తాడిపత్రిలో టీడీపీ దాడులపై ఎస్పీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ దాడులపై ఎస్పీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు వినతి పత్రం అందజేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆంక్షలు తొలగించాలని మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
కూటమి అధికారంలోకి వచ్చాక దాడులకు తెగబడుతోందని వైఎస్సార్‌సీపీ మండిపడింది. ‘‘మా పాలనలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాం. చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేయడం హేయమైన చర్య. దాడులను ఆపడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఆస్తులను ధ్వంసం చేస్తుంటే రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. దాడులు ఇలాగే కొనసాగితే సహించేది లేదు’’ అని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు.
ప్రతిపక్షం ఉండకూడదన్నదే జేసీ కుట్రలు: అనంత వెంకటరామిరెడ్డి
తాడిపత్రి లో జేసీ హింసా రాజకీయాలు ఖండిస్తున్నాం. టీడీపీ దౌర్జన్యాలు, దాడులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గానికి వెళ్తే తప్పేంటి?. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీ అనుమతితో తాడిపత్రి వెళ్లినా దాడులు చేశారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. హామీలు అమలు చేయకుండా టీడీపీ నేతలతో దాడులు చేయిస్తున్నారు. టీడీపీ గూండాగిరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం
పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి: మాజీ ఎంపీ తలారి రంగయ్య
శాంతి భద్రతలు పరిరక్షించడం లో చంద్రబాబు విఫలమయ్యారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కక్షసాధింపు రాజకీయాలు లేవు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి అనుమతించాలి.
జేసీ రౌడీయిజాన్ని పోలీసులు అడ్డుకోలేరా?: మాజీ మంత్రి శంకర్ నారాయణ
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటవిక పాలన ప్రోత్సహిస్తున్నారు. హామీలు అమలు చేయకుండా హింసను ప్రేరేపిస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజాన్ని పోలీసులు అడ్డుకోలేరా?. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment