
ఐక్యంగా ఉంటేనే బీసీలకు రాజ్యాధికారం
గౌడ ప్రజాప్రతినిధుల ప్లీనరీలో వక్తలు
హైదరాబాద్: సర్దార్ సర్వారుు పాపన్నగౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా ముందుకుసాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ గౌడ ప్రజాప్రతినిధుల వేదిక ప్లీనరీ ఆదివారం ఇక్కడ భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణగౌడ్, గంగాధర్‌గౌడ్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కిగౌడ్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గౌడ కులస్తులు ముందుండి పోరాటం చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ వచ్చాక గౌడ కులస్తులకు, బీసీలకు గతంలో కంటే ప్రాధాన్యం పెరిగిందన్నారు. బీసీ కులాలన్నింటినీ సమన్వయం చేస్తూ ఐక్యంగా ఉంటే అసెంబ్లీలో బీసీల స్థానాలు జనాభా ప్రతిపాదికన పెరుగుతాయని, ఓటే ఆయుధంగా పనిచేయాలన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు అధిక శాతం బీసీలు ఉన్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇదేస్థారుులో లేకపోవడానికి బీసీల మధ్య ఐక్యత లేకపోవమేనని తెలిపారు. ఈ సందర్భంగా గౌడ ప్రముఖులను సత్కరిం చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేశిని చినమల్లయ్య, తూళ్ల వీరేందర్‌గౌడ్, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.