పిం చారు. దళితులంటే చంద్రబాబుకు ఏ పాటి గౌరవమో చెప్పడానికి ఈ ఉదంతం చాలదా? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వున్న మరో దళిత నాయకుడు జె.ఆర్. పుష్పరాజ్‌ను బయట కుర్చోబెట్టి... చంద్రబాబు తన చాంబర్ లోపల ఓ పారిశ్రామికవేత్తతో బేరం కుదుర్చుకొని ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారంటూ... ఆ పార్టీ నేతలే ఇప్పటికీ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటారు. వైఎస్సార్సీపీ మీద గట్టిగా విమర్శలు చేయించడానికి ఉపయోగించుకొన్న పార్టీ దళితనేతల్లో ఒకరైన వర్ల రామయ్యకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నామని ప్రకటించి, తీరా.. ఆయన తన ఇంటినుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకునే సమయానికి జాబితాలో ఆయన పేరును తప్పించి సొంత సామాజికవర్గానికి చెందిన కనకమేడల రవీంద్రకుమార్‌కు రాజ్యసభ పదవి ఇవ్వటం పట్ల తెలుగు సమాజం ఆనాడు నిర్ఘాంతపోయింది. అమరావతి కాంతుల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూముల్లో 5 శాతం మొత్తాన్ని బడుగు బలహీన వర్గాలకు కేటాయిస్తామంటూ చట్టం తెచ్చిన చంద్రబాబు ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు దానిని అమలు చేయలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పేదలకు, బలహీనవర్గాలకు న్యాయం చేయడానికి ఆ ప్రాంతంలోని 1250 ఎకరాలను 54 వేల కుటుంబాల వారికి పంచి పెట్టడానికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టగానే... చంద్రబాబు దానిని అడ్డుకోవడానికి కొందరితో న్యాయస్థానంలో కేసులు వేయిస్తున్నారు. చంద్రబాబుకు బలహీన వర్గాల మీద అభిమానం వుంటే పట్టాలిచ్చే కార్యక్రమాన్ని అడ్డుకొంటారా? దేహంలో అంతర్భాగమే దివగంత నేత మాజీ ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖరరెడ్డి బడుగు బలహీన వర్గాల వారిని సమాజమనే దేహంలో అంతర్భాగంగానే పరిగణించారు. వారి సాధికారతకు ఫీజుల రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేశారు. పలు వెనుకబడిన కులాలను బీసీ జాబాతాలో చేర్పించి... వారికి న్యాయం చేశారు. వైఎస్సార్ ఏనాడూ కుల, మత రాజకీయాలు చేయలేదు. ఆయన చూపిన బాట లోనే ఆయన వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ బడుగు బలహీనవవర్గాలకు క్యాబినెట్ కూర్పు మొదలుకొని అన్నింటా సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది చూసి ఓర్వలేని చంద్రబాబు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కులం రంగు పులమాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. జరగబోయే మున్సిపల్, పంచాయితీ ఎన్నికలలో లబ్ధి పొందడానికి చంద్రబాబు తనకు తెలిసిన పాత విద్యలనే మళ్లీ ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు అవినీతి, ఆశ్రిత పక్షపాతంపట్ల ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పు మరోసారి పునరావృతం కావాలి. ప్రజలు విజ్ఞులు. ఆ విజ్ఞత మరోసారి చాటాలి. చంద్రబాబు బడుగు బలహీన వర్గాల వ్యతిరేక వైఖరికి శాశ్వత సమాధి కట్టాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
సీఎం జగన్ నిర్ణయం..పేద విద్యార్థులకు వరం
సాక్షి, అనంతపురం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువులకు బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అనంతపురం ఎన్జీవో హోం లో రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆంగ్ల మాద్యమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని బీసీ సంఘం ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నేతలు స్వాగతించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వైఎస్ జగన్ నిర్ణయం ఓ వరమని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో పేద విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీషు మీడియం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ విమర్శలు అర్థరహితమన్నారు. ప్రకాశం: ఆంగ్ల మాద్యమం ఆవశ్యకత పై ఒంగోలు లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదర్ క్లబ్లో జరిగిన సమావేశంలో దళిత బహుజన మేధావులు ఈ చర్చలో పాల్గొన్నారు. ‘బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీష్ మీద పట్టు సాధించారు..కాబట్టే ప్రపంచ మేధావి అయ్యారని’ వక్తలు తెలిపారు. తిరుపతి: ఇంగ్లీష్ మాద్యమం కు మద్దతుగా తిరుపతిలో అంబేద్కర్ మిషన్ ఇండియా నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇంగ్లీష్ భాష ధనికులకే కాదు.. పేదలకు కూడా అవసరమన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టారని ప్రతినిధులు తెలిపారు. సీఎం నిర్ణయానికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామన్నారు. -
బీసీలు ఏకమైతేనే రాజ్యాధికారం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని కులాలు ఐక్యంగా ఉంటేనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమని బీసీ కుల సంఘాల సమాఖ్య అభిప్రాయపడింది. ఈ నెల 12న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బీసీ సంఘాలు, మేధావులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్లో సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ప్రతినిధులు అనిల్‌కుమార్‌యాదవ్, ఎర్ర సత్య నారాయణ, నరేందర్‌గౌడ్ పాల్గొన్నారు. బీసీ సంఘాలన్నీ ఏకతాటిపై నడవాలని ప్రతినిధులు తీర్మానించారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా కామన్ ఎజెండాతో ముందుకెళ్లాలని నేతలు తీర్మానించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీలకు రావాల్సిన వాటా కన్నా తక్కువగా లభిస్తోందని, దీంతో బీసీలు మరింత వెనుకబాటుకు గురవుతున్నారన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని, ఈ దిశగా కార్యాచరణ తయారు చేయనున్నామని ప్రకటించారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలని, ఇందుకు రాజకీయ కోణంలోనే చర్యలు తీసుకోవాలన్నారు. -
బీసీ రిజర్వేషన్‌పై స్పందించిన మంత్రి పితాని
సాక్షి, అమరావతి : కాపుల రిజర్వేషన్ అంశంపై ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. వెనుకబడిన వర్గాలకు నష్టం కలిగించే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఎన్నికల హామీని నెరవేర్చే క్రమంలోనే కాపులకు రిజర్వేషన్ కల్పించారని, బీసీల మనోభావాలు, ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో వ్యక్తిగతంగా చర్చిస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం పితాని సత్యనారాయణ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పితాని మంగళవారం మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వెనుకబడిన వర్గాల్లో నెలకొన్న ఆందోళన నెలకొందని, తాను అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే బీసీ సంఘ ప్రతినిధులతో కూడా చర్చించేందుకు చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు. కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయమై ప్రభుత్వం ముందుగాని, నిర్ణయం వెల్లడించిన తరువాత గానీ వెనుకబడిన వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు చేసి ఉంటే ఇంత గందరగోళం ఉండేదికాదని బీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని, ఈ విషయంలో తాను కూడా వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు మంత్రి పితాని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బీసీలకు నష్టం కలిగే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించరని, తమకు కూడా బీసీల ప్రయోజనమే ముఖ్యమని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ అంశంపై వెనుకబడిన వర్గాలు సంయమనంతో వ్యవహరించాలని, సమస్య జఠిలం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు. అలాగే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం హర్షణీయమని, దీనివల్ల వారి స్థితిగతులు మారతాయన్నారు. -
చదువుల విప్లవం తీసుకువస్తా: జగన్
సాక్షి, కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ వైఎస్ఆర్ సువర్ణయుగం తీసుకు వస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. పిల్లలు చదువుకుంటేనే జీవితాలు మారుతాయని, పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తానని, వైఎస్ఆర్ను గుర్తు తెచ్చేలా చదువుల విప్లవం తీసుకు వస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంటే కాకుండా స్కాలర్ షిప్‌లు కూడా రావడం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక... ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఉన్నా తమ ప్రభుత్వం చదివిస్తుందన్నారు. అంతేకాకుండా మెస్ బోర్డింగ్ ఫీజులు కూడా చెల్లిస్తామని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన ఆదివారం కోడుమూరు నియోజకవర్గం గోరంట్లలో బీసీ సంఘం ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘బీసీల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. కురువలను బీసీల నుంచి ఎస్టీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాల్మీకులు, బోయలను కూడా ఎస్టీలో చేరుస్తామని, రజకులను ఎస్సీలుగా గుర్తిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయన ఇప్పటివరకూ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేయడం ధర్మమేనా?. ఎన్నికల ముందు కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పారు. చంద్రబాబు సీఎం కాకముందు రేషన్ షాపుల్లో 9 రకాల వస్తువులు ఉండేవి. ఇప్పుడు రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు అయినా చంద్రబాబు కట్టించారా?. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. జాబులేదు, నిరుద్యోగ భృతి లేదు. బీసీల మీద నిజమైన ప్రేమ ఉన్న నాయకుడు వైఎస్ఆర్. వైఎస్ఆర్ హయాంలో బీసీల పిల్లలు ఉన్నత చదవులు చదువుకున్నారు. ఎన్నికలొస్తే బీసీలంటే చంద్రబాబు వల్లమాలిన ప్రేమ చూపిస్తారు. ఎన్నికల ముందు ఓ మాట, అయ్యాక మరో మాట మాట్లాడటం ఆయనకు అలవాటే. చంద్రబాబు లాంటి వారి వల్ల రాజకీయ వ్యవస్థ విశ్వసనీయత కోల్పోయింది. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. పాదయాత్రలో నా దృష్టికొచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తా. రెండే రెండు పేజీల మేనిఫెస్టో తీసుకువస్తా. అందులోని ప్రతి అక్షరాన్ని తుచ తప్పకుండా అమలు చేస్తా.’ అని హామీ ఇచ్చారు. -
బీసీల్లో కులానికో పథకం
-
బీసీల్లో కులానికో పథకం
► వెనుకబడిన తరగతుల్లో అన్ని కుటుంబాలకు సాయం అందించడమే లక్ష్యం ► స్కీంలు, కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ► వచ్చే నెల నుంచే అమలు చేయాలని స్పష్టీకరణ ► బ్యాంకులతో లింకు లేకుండానే లోన్లు ► రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం ► ఏటా 60 వేల నుంచి 70 వేల కుటుంబాలకు లబ్ధి ► 25 వేల సెలూన్లకు తోడ్పాటు ► బీసీ కులాల అభ్యున్నతిపై ముఖ్యమంత్రి సమీక్ష సాక్షి, హైదరాబాద్: బీసీ కులాల్లోని అన్ని కుటుంబాలకు వ్యక్తిగతంగా సాయం అందించే కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కులాల వారీగా ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలను రూపొందించి వచ్చే నెల నుంచే అమలు చేయాలని స్పష్టం చేశారు. సమాజంలో సగభాగం ఉన్న బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి జరగాలన్నారు. ‘‘బీసీలలో ప్రతీ కులానికి ఓ ప్రత్యేక పని, ప్రత్యేక జీవనం ఉన్నాయి. దానికి అనుగుణంగానే కార్యక్రమాల రూపకల్పనలో కూడా వైవిధ్యం ఉండాలి’’అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. బీసీ కులాల అభ్యున్నతికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రభుత్వాలు పేరుకు కొన్ని పథకాలు ప్రవేశపెట్టాయని, అవేవీ బీసీల జీవితాల్లో మార్పు తేలేకపోయాయని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలు వాస్తవాల ఆధారంగా ఉండాలని, బీసీల జీవితంలో నిజమైన మార్పు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల కోసం బ్యాంకులతో లింకు లేకుండానే ఒక్కొక్కరికి లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని సూచించారు. వివిధ వృత్తి కులాల ప్రతినిధులతో త్వరలో స్వయంగా తాను కూడా సమావేశాలు నిర్వహించి, ఆయా వర్గాల అభ్యున్నతికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టతకు రానున్నట్లు వెల్లడించారు. మభ్యపెట్టే పథకాలొద్దు.. ఓటు బ్యాంకు రాజకీయం కాకుండా.. మభ్య పెట్టే పథకాలు లేకుండా.. వెనుకబడిన తరగతుల కులాల వారి జీవితాల్లో నిజమైన వెలుగు కోసం ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ‘‘దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో కొన్ని బీసీ కులాల అభ్యున్నతికి పథకాలు అమలవుతున్నాయి. ఇదేవిధంగా అన్ని బీసీ కులాల వారికి వారి కుల వృత్తుల ప్రాతిపదికన చేయూత అందించే కార్యక్రమాలు చేపట్టాలి. కుల వృత్తులు లేని వారికి, కుల వృత్తులు మానేసి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్న వారికి తగిన ప్రోత్సాహం అందించాలి. అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయించాం. వీటితో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి’’అని సూచించారు. వారు సమాజం కోసం పని చేస్తున్నారు ‘‘బీసీ కులాలు ప్రధానంగా వృత్తిపరమైనవి. వారు చేసే పని మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. వారు లేకుంటే సమాజం ఈ పరిస్థితిలో ఉండదు. రజకులు బట్టలు ఉతకకపోతే పరిశుభ్రంగా ఉండడం సాధ్యం కాదు. నాయీ బ్రాహ్మణులు క్షవరం చేయకుంటే మనుషులు గుడ్డేలుగుల్లా ఉంటారు. మేదరులు అల్లిన వస్తువులు ప్రతీ ఇంట్లో వాడతారు. మేరలు కుట్టిన బట్టలు తొడుక్కుంటాం. కంసాలి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి.. ఇలా ప్రతీ కుల వృత్తిదారులు సమాజం కోసమే పనిచేస్తున్నారు. ఆయా పనులు చేయడం వల్ల వారు ఉపాధి పొందుతుండవచ్చు. కానీ వారి కృషి వల్ల మానవ సమాజం ఉన్నతంగా బతుకుతున్నది. కాబట్టి యావత్ సమాజం కులవృత్తుల వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది’’అని సీఎం పేర్కొన్నారు. ‘‘గొల్ల, కుర్మల కోసం రూ.4 వేల కోట్ల వ్యయంతో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అది దిగ్విజయంగా అమలవుతోంది. రూ.వెయ్యి కోట్లతో చేపల పెంపకం కార్యక్రమం చేపట్టి మత్స్యకారులకు అండగా ఉంటున్నాం. రూ.1,200 కోట్ల వ్యయంతో నేత కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. రజకులు, నాయీ బ్రాహ్మణులు, కుమ్మరులు, పంచకర్మల కోసం ప్రత్యేకంగా పథకాలు రూపొందించాం. సంచార జాతులు, ఇతర వెనుకబడిన కులాల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్పొరేషన్ ద్వారా అత్యంత వెనుకబడిన కులాల్లోని కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు కార్యక్రమాల రూపకల్పన జరగాలి. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రతీ ఏటా 60 నుంచి 70 వేల కుటుంబాలను ఆదుకోవాలి’’అని సూచించారు. ఎంబీలకు ఏటా రూ.వెయ్యి కోట్లు ‘‘విశ్వ బ్రాహ్మణుల్లో ప్రధానంగా పంచకర్మలున్నాయి. వారంతా కుల వృత్తులను ఆధారం చేసుకుని బతుకుతున్నారు. వారికి అవసరమైన పనిముట్లు, ఆర్థిక సహకారం అందించాలి’’అని సీఎం పేర్కొన్నారు. ‘‘గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లోని రజకులకు వారి వారి అవసరాలను, పని విధానాన్ని బట్టి కార్యక్రమాలు రూపొందించాలి. దోబీ ఘాట్ల నిర్మాణం, డయింగ్ మిషన్ల పంపిణీ, ఇంకా అవసరమైన పెట్టుబడి తదితరాలు సమకూర్చాలి. నాయీ బ్రాహ్మణులకు నవీన క్షౌ రశాలలు ఏర్పాటు చేయాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నాయీ బ్రాహ్మణుల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. దానికి తగినట్లు ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పన జరగాలి. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల సెలూన్లకు అవసరమైన సాయం అందించాలి. అనేక సంచార జాతులు, అత్యంత వెనుకబడిన కులాలున్నాయి. అందులో కొందరు ఇంకా సంప్రదాయ కులవృత్తులు చేసుకుంటున్నారు. కొన్ని కులాలు అంతరించాయి. వారు ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహకారం అందించాలి. ప్రతీ ఏటా బడ్జెట్లో ఇందుకోసం నిధులు కేటాయించుకుంటాం. ఈ ఏడాది వెయ్యి కోట్లు పెట్టుకున్నాం. వచ్చే ఏడాది ఇంకా పెంచుతాం’’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు జోగు రామన్న, టి.హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి అశోక్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వి.లక్ష్మికాంతరావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాపులు, బీసీలు బాహాబాహీ
-
ఐక్యంగా ఉంటేనే బీసీలకు రాజ్యాధికారం
గౌడ ప్రజాప్రతినిధుల ప్లీనరీలో వక్తలు హైదరాబాద్: సర్దార్ సర్వారుు పాపన్నగౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా ముందుకుసాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ గౌడ ప్రజాప్రతినిధుల వేదిక ప్లీనరీ ఆదివారం ఇక్కడ భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణగౌడ్, గంగాధర్‌గౌడ్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కిగౌడ్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గౌడ కులస్తులు ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక గౌడ కులస్తులకు, బీసీలకు గతంలో కంటే ప్రాధాన్యం పెరిగిందన్నారు. బీసీ కులాలన్నింటినీ సమన్వయం చేస్తూ ఐక్యంగా ఉంటే అసెంబ్లీలో బీసీల స్థానాలు జనాభా ప్రతిపాదికన పెరుగుతాయని, ఓటే ఆయుధంగా పనిచేయాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అధిక శాతం బీసీలు ఉన్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇదేస్థారుులో లేకపోవడానికి బీసీల మధ్య ఐక్యత లేకపోవమేనని తెలిపారు. ఈ సందర్భంగా గౌడ ప్రముఖులను సత్కరిం చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేశిని చినమల్లయ్య, తూళ్ల వీరేందర్‌గౌడ్, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
'మెడికల్ రీకౌన్సిలింగ్ జరపాలి'
విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద బీసీ సంఘాలు బుధవారం ఆందోళనకు దిగాయి. యూనివర్సిటీ అధికారుల వైఖరితో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ బీసీ సంఘాలు ధర్నాకు దిగాయి. యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు యాజమాన్యాలకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నాయంటూ ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ రీకౌన్సిలింగ్ జరపాలని వారు డిమాండ్ చేశారు. -
బీసీ బిల్లు కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కల్పనకు కేంద్రంపై ఒత్తిడికి రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్షబృందాలను తీసుకెళ్లాలని వివిధ బీసీ సంఘాలు డిమాండ్‌చేశాయి. ఈ దిశలో రెండు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే బీసీల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించాయి. బీసీ బిల్లుపై ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయపార్టీలకు అతీతంగా ఈ నెల 30న ఏపీ, తెలంగాణల్లోని 23 జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చాయి. బీసీలను రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తే అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని హెచ్చరించాయి. ఆదివారం బీసీ భవన్లో బీసీసంక్షేమసంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఏపీ,తెలంగాణలలోని వివిధ బీసీసంఘాల సమావేశం జరిగింది. రెండురాష్ట్రాల బీసీసంక్షేమసంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ (తెలంగాణ), కౌసన శంకరరావు (ఏపీ), బీసీ సంఘాల నాయకులు డా.ర్యాగ అరుణ్, నీల వెంకటేష్, కె.ఆల్మిన్‌రాజు, పద్మజ యాదవ్, పోతన మహేశ్, వరప్రసాద్ యాదవ్, రాచకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో బీసీసంక్షేమసంఘం నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ,టీడీపీ,టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రకటించాయని, రెండేళ్లు గడుస్తున్నా బీసీ బిల్లుపై ఏ పార్టీ పార్లమెంట్లో లేదా తమ సమావేశాల్లో పెదవి విప్పడం లేదని విమర్శించారు.బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం తాము గత పాతికేళ్లుగా పోరాడుతుంటే తూ.తు మంత్రంగా రెండు ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేశాయే తప్ప వాటి అమలుకు చిత్తశుద్ధి కృషి చేయలేదని విమర్శించారు. ఇప్పటికి 72 సార్లు ఢిల్లీకి వెళ్లిన ఇద్దరు సీఎంలు, ఒక్కసారి కూడా ఈ అంశంపై ప్రధానితో, కేంద్రంతో చర్చించకపోవడం బాధాకరమన్నారు. -
పాత జిత్తులు ఇక చెల్లవు
ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని కాపులు మరచిపోతారనో లేక వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు ప్రకటిస్తే మళ్లీ కాపులు తమకే ఓటు వేస్తారనో చంద్రబాబు వారి రిజర్వేషన్ల సంగతిని గత రెండేళ్లుగా పట్టించుకోలేదు. కాపులకు, బీసీ కులాలకు మధ్య ఘర్షణను రేకెత్తించడం వల్ల స్వల్పకాలికమైన కొంత లబ్ధి కలుగుతుందేమో. కానీ, దీర్ఘకాలంలో జనాభాలో 22% ఉన్న కాపులు గెలవలేకపోవచ్చు కానీ ఎవరినైనా ఓడించగలరు. కాబట్టి పాత జిత్తులు, వ్యూహాలు ఇక పారవని గుర్తించడం మంచిది. కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలంటూ ఇటీవల బద్ధలైన ఉద్యమ వెల్లువ కొత్తదేమీ కాదు. పలు దశాబ్దాలుగా అలాంటి ఉద్యమాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కాపులు వ్యవసాయంపై ఆధారపడినవారు. కుటుంబ విభజన క్రమంలో కాపు రైతుల కమతాలు చిన్నవైపోయి, పేదవారయ్యారు. కమ్మ, రెడ్డి, రాజు, వెలమ వంటి ఇతర వ్యవసాయ కులాల వారితో కూడిన నూతన కాంట్రాక్టర్లు, వ్యాపార వర్గాల పాలక వర్గంలో కాపులు భాగంగా లేరు. పైగా వారిలో కులపరమైన పొందిక లేదు. దీంతో వ్యాపారాలను లేదా వ్యాపార నైపుణ్యాలను పెంపొందింపజేసుకోడానికి తగినన్నినిధులు కూడా వారికి లేవు. పైగా రాజకీయాలంటేనే సంపదను, కాంట్రాక్టులను చేజిక్కించుకునే మహదావకాశంగా మారాయి. కాపులు మాత్రం రెండో శ్రేణివారుగానే లేదా పెద్ద నేతల అనుచరులుగానే మిగిలిపోయారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు కాపులు, కమ్మవారికి వ్యతిరేకంగా పనిచేస్తారని భావించారు. కానీ ఎన్టీఆర్ తెలివిగా యర్రం నారాయణ స్వామి వంటి కాపు నేతలు పలువురుని కాంగ్రెస్‌లోంచి తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రాంతీయ కులాలతో జాగ్రత్తగా వ్యవహరించలేక పోయింది. దీంతో కాపులు తమను ఏ పార్టీ పట్టించుకుంటే దానివైపే ఎన్నికల్లో మొగ్గు చూపుతూ వచ్చారు. చిరంజీవి పార్టీని ఏర్పాటు చేసినప్పుడు వారంతా ఆయన పార్టీ వెంటే నిలిచారు. 2014లో టీడీపీ జాగ్రత్తగా కాపు నేతలను ఆహ్వానించి వారికి కొన్ని టికెట్లు ఇచ్చింది. దీనికి తోడు అది బీజేపీ, మోదీలతో కలవడంతో కాపులలో అధిక సంఖ్యాకులు టీడీపీ-బీజేపీ కూటమి వైపు మొగ్గారు. పైగా చంద్రబాబు నాయుడు సైతం కాపులను బీసీలలో చేరుస్తామనే అంశాన్ని మొట్టమొదటిసారిగా టీడీపీ ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. గోదావరుల నుంచి ఉత్తరాంధ్ర వరకు అసంతృప్తి విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో కాపులు అతి పెద్ద కుల సామాజిక వర్గం (జనాభాలో 22% పైగా). అయినా నేటి ప్రభుత్వ అధికారం మాత్రం జనాభాలోని అతి చిన్న భాగం చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. అధికారం తిరిగి తమ చేజారిపోయిందని వారు భావించారు. మరోవంక ఇటు పశ్చిమ గోదావరి నుంచి అటు శ్రీకాకుళం వరకు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సైతం అసంతృప్తిని రేకెత్తించే పలు అంశాలు పేరుకుపోతూ వచ్చాయి. చాలా ఇతర కులాలలాగే కాపులు కూడా ఒకే ఒక్క కులం ప్రభుత్వాన్ని శాసిస్తోందని భావించడం వీటిలో ప్రధానమైనది. పేరుకు చంద్రబాబు కొందరు కాపులను మంత్రులను చేసినా, ఉప ముఖ్యమంత్రి పదవిని సైతం కట్టబెట్టినా వారిలో ఆ భావన చెదరలేదు. ఇకపోతే, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తుండగా ఇతర ప్రాంతాలకు ఏమీ దక్కకపోవడం మరింత ఆగ్రహాన్ని రేకెత్తించసాగింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూమి విలువ ఎకరా కోట్లలో పలుకుతుంటే మిగతా వారికి లభించింది ఏమీ లేదు. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాల కోసం గోదావరి జలాలను తరలించడం కోసం పట్టిసీమ ప్రాజెక్టుపై వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారో మిగతా ప్రజలు చూశారు. గోదావరి జిల్లాల అత్యంత విలువైన సహజ వనరైన నీటిని తరలించుకుపోతూ ఆ జిల్లాల కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు. ఒకవంక గుంటూరు జిల్లా రైతుల భూములకు కోట్లు లభిస్తుండగా, పైడిపాక, పోలవరం, అంగలూరు, దేవీపట్నం మండలాలలోని అత్యంత సారవంతమైన భూములకు సైతం ఎకరాకు లక్ష రూపాయలకు మించి లభించడం లేదు. కేంద్ర ప్రాజెక్టయిన పోలవరం నిర్వాసితులకు, నష్టపోయినవారికి 2013 భూసేకరణ చట్టం వర్తించకుండా అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాడటాన్ని ప్రజలు గమనించారు. పోలవరం రిజర్వాయరు వల్ల గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 5 లక్షల మంది ప్రజలు నష్టపోతున్నారు. ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని కాపులు మరచిపోతారనో లేక వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు ప్రకటిస్తే మళ్లీ కాపులు తమకే ఓటు వేస్తారనో చంద్రబాబు వారి రిజర్వేషన్ల సంగతిని గత రెండేళ్లుగా పట్టించుకోలేదు. ఇది ఆయన ఎదుర్కొనే మొదటి అడ్డంకి. ఆయన ప్రభుత్వం హడావుడిగా కాపులకు బీసీ హోదాను ఇవ్వడం తక్షణమే ప్రతిపాదనలు అందించాలంటూ ఒక కమిషన్‌ను నియమించింది. 2014 మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం జాట్లకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఆయనకు ఇచ్చిన తీర్పు మరో ప్రధాన సమస్యగా అడ్డు నిలుస్తుంది. ‘‘పాత ఫార్ములా ప్రకారం ఇక మరిన్ని కుల రిజర్వేషన్లు లేవు’’ అని ఆ తీర్పు స్పష్టం చేసింది. జాట్లతోపాటూ, ముస్లింలకు, మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన రిజర్వేషన్లను కూడా రద్దు చేసేసింది. 2015 మార్చి 17 నాటి ఆ తీర్పును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఏం చేస్తారు? కాంగ్రెస్ జాట్లకు రిజర్వేషన్లిచ్చాక, సుప్రీం కోర్టు వాటిని రద్దు చేసినట్టే కాపుల విషయంలోనూ జరిగాక ‘‘ఏం చేయమంటారు? సుప్రీం కోర్టు మీకు బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి అంగీకరించడం లేదు’’ అని అమాయకంగా అంటారా? కాపులకు అమరావతి ప్రాంత అభివృద్ధిలో ఎలాంటి ఆసక్తి లేదు. కాబట్టి ఉభయ గోదావరులు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కాపులు సహా ఇతర కులాలకు ఆగ్రహం కలగకుండా చూడటానికి ఆయన చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. 1. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న నేతలను కొందరు కాపు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీల చేత దూషింపజేసే పనిని వెంటనే కట్టిపెట్టాలి. 2. కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు (ఆధిపత్య కులాలకు చెందినవారు) గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఇతర నేతలందరినీ దూషిస్తున్నారు. ఏ విలువా లేని ఈ మంత్రుల తీరు ఫలితంగా కులాల మధ్య సంఘర్షణ రేగుతోంది. ఇతర కులాలను తిట్టిపోయడం కోసం వారిలా పర్యటనలు చేపట్టకుండా చేయాలి. 3. టీడీపీకి చెందిన కాపు, తదితర ఆధిపత్యేతర కులాల ఎమ్మెల్యేలు, ఎంపీలలో అత్యధికులు వ్యాపార వేత్తలే. అలాంటి వారైతేనే రాజకీయంగా వారి ప్రతిష్ట పెరగకుండా ఉంటుందని వారికి సీట్లిచ్చారు. టీడీపీ-బీజేపీ గాలి వల్ల, ధన బలం వల్ల్ల ఎలాంటి ప్రజాపునాది లేని అలాంటి వారు చాలా మందే గెలిచారు. వారు తమకు అందుబాటులో ఉండే బాపతు కాదని ప్రజలకు బాగా తెలుసు. సదరు ప్రజా ప్రతినిధులపై వారిలో అసంతృప్తి, ద్వేషం పెరగడం ఖాయం. 4. మూడు జిల్లాలకు, కాంట్రాక్టర్లకు మేలు చేస్తూ, తమ నీటిని దొంగిలించే ప్రాజెక్టులను చేపట్టింది వారి మంచి కోసమేననే వంచనాత్మక ప్రచారాన్ని కట్టిపెట్టడం మంచిది. ప్రజలు తెలివైనవారు. వారికంతా తెలుసు. ఈ ప్రచారం ద్వారా వారిని అవమానించినట్టవుతుంది. ఉత్తుత్తి మాటలు, పదవులు చాలిక ఇటీవల ఓ కాపు మంత్రి, ముద్రగడ పద్మనాభాన్ని, కాపుల ఆందోళనను నేరుగా విమర్శిస్తూ చంద్రబాబు ఒక కాపును ఉప ముఖ్యమంత్రిని చేశారని ఘనంగా చెప్పారు. ఎవరైనా ఉప ముఖ్యమంత్రి కావచ్చు. కానీ ఎవరైనా నాయకుడు కాలేరు. ముద్రగడ పద్మనాభం నాయకుడు. అందరూ ఉపముఖ్యమంత్రులు లేదా మంత్రులు, నాయకులు కారు. కాపుల జనాభా 3% మాత్రమే అయితే చంద్రబాబు ఒక కాపును ఉప ముఖ్యమంత్రిని చేసే వారా? ఏపీలో ఆధిపత్య కులాలు అల్ప సంఖ్యాకులు కావడం రాష్ట్ర విభజన పర్యవసానం. కాపులు, ఇతర బీసీ కులాల సంఖ్యాబలం పెరిగింది. కాపు లకు, బీసీ కులాలకు మధ్య ఘర్షణను రేకెత్తించడం వల్ల స్వల్పకాలికమైన కొంత లబ్ధి కలుగుతుందేమో. కానీ దీర్ఘకాలంలో జనాభాలో 22% ఉన్న కాపు లు గెలవలేకపోవచ్చు కానీ ఎవరినైనా ఓడించగలరు. ఉత్తరప్రదేశ్‌లో మాయా వతి, బ్రాహ్మణ మద్దతుతో (15%) అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల తర్వాత వారే ఆమెను ఓడించారు. అక్కడ బ్రాహ్మణుల మద్దతులేనిదే ఎవరూ ముఖ్య మంత్రి కాలేరు. అలాగే ఏపీలో ఒక కులానికి వ్యతిరేకంగా మరో కులాన్ని పోరాడేలా చేసే ఆ పాత ఆటలు ఇక సాగవు. కాబట్టి చంద్రబాబు సుప్రీం కోర్టు తీర్పును అధిగమించి కాపులకు రిజర్వేషన్లను కల్పించే మార్గాన్ని అన్వేషించడం కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల సలహాలను తీసుకోవాలి. జాట్లు సహా పలు సామాజిక వర్గాలను కొత్తగా బీసీలలో చేర్చ డాన్ని రద్దు చేసిన తీర్పే ‘‘రిజర్వేషన్లను కల్పించడానికి ప్రభుత్వం కొత్త బృం దాలను అన్వేషించాలి’’ అని కూడా చెప్పింది. అంటే ప్రభుత్వం భారీ సంఖ్య లో ఉన్న కాపు వ్యవసాయ కూలీలను, రిక్షాలు లాగేవారిని, విద్య, ఆస్తులు వగైరా లేనివారిని గుర్తించి రిజర్వేషన్ల కోసం సూచించాల్సి ఉంటుంది. కావు రిజర్వేషన్లపై బీజేపీ మౌనం ఆసక్తికరం. అదే మౌనాన్ని వారు కొనసాగిస్తే వారు 2004 నాటి తమ 2% ఓట్లకు తిరిగి రాక తప్పదు. 22%గా ఉన్న కాపులు ఏపీలో భారీ జనాభా. వారికి అమరావతి, సింగపూర్, స్విట్జర్లాండ్ లలో ఆసక్తి లేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల కోసం తమ జిల్లాలకు లేకుండా గోదావరి నీళ్లను తోడేసుకుంటున్నారనే భావనే వారిలో ద్వేషానికి కారణమవు తోంది. కాబట్టి పాత జిత్తులు, వ్యూహాలు ఇక పారవని గుర్తించడం మంచిది. - వ్యాసకర్త రాజకీయ విశ్లేకులు drpullarao@yahoo.co.in -
రాజ్యాధికారంతోనే సమస్యల పరిష్కారం
- ఓబీసీ కమిషన్ చైర్మన్ వంగాల ఈశ్వరయ్య తార్నాక: బీసీ వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించుకున్నప్పుడే సమస్యలు పరిష్కార మవుతాయని జాతీయ ఓబీసీ కమిషన్ చైర్మన్ వంగాల ఈశ్వరయ్య అన్నారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో ‘రిజర్వేషన్స్ ఫర్ డెమోక్రసీ, ఫైట్ ఎగెనెస్ట్ ఫార్వార్డ్(పటేల్) కాస్టిజమ్’పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈశ్వర య్య ముఖ్య వక్తగా మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలను మూడు గ్రూపులుగా విభజించాలని గతంలోనే తాము కేంద్రానికి విన్నవించామన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 27 శాతం రిజర్వేషన్ సక్రమంగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీల హక్కులు, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వారికి ఉన్న సౌకర్యాలపై కళాజాతల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి కాశీనాథ్, ఓబీసీ కులాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు దునుకు వేలాద్రి, బెల్లయ్య నాయక్, బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల రద్దుకు కుట్ర
* హార్దిక్ పటేల్ వెనక సంఘ్ పరివార్ హస్తం * రౌండ్ టేబుల్ చర్చలో బీసీ నేతల ఆందోళన సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అమలవుతున్న రిజర్వేషన్లను రద్దు చేయించేందుకు కుట్ర జరుగుతోందని బీసీ సంఘాలు భయాందోళన వ్యక్తం చేశాయి. గుజరాత్లో మానసిక పరిపక్వత లేని 22 ఏళ్ల హార్దిక్ పటేల్‌ను ముందుంచి తెర వెనక సంఘ్ పరివార్ శక్తులు కథ నడుపుతున్నాయని ఆరోపించాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం గుజరాత్లో పట్టీదార్లు చేస్తున్న ఆందోళన.. అసలు ఉద్యమమే కాదని, ఇది ఫక్తుగా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమమని అభిప్రాయపడ్డాయి. ‘గుజరాత్లో పటేళ్ల ఉద్యమం-సామాజిక పరిణామాలు’ అంశంపై బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకులు, మేధావులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు. పటేళ్లను ఓబీసీల్లో చేరిస్తే పరిస్థితులు రణరంగమవుతాయని బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణయ్య పేర్కొన్నారు. 80 శాతం మార్కులొచ్చినా పటేళ్లకు ఉద్యోగాలు రావడం లేదని, రిజర్వేషన్ల వల్ల 49 శాతం మార్కులొచ్చిన వారికీ ఉద్యోగాలొస్తున్నాయని హార్దిక్ పటేల్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. గుజరాత్ జనాభాలో 14 శాతమే ఉన్న పటేళ్ల వద్దే ఆ రాష్ట్ర సంపదలో 65 శాతం ఉందన్నారు. బీసీ కోటాను 50 శాతానికి పెంచాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జరుగుతున్న ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ఆరెస్సెస్ కుట్ర చేస్తోందని ప్రొఫెసర్లు పీఎల్ విశ్వేశ్వర రావు, గాలి వినోద్ కుమార్, సత్యనారాయణలు పేర్కొన్నారు. కార్యక్రమంలో వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాధికారం కోసం ఐక్య ఉద్యమం: ఆర్. కృష్ణయ్య
నల్లగొండ టౌన్: రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా బీసీ కులాలన్నీ ఐక్యం గా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన బీసీ సమరభేరి మహాసభలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలు బీసీలను జెండాలు మోసే కూలీలుగా చూస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీలకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకుంటే మనమే ఒక పార్టీని పెట్టుకొని, వచ్చే ఎన్నికల్లో బీసీలను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించుకోవాలని కోరారు. పార్లమెంట్లో బీసీ బిల్లును పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలకు బీసీలు కేవలం 12 మంది మాత్రమే ఉండడం దారుణమన్నారు. 107 కులాలు నేటికీ అసెంబ్లీ గేటును దాటకపోవడం శోచనీయన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ కృష్ణమోహన్, నీలం వెంకటేశ్ మాట్లాడారు. -
'ఈ నెల 8న బీసీ సామాజిక వర్గాల ప్లీనరీ'
హైదరాబాద్(తార్నాక): తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఈ నెల 8న బీసీల ప్లీనరీని నిర్వహించేందుకుగాను సన్నాహాలు చేస్తున్నామని ఆల్ ఇండియా ఓబీసీ కులాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు దునుకు వేలాద్రి తెలిపారు. ఈ మేరకు సోమవారం తార్నాకలోని ఐక్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వేలాద్రి మాట్లాడుతూ.. ఈ ప్లీనరీ సమావేశాలను హిమాయత్ నగర్‌లోని తెలుగు అకాడమీ సమీపంలో ఉన్న బీసీ సాధికారత సంస్థ కార్యాలయంలో ఒక రోజు సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో బీసీల సమస్యలు, వాటికి పరిష్కార మర్గాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. -
ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి
పదిరోజుల్లోగా స్పందించకపోతే ఉద్యమం ఉధృతం: కృష్ణయ్య హైదరాబాద్: రూ.850 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఈ పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయపార్టీలు, విద్యార్థి, యువజన, బీసీ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రాష్ట్ర బంద్, కళాశాలల బహిష్కరణ, తదితర రూపాల్లో ఆందోళన తీవ్రతర ం చేస్తామని హెచ్చరించాయి. ఫీజు బకాయిలు చె ల్లించాలని, ఈ ఏడాది దరఖాస్తులు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్కు వద్ద బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు మల్లు రవి, రమ్య, సీపీఐ నేత రాంనర్సింహారావు, సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఉదయం ఆర్.కృష్ణయ్యకు బీసీ హాస్టల్ విద్యార్థి వెంకటేష్ పూలమాల వేసి దీక్షను ప్రారంభించగా, సాయంత్రం పొన్నాల లక్ష్మయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆర్ .కృష్ణయ్య మాట్లాడుతూ వారం, పదిరోజుల్లో ఫీజు బకాయిలను పూర్తిగా చెల్లించకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా రావాలి: పొన్నాల రాజకీయాలకు అతీతంగా పేదల పక్షాన పోరాడేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రె డ్డి మాట్లాడుతూ ఫీజుల విషయంలో ఏ ముఖ్యమంత్రీ వ్యవహరించని విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎవరి దీక్షకైనా మద్దతిస్తాం: వైఎస్సార్సీపీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కోసం ఎవరు దీక్ష చేసినా పార్టీలకతీతంగా తమ పార్టీ మద్దతిస్తుందని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.ఫీజు బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నీరుగార్చేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినప్పుడు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్‌నిరాహార దీక్షలు చేశారని గుర్తుచేశారు. -
6న బీసీల శంఖారావం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి వెనుకబడిన తరగతుల ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను కల్పిం చాలని వివిధ బీసీ సంఘాలు, ఉద్యోగ బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. దీని కోసం సమరానికి సిద్ధం కావాలని సంఘాలు పిలుపునిచ్చాయి. భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ నెల 6న (శనివారం) హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బీసీ ఉద్యోగుల శంఖారావం నిర్వహించనున్నాయి. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, వెంకన్నగౌడ్ (తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సం ఘం), గుజ్జకృష్ణ (బీసీ సంక్షేమసంఘం), కె.నర్సింహగౌడ్ (తెలంగాణ బీసీ సంక్షేమసంఘం), శారద (బీసీ మహిళ సంఘం), విక్రమ్‌గౌడ్ (బీసీ విద్యార్థిసంఘం) శంఖారావం పోస్టర్‌ను విడుదల చేశారు. -
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు
* బీసీ సంఘాల డిమాండ్ * నవంబర్ 2 న బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ * రెండు రాష్ట్రాలు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి * పార్లమెంట్లో బిల్లుపెట్టాలన్న జాతీయ నేత ఆర్. కృష్ణయ్య * 54 లక్షల మంది ఉద్యోగుల్లో బీసీలు మూడు లక్షలేనా ? సాక్షి, హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని 12 బీసీ సంఘాలు, 22 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బీసీ ఉద్యోగుల సంఘాలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌చేశాయి. రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా దేశంలోని బీసీ ఉద్యోగులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరాయి. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈ సంఘాల తరఫున బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చేనెల 24 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్రమోదీని ఆయన డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగుల భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నవంబర్ 2న హైదరాబాద్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ఉద్యోగుల రాష్ట్ర మహాసభను నిర్వహిస్తున్నట్టు కృష్ణయ్య చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం 54 లక్షల మందిదాకా ఉండగా, 3.62 లక్షల మంది మాత్రమే, అంటే 8 శాతమే బీసీ ఉద్యోగులు ఉండడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. నాచియప్పన్ కమిటీ సిఫారసులేవి ? జనాభాలో 56 శాతమున్న బీసీలకు 8 శాతం ఉద్యోగాలే దక్కాయని, పదోన్నతులలో రిజర్వేషన్లు లేక బీసీ ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన అన్నిరంగాల్లో తగిన వాటా కల్పించాలని ఆయన డిమాండ్‌చేశారు. 2004 డిసెంబర్లో నాచియప్పన్ చైర్మన్‌గా ఏర్పడిన బీసీ పార్లమెంటరీకమిటీ చేసిన సిఫారసులు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు జాతీయస్థాయిలో బీసీ ఉద్యోగులంతా ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో 74 మంత్రిత్వశాఖలున్నా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేకపోవడం శోచనీయమన్నారు. 18 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు 950 కోట్లా ? దేశబడ్జెట్ను రూ.18 లక్షల కోట్లకు ప్రతిపాదిస్తూ, దానిలో బీసీల సంక్షేమానికి రూ.950 కోట్లు మాత్రమే కేటాయిస్తే అవి ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. బీసీ బిల్లును ప్రవేశపెట్టాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీలలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించారని, అయితే వాటిని ప్రధాని నరేంద్రమోదీకి అందజేసేందుకు అఖిలపక్ష బృందాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర సాధన కోసం బీసీ ఉద్యోగులు సకలజనుల సమ్మె చేసినట్టుగా ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం అదే స్ఫూర్తితో పోరాడాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ సమావేశంలో వివిధ బీసీ, ఉద్యోగ సంఘాల నాయకులు గుజ్జ కృష్ణ, దుర్గయ్యగౌడ్, రాజేందర్, శారద, నగేశ్‌గౌడ్, బత్తిన రాజు , ముత్యం వెంకన్నగౌడ్, ఎస్. వెంకట నారాయణ, హెచ్.వెంకటస్వామి, జి. ఆనంద్, జి.మల్లేష్, సి.రామమూర్తి, హరనాథ్, హరికృష్ణ, ఆంజనేయులు,అజయ్‌కుమార్, జి.అచ్యుతరావు, కులిశెట్టి, శ్రీధర్, లక్ష్మీనారాయణ, పాండు, రమేశ్, రామారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఫెడరేషన్లు లేని బీసీ కులాలకు సొసైటీలు నియమించాలి
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం డిమాండ్ పార్టీ బీసీ విభాగం ఏపీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్లు లేని బీసీ కులాలకు సొసైటీలను ఏర్పాటు చేసి వెనుకబడిన తరగతులకు రుణ సదుపాయం కల్పించాలని వైఎస్సార్సీపీ బీసీ ఆంధ్రప్రదేశ్ విభాగం డిమాండ్ చేసింది. పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన సోమవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. మరో ఐదు తీర్మానాలను కూడా సమావేశం ఆమోదించింది. అనంతరం కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో బీసీల్లోని వివిధ కులాల కోసం 9 ఫెడరేషన్లు ఏర్పాటు చేశారని, వెనకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఫెడరేషన్లు లేని ఇతర బీసీ కులాలకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాలని తాము కోరుతున్నామన్నారు. ఇప్పటికే ఉన్న బీసీ ఫెడరేషన్లకు తగినన్ని నిధులు మంజూరు చేయాలని అన్నారు. బీసీ వృత్తిదారుల రుణాలన్నింటినీ రద్దు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లతోపాటు ప్రభుత్వోద్యోగాలు, ప్రమోషన్లలో బీసీ రిజర్వేషన్లను విధిగా అమలు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకానికి పరిమితులు విధించకుండా అమలు చేయాలని కోరుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు. పార్టీ పర్యవేక్షణ కమిటీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించిన గట్టు రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యూరు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ బీసీ విభాగం అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేశారు. జిల్లా నేతలు జి.రమాదేవి, అవ్వారు ముసలయ్య, దేవరకొండ శ్రీనివాసరావు, కె.గురవాచార్య, ఎం.రాజాయాదవ్, డాక్టర్ ఎ.మధుసూదన్, టి.పుల్లయ్య , ఎం.పురుషోత్తం, ఎం.ప్రభాకర్, బి.రాజశేఖర్, ఎం.హరి, కె.ఎన్.రాజా, కత్తి రాజకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లు కోసం దేశవ్యాప్త ఉద్యమం
హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించే బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమించాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా అక్టోబర్ 5వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీ బిల్లుకు మద్దతు కూడగట్టాలని తీర్మానించాయి. హైదరాబాద్‌లోని బీసీ భవన్లో ఆదివారం జరిగిన సమావేశంలో 26 బీసీ సంఘాలు, 12 రాష్ట్రాల బీసీ ప్రతినిధులు, 18 బీసీ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ బిల్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలో బీసీలకు 33 శాతం రాజకీయ రిజరేషన్లు కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాయని గుర్తు చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై దేశ వ్యాప్తంగా ఉద్యమించి చట్టసభల్లో రిజర్వేషన్లు సాధిస్తామని కృష్ణయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, రాజు, వెంకన్న గౌడ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాధికారంతోనే సాధికారత సాధ్యం
బీసీ ఆత్మీయ సదస్సులో పలువురు వక్తల ఉద్ఘాటన లబ్బీపేట : దేశ జనాభాలో 50 శాతంగా ఉన్న బీసీలు పాలితులుగానే మిగిలిపోతున్నారని, రాజ్యాధికార సాధన దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. పలు బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం బృందావన కాలనీలోని ఎ కన్వెన్షన్ హాల్లో బీసీ ఆత్మీయ సభ నిర్వహించారు. తొలుత జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యుత్ బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాదాటి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన సభలో పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ జనాభాలో 20 శాతం ఉన్న అగ్రవర్ణాల వారు అధికారం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం విషయంలో బలహీనవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిరక్షరాస్యుల్లో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన వారే ఉండటం బాధాకరమన్నారు. బీసీలకు సైతం సబ్‌ప్లాన్ అమలు చేయాలని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కోరనున్నట్లు పేర్కొన్నారు. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించినట్లే , బీసీలకు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. మరో ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మాట్లాడుతూ బీసీలందరూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు దోపిదేశి గంగాధర్ మాట్లాడుతూ బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందన్నారు. రాజకీయంగా బీసీలు పొందాల్సిన స్థానాలను ఇతర వర్గాల వారు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై పోరాడాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన మాదాటి పూర్ణచంద్రరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపధ్యంలో బీసీ ఉద్యోగులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ చావలి పద్మావతి, విజయవాడ నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
ఫీజులు పెంచితే ఉద్యమం
ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఆర్.కృష్ణయ్య హెచ్చరిక హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఏకీకృత ఫీజు విధానం పెట్టి అన్ని కేటగిరిలకూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షల ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదన సరికాదని, దీనిని వెంటనే విరమించుకోవాలని 24బీసీ సంఘాల సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీసీ భవన్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య ను వ్యాపారంగా మారుస్తోందని విమర్శించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల అడ్మిషన్లు మెరిట్ ఆధారంగా చేపట్టాలని కోరారు. ఫీజులను పెంచితే ఉద్యమిస్తామని అన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను గతేడాది మాదిరిగానే కొనసాగించాలని, ఫీజులను పెంచరాదని, ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రస్తుతం ఉన్న ఏ,బీ, సీ మూడు కేటగిరిలను రెండుకి కుదించాలని, బీ కేటగిరిలో ఉన్న 10 శాతం సీట్లను ఏ కేటగిరిలో కలపాలని డిమాండ్ చేశారు. సీ కేటగిరిలోని 40 శాతం యాజమాన్యపు కోటాను 20 శాతానికి తగ్గించి దాన్ని ‘ఏ’ కేటగిరిలో కలపాలన్నారు. 80 శాతం కన్వీనర్ కోటాను మెరిట్ ప్రతిపదికన భర్తీ చేయాలని, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీసీ, సాంఘిక, గిరిజన, మైనార్టీ, వికలాంగ, మహిళ, శిశు సంక్షేమ శాఖలను విలీనంచేసి ఒకే శాఖ గా మార్చాలనే ప్రతిపాదన తగదన్నారు. అకాల వర్షాలకు తడిసిన పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించారు. సమావేశంలో ఆయా సంఘాల నేతలు జె.శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, సీహెచ్ భద్ర, సి.రాజేందర్, ఎ.రాంకోఠి ప్రసంగించారు. -
జగన్‌కు మద్ధతుగా బిసి సంఘాల దీక్షలు