సాక్షి, తిరుపతి: బీసీల అభ్యున్నతికి ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు పాలకవర్గాలను కూడా నియమించడం ఓ చరిత్ర. బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. మంత్రి వర్గంలో కూడా బీసీలకు పెద్దపీట వేశారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వివిధ బీసీ కార్పొరేషన్లకు చైర్మన్‌లుగా, డైరెక్టర్‌లుగా నియమితులైన వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో నలుగురికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. వైఎస్ జగన్ పాదయాత్రలో చెప్పిన హామీలు, మెనిపెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చారు. మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేశారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రం, జిల్లాలో కాదు, కనీసం కుప్పంలో కూడా ఏమి చెయ్యలేకపోయారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 63 శాతం బీసీలకు కల్పించిన ఘనత సీఎం జగన్‌దే. జగన్ సీఎం కాక ముందు ఏం చేస్తారో అని కాస్త భయం వేసేది. కానీ నేడు ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.
డిప్యూటీ సీయం నారాయణ స్వామి మట్లాడుతూ.. సీఎం ఓ కులానికో, మతానికో పరిమితం కాదు. అందుకే వెనుకబడిన కులాలను ఆభివృద్ధి చెయ్యడానికే బీసీ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మేకపాటి గౌతమ్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 4 చైర్మన్‌లు, 58 డైరెక్టర్‌లు దక్కడం చాలా సంతోషకరమైన విషయం. సీఎం వైఎస్ జగన్ ఆర్థికంగా, రాజకీయంగా బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్‌లు వారి కులాలకు అందుబాటులో ఉండాలి, బీసీల అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరుతున్నట్లు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పేర్కొన్నారు. చదవండి: (హెరిటేజ్‌పై ఐటీ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం)
వారందరికీ అభినందనలు: భూమన
సీఎం జగన్ ఆశీస్సులతో బీసీ కార్పొరేషన్ చైర్మన్‌లుగా ఎన్నికయిన వారిందరికీ అభినందనలు. దేశంలో 56 బీసీ కార్పొరేషన్‌లను అధికారికంగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌దే. బీసీలు సీఎంలుగా ఉన్న రాష్ట్రాలలో కూడా బలహీన వర్గాలకి ఇంత పెద్ద పీట వెయ్యలేదు. అది ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యం అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
కరపత్రాలు పంచి అసత్య ప్రచారాలు: ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి
చంద్రబాబు కావాలనే మాపై కరపత్రాలు పంచి అసత్య ప్రచారాలు చేయిస్తున్నాడని ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు కావాలనే రెచ్చగొట్టే విధంగా మనుషులను ఉసిగొలుపుతున్నాడు. చంద్రబాబూ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి వచ్చి చర్చించు. అంతే కానీ, హైదరాబాదులో కూర్చొని రాజకీయ, కుయుక్తులు చేయడం సరికాదు అని అన్నారు.
సీఎం జగన్‌కి కృతజ్ఞతలు: ఆర్కే రోజా
బీసీల పార్టీగా చెప్పుకున్న చంద్రబాబు చెయ్యలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్‌కి కృతజ్ఞతలు. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారు. 15 నెలల కాలంలోనే 35 వేల కోట్లు రూపాయలు బీసీలకు అందించారంటే అది ఒక్క జగన్ మాత్రమే అని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు.
వైఎస్ జగన్‌కు పబ్లిసిటీ అవసరం లేదు: బియ్యపు మధుసూదన్ రెడ్డి
సీఎం వైఎస్ జగన్‌కు పబ్లిసిటీ అవసరం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్‌లో సినిమా చూపించేవాడు. బీసీల పార్టీ అని చెప్పుకునే ఆయన ఎంతమందిని చైర్మన్‌లను చేశారని అడుగుతున్నాను. లోటు బడ్జెట్, కరోనా కష్టకాలంలో ఉన్నా కూడా చెప్పిన పథకాలన్ని నెరవేరుస్తున్నారు.. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు.
వెనుకబడిన తరగతులగానే జీవించాలా: చెవిరెడ్డి
139 బీసీ కులాలలు ఇంకా ఎంత కాలం ఈ మాట వినాలి. సామాజిక కట్టుబాట్లతో ఇంకా ఎంతకాలం వెనుకబడిన తరగతులగానే జీవించాలి. ఇది కరెక్ట్ కాదుని సీఎం వైఎస్ జగన అనుకున్నాడు. అందుకే బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్థిక స్వావలంబన కలిగినప్పుడే బీసీ కలాలు అభివృద్ధి చెందుతాయని ఆలోచించాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చెయ్యనంత ఆర్థిక సహాయం వైఎస్ జగన్ చేశారు. గతంలో బీసీ అంటే రాజకీయ అవసరాలకు వాడుకోనేవారు. కానీ నేడు బీసీలంటే వెన్నుముకగా బావించిన సీఎం వారికి పెద్దపీట వేశారు. అందులో భాగంగానే రాష్ట్ర పాలనలో అవకాశం ఇచ్చారు. బీసీ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment