![Ysrcp Mp Mithun Reddy Comments On Tdp Attacks](/styles/webp/s3/article_images/2024/07/19/Ysrcp-Mp-Mithun-Reddy.jpg.webp?itok=Bx5hqeGk)
సాక్షి, చిత్తూరు: మన ప్రభుత్వంలో ఇలాంటి దాడులు చూడలేదని.. కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి’’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ధైర్యం చెప్పారు. శుక్రవారం ఆయన సదుం మండలంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ, నాపై కూడా నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టారు. పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం. పోలీసులు పట్టించుకోకుంటే న్యాయపోరాటం చేస్తాం. నేను ఎవ్వరినీ వదిలి పెట్టను, కార్యకర్తలకు అండగా ఉంటా. పోలీసులు పట్టించుకోకుంటే కోర్టు ద్వారా ప్రైవేట్ కేసులు వేస్తాం.. మీకు ధైర్యం చెప్పేందుకే నేను వచ్చాను’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు.
వైఎస్సార్‌సీపీ నేత పోకల అశోక్‌కుమార్ మాట్లాడుతూ, చట్టానికి ఎవరు అతీతులు కారు, కుట్ర పూరితంగా కేసులు పెడుతున్నారు. ప్రజలు అందరు గమనిస్తున్నారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వెన్నంటే మన కార్యకర్తలు, నాయకులు ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment