హైదరాబాద్(తార్నాక): తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఈ నెల 8న బీసీల ప్లీనరీని నిర్వహించేందుకుగాను సన్నాహాలు చేస్తున్నామని ఆల్ ఇండియా ఓబీసీ కులాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు దునుకు వేలాద్రి తెలిపారు. ఈ మేరకు సోమవారం తార్నాకలోని ఐక్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా వేలాద్రి మాట్లాడుతూ.. ఈ ప్లీనరీ సమావేశాలను హిమాయత్ నగర్‌లోని తెలుగు అకాడమీ సమీపంలో ఉన్న బీసీ సాధికారత సంస్థ కార్యాలయంలో ఒక రోజు సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో బీసీల సమస్యలు, వాటికి పరిష్కార మర్గాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
'ఈ నెల 8న బీసీ సామాజిక వర్గాల ప్లీనరీ'
Published Mon, May 4 2015 9:35 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM
Advertisement
Advertisement