చౌడేపల్లె(సోమల): రాష్ట్ర విద్యుత్, అటవీ, గనుల శాఖామంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. చిత్తూరు జిల్లా సోమల మండలంలో మూడోరోజు పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తు న్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి నెల్లిమంద కమ్మ పల్లె గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ నాయుడు పార్టీలో చేరగా, ఆయనకు కండువా వేసి ఆహ్వానించారు.
ఆయనతోపాటు మ రో ఇరవై కుటుంబాలవారు వైఎస్సార్ సీపీలో చే రారు. పార్టీలో చేరిన వారిలో రెడ్డిబాషా, ముబాకర్, బావాజీ, సుబ్రమణ్యంనాయుడు, రహీంబాషా, వెంకట్రామయ్య, షంషీర్, బాబు, మ«ధు, బషీర్ ఉ న్నారు. అలాగే నవాబుపేట, బురుపల్లెలో అజీజ్, జై బూన్‌తోపాటు మరో పది కుటుంబాల వారు వైఎస్సాసీపీలో చేరారు. మంత్రి వారికి కూడా పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. వారు మా ట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గంతోపా టు తమ మండలానికి చేస్తున్న అభివృద్ధి చూసి ఆక ర్షితులైనట్టు తెలిపారు.
ఏకష్టమొచ్చినా వెన్నంటి ఉంటూ ఆదుకొనే స్వభావం ఉన్న మంత్రి వెంట నడవడానికి సిద్ధమై పార్టీలో చేరినట్లు చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీను మరింత బలోపేతం చేసి, రా నున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించే దిశగా అందరితో కలిసి ఐకమత్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పుంగనూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు జింకా వెంకటాచ లపతి, ఎంపీపీ ఈశ్వరయ్య, జెడ్పీటీ సీ సభ్యురాలు అమాస కుసుమ, వైస్ ఎంపీపీ సయ్యద్‌బాషా, కోఆప్షన్ స భ్యుడు మస్తాన్‌బాషా, మాజీ మార్కె ట్ కమిటీ చైర్మన్లు అమాస మోహన్, నాగేశ్వరరావు, పార్టీ అధ్యక్షుడు గంగాధర రాయల్, పాల్గొన్నారు.
వంద కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక
పలమనేరు: మున్సిపాలిటీ పరిధిలోని గడ్డూరు గ్రా మానికి చెందిన వంద టీడీపీ కుటుంబాల ప్రజలు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలను కప్పి, ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment