Bhumana Karunkar reddy
-
టీటీడీ ఆస్తులపై ఏటా శ్వేతపత్రం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన 7,123 ఎకరాల్లోని 960 ఆస్తుల తుది జాబితాను టీటీడీ వెబ్సైట్లో ఉంచుతున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.85,705 కోట్లు అన్నారు. ఇకపై ఇలా ప్రతియేటా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం సమర్పిస్తామని ఆయన చెప్పారు. అలాగే.. కరోనా కారణంగా మాడ వీధుల్లో నిర్వహించలేకపోయిన బ్రహ్మోత్సవ వాహన సేవలను రెండేళ్ల తర్వాత ఈ ఏడాది నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని.. పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, సనత్‌కుమార్‌రెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం.. సమావేశ నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పాలకమండలి సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వానికి రూ.60 కోట్లు చెల్లించి 300 ఎకరాలు కొనుగోలు చేశాం. భవిష్యత్ అవసరాలకు ఈ స్థలం పక్కనే ఉన్న మరో 132 ఎకరాల స్థలాన్ని రూ.25 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ► శ్రీవారి బ్రహ్మోత్సవాల తరువాత తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డి) కౌంటర్లు ప్రారంభిస్తాం. 20వేల వరకు టోకెన్లు జారీచేస్తాం. ► శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉ.10 గంటలకు మార్చాలని నిర్ణయం. బ్రహ్మోత్సవాల తరువాత దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేస్తాం. ► తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయించాం. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవాల తరువాత ఈ విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా మొదలుపెడతాం. ► తిరుమలలో గదుల కొరత ఉన్న కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో గదులు లభించని భక్తుల కోసం అక్కడక్కడా జర్మన్ షెడ్లు ఏర్పాటుచేశాం. ► భక్తులకు అందించే శ్రీవారి నైవేద్య ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తులను ఏపీ మార్క్‌ఫెడ్, రైతు సాధికార సంస్థ ద్వారా కొనుగోలుకు అంగీకరించాం. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు టెండర్ల ద్వారా కొనుగోలుకు నిర్ణయించాం. ► తిరుమలలోని గోవర్థన సత్రాల వెనుక భాగంలో పీఏసీ–5 నిర్మాణానికి రూ.98 కోట్లతో రివైజ్డ్ టెండర్లకు ఆమోదించాం. తద్వారా మరింత మంది భక్తుల వసతికి అవకాశం కలుగుతుంది. ► వకుళమాత ఆలయం నుంచి పుదిపట్ల జూపార్క్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు. చెన్నై, బెంగళూరు నగరాల నుంచి వచ్చే భక్తులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.. ఇందుకోసం స్థలం సేకరించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ► తిరుమల నందకం విశ్రాంతి గృహంలో ఉన్న 340 గదుల్లో నూతన ఫర్నిచర్ ఏర్పాటు నిమిత్తం రూ.2.45 కోట్లు మంజూరు. ► తిరుమలలో సామాన్య భక్తుల కోసం గదుల ఆధునీకరణ పనుల్లో భాగంగా గీజర్ల ఏర్పాటు. వీటి కోసం అదనపు లోడు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు రూ.7.20 కోట్లతో టెండర్లకు ఆమోదం. ► నెల్లూరులో రెండు ఎకరాల స్థలంలో ఉన్న టీటీడీ కల్యాణమండపం ఆధునీకరణ, శీతలీకరణ, చిన్న ఆలయ నిర్మాణ పనులకు రూ.3 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించాం. ► టీటీడీలోని క్లాస్–4 ఉద్యోగులకు నగదు బదులుగా యూనిఫాం క్లాత్ కొనుగోలుకు రూ.2.50 కోట్లు మంజూరు చేస్తున్నాం. ► ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనంగా తరగతి గదులు, హాస్టల్ గదుల నిర్మాణానికి రూ.6.37 కోట్లు మంజూరుకు నిర్ణయించాం. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సీఎం కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్‌కు ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రం అందజేశారు. చదవండి: (సీఎం జగన్‌ను కలిసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన) -
డేటా చోరీ జరిగింది.. అవసరమైతే కొందరిని హౌజ్ కమిటీ ముందుకు పిలుస్తాం: భూమన
సాక్షి, అమరావతి: పెగాసెస్, ఫోన్ ట్యాపింగ్‌పై హౌజ్ కమిటీ మంగళవారం భేటీ అయ్యింది. చైర్మన్ భూమన కరుణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హౌస్ కమిటీ సభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు. హోం, ఐటీశాఖల నుంచి హౌజ్ కమిటీ సమాచారం సేకరించింది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. 2016-2019 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల ప్రైవేటు భద్రతకు ముప్పు వాటిల్లే చర్యలు తీసుకుందని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లను ఉంచి ఇతరుల ఓట్లు తొలగించిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గపు చర్చలు తీసుకుందని మండిపడ్డారు. కావాలనే డేటా దొంగిలించి రాజకీయ లబ్ధి పొందినట్లు స్పష్టత వచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణలో డేటా చోరీ జరిగిందని తెలంగాణ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసిందన్నారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటాను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిందని విమర్శించారు. డేటా చోరీ జరిగిందన్న భూమన కరుణాకర్‌రెడ్డి అవసరమైతే కొందరిని హౌస్ కమిటీ ముందుకు పిలుస్తామన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ప్లీనరీలో పార్టీ నియమావళికి సవరణలు -
పెగాసస్ గుట్టు తేల్చనున్న ఏపీ ప్రభుత్వం
-
టీడీపీకి వణుకు పెగాసస్ పై హౌస్ కమిటీ విచారణ ప్రారంభం
-
నాడు భయమేసింది.. నేడు సంతోషంగా ఉంది: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: బీసీల అభ్యున్నతికి ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు పాలకవర్గాలను కూడా నియమించడం ఓ చరిత్ర. బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. మంత్రి వర్గంలో కూడా బీసీలకు పెద్దపీట వేశారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వివిధ బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమితులైన వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో నలుగురికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. వైఎస్ జగన్ పాదయాత్రలో చెప్పిన హామీలు, మెనిపెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చారు. మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేశారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రం, జిల్లాలో కాదు, కనీసం కుప్పంలో కూడా ఏమి చెయ్యలేకపోయారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 63 శాతం బీసీలకు కల్పించిన ఘనత సీఎం జగన్‌దే. జగన్ సీఎం కాక ముందు ఏం చేస్తారో అని కాస్త భయం వేసేది. కానీ నేడు ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు. డిప్యూటీ సీయం నారాయణ స్వామి మట్లాడుతూ.. సీఎం ఓ కులానికో, మతానికో పరిమితం కాదు. అందుకే వెనుకబడిన కులాలను ఆభివృద్ధి చెయ్యడానికే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మేకపాటి గౌతమ్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 4 చైర్మన్లు, 58 డైరెక్టర్లు దక్కడం చాలా సంతోషకరమైన విషయం. సీఎం వైఎస్ జగన్ ఆర్థికంగా, రాజకీయంగా బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు వారి కులాలకు అందుబాటులో ఉండాలి, బీసీల అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరుతున్నట్లు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప పేర్కొన్నారు. చదవండి: (హెరిటేజ్‌పై ఐటీ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం) వారందరికీ అభినందనలు: భూమన సీఎం జగన్ ఆశీస్సులతో బీసీ కార్పొరేషన్ చైర్మన్లుగా ఎన్నికయిన వారిందరికీ అభినందనలు. దేశంలో 56 బీసీ కార్పొరేషన్లను అధికారికంగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌దే. బీసీలు సీఎంలుగా ఉన్న రాష్ట్రాలలో కూడా బలహీన వర్గాలకి ఇంత పెద్ద పీట వెయ్యలేదు. అది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యం అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కరపత్రాలు పంచి అసత్య ప్రచారాలు: ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి చంద్రబాబు కావాలనే మాపై కరపత్రాలు పంచి అసత్య ప్రచారాలు చేయిస్తున్నాడని ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు కావాలనే రెచ్చగొట్టే విధంగా మనుషులను ఉసిగొలుపుతున్నాడు. చంద్రబాబూ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి వచ్చి చర్చించు. అంతే కానీ, హైదరాబాదులో కూర్చొని రాజకీయ, కుయుక్తులు చేయడం సరికాదు అని అన్నారు. సీఎం జగన్‌కి కృతజ్ఞతలు: ఆర్కే రోజా బీసీల పార్టీగా చెప్పుకున్న చంద్రబాబు చెయ్యలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్‌కి కృతజ్ఞతలు. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారు. 15 నెలల కాలంలోనే 35 వేల కోట్లు రూపాయలు బీసీలకు అందించారంటే అది ఒక్క జగన్ మాత్రమే అని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు పబ్లిసిటీ అవసరం లేదు: బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు పబ్లిసిటీ అవసరం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్‌లో సినిమా చూపించేవాడు. బీసీల పార్టీ అని చెప్పుకునే ఆయన ఎంతమందిని చైర్మన్లను చేశారని అడుగుతున్నాను. లోటు బడ్జెట్, కరోనా కష్టకాలంలో ఉన్నా కూడా చెప్పిన పథకాలన్ని నెరవేరుస్తున్నారు.. సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. వెనుకబడిన తరగతులగానే జీవించాలా: చెవిరెడ్డి 139 బీసీ కులాలలు ఇంకా ఎంత కాలం ఈ మాట వినాలి. సామాజిక కట్టుబాట్లతో ఇంకా ఎంతకాలం వెనుకబడిన తరగతులగానే జీవించాలి. ఇది కరెక్ట్ కాదుని సీఎం వైఎస్ జగన అనుకున్నాడు. అందుకే బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్థిక స్వావలంబన కలిగినప్పుడే బీసీ కలాలు అభివృద్ధి చెందుతాయని ఆలోచించాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చెయ్యనంత ఆర్థిక సహాయం వైఎస్ జగన్ చేశారు. గతంలో బీసీ అంటే రాజకీయ అవసరాలకు వాడుకోనేవారు. కానీ నేడు బీసీలంటే వెన్నుముకగా బావించిన సీఎం వారికి పెద్దపీట వేశారు. అందులో భాగంగానే రాష్ట్ర పాలనలో అవకాశం ఇచ్చారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. -
తిరుపతిలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడుగా బాబు నిలుస్తారు
-
‘బీసీలు తలెత్తుకునే విధంగా జగన్ పాలన’
సాక్షి, రాయచోటి(వైఎస్సార్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో నిర్వహించిన ‘బీసీ గర్జన’ చారిత్రాత్మకమని ఆ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీసీలు భారతీయ సంస్కృతి ప్రతిరూపాలని అభివర్ణించారు. వారి అభివృద్ధికి 50 శాతం చట్టబద్ధత కల్పించడమనేది అభినందనీయమన్నారు. బీసీలు తలెత్తుకొనే విధంగా వైఎస్ జగన్ పాలన ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం రాయచోటిలో బీసీ డిక్లరేషన్‌పై హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సర్కిల్లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ కార్యదర్శి విజయభాస్కర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెర్లను, బోయలను ఎస్టీలోకి తీసుకవస్తామన్నారు. వైఎస్సార్ సీపీ ఇచ్చిన ప్రతీ హామీని తప్పక నెరవేర్చుతుందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్, హామీలు ప్రకటించినందుకే బాబు హడావుడిగా పలు కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ ముస్లిం వైఎస్సార్ సీపీ పక్షానే తిరుపతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే బీసీ వర్గాల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భూమన మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ముస్లింలకు ఎంతో మేలు జరిగిందని.. అంతకంటే రెట్టింపు మేలు జగన్ పాలనలో జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతీ ముస్లిం వైఎస్సార్ సీపీ పక్షానే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. -
చంద్రబాబుకు ప్రజలు బుధ్ధి చెప్పడం ఖాయం
-
జీవకోణలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన భూమన
-
ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టడంలేదు
-
‘కరువు మండలాలను కుదించడం దారుణం’
సాక్షి, విజయనగరం : కరువు మండలాలన ప్రటకనలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కరువు మండలాలను కుదించడం దారుణమన్నారు. రాయలసీమలో 19శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. కరువు తాండవిస్తే భూములను వ్యాపారులకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. సాగు, తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. అరాచక పాలన రాజ్యమేతుతోంది : నల్లపురెడ్డి రాష్ట్రంలో అరాచకపాలన రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు. నాలుగున్నరేళ్లలో దోచుకోవడం తప్పా టీడీపీ చేసిందేమి లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమయిందని విమర్శించారు. త్వరలోనే చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెబుతారన్నారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
టీడీపీని తరిమి కొట్టండి
విజయనగరం మున్సిపాలిటీ: దగాకోరు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజలందర్నీ నట్టేట ముంచారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాకంటక పాలన కావాలో.. రామరాజ్యం కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్న టీడీపీని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారమిక్కడ వైఎస్సార్సీపీ పట్టణ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతిని«ధుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూమన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రాక్షస పాలనను కూకటివేళ్లతో పెకిలించే నాయకుడు ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమేనని చెప్పారు. నాలుగేళ్లుగా ప్రతిపక్ష నాయకునిగా వీరోచితమైన పాత్ర పోషిస్తున్న వైఎస్ జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చి రాజన్న రాజ్యం స్థాపించాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తెచ్చుకోవడానికి జగన్‌కు అవకాశమివ్వాలని కోరారు. 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న జగన్‌ను అన్ని వర్గాలవారూ ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు. అంతకుముందు భూమనకు యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌషిక్ స్థానిక వి.టి.అగ్రహారం వై జంక్షన్ వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడ్నుంచి వందలాది బైక్‌లతో వైఎస్సార్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడున్న వైఎస్సార్ విగ్రహానికి భూమనతో పాటు పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అ«ధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ తదతరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, పాల్గొన్నారు. -
40 ఏళ్ల ‘బాబు’ చరిత్రంతా నీచమే
అనంతపురం: 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వంచన, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు, నీచ రాజకీయ ఎత్తుగడలతో ఒకరిని మేనేజ్ చేయడం తప్ప ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి ఒక్క మంచి పని కూడా చేయలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం అనంతపురంలో వైఎస్సార్సీపీ బూత్ కమిటీ కన్వీనర్ల రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. 1978లో వైఎస్ రాజశేఖరరెడ్డికి తానే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భూమన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘నాది 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజల కోసమే పుట్టాను, వారి గురించి తప్ప ఇంకేమీ ఆలోచించడం లేదు. ప్రజల కోసం నాలాగా ఆలోచించేవారు ఎవరూ లేరు. ప్రధాన మంత్రులనే తయారు చేసిన గొప్ప రాజకీయ నాయకుడినని పతాక శీర్షికలతో సీఎం చంద్రబాబు తన ఎల్లో మీడియాలో రాయించుకున్నారు. అంతకంటే ఎక్కువగా పచ్చ మీడియా బాకాలు ఊదింది. నిజంగా చంద్రబాబు మూలాలు ఎలాంటివో నాకు తెలుసు. ఆయన కంటే నేను నాలుగైదేళ్లు చిన్నవాడిని. నేను కూడా 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నా. తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో ఆర్ఎస్యూ ప్రారంభమైంది. ప్రారంభ సభ్యుల్లో నేనూ ఒకడిని. ఆర్ఎస్యూ నడపడానికి 1974 డిసెంబర్ 8న మేము ఒక సినిమాను బెనిఫిట్ షోగా ప్రదర్శించేందుకు టికెట్లను రూ.2 ధర చొప్పున విక్రయించాం. ఇదే సమయంలో ఎ–బ్లాకులో ఉంటున్న చంద్రబాబు గదికి వెళ్లి టికెట్ కొనాలని కోరితే ఆయన వద్ద డబ్బులుండి కూడా ఇవ్వడానికి మనస్కరించలేదు. అలాగని లేదని చెప్పే ధైర్యం లేకపోయింది. అదే గదిలో నిద్రిస్తున్న తన స్నేహితుడి జేబులో నుంచి రూ.2 దొంగిలించి నా చేతికి ఇచ్చారు. 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు పునాది ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ చాలు. అలాగే 1977లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. చిత్తూరు స్థానానికి రాజగోపాల్‌నాయుడు ఎన్నికల్లో నిలబడ్డారు. చంద్రగిరి నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైంది. చంద్రబాబే ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. జీపు ఇచ్చి 200 లీటర్ల పెట్రోల్‌ను బ్యారెల్ నిండా నింపి, చంద్రగిరి నియోజకవర్గమంతా తిరిగి రమ్మని చెబితే మరుసటి రోజు ఉదయమే అన్నా పెట్రోల్ మొత్తం అయిపోయిందని చెప్పాడట చంద్రబాబు. ఈ పెట్రోల్‌ను కాంగ్రెస్ పార్టీ నేత వీరరాఘవులు నాయుడికి చెందిన బంకులో అమ్మేశాడట! ఈ విషయాన్ని స్వయంగా వీరరాఘవులునాయుడే నాకు చెప్పాడు. చంద్రబాబు మూలాలు ఇంత నీచంగా ఉంటే నీతి నిజాయితీకి పునాదిలా ఉన్నాడంటూ పతాక శీర్షికలతో రాయడం బాధాకరం. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో యువజన కాంగ్రెస్ కార్యకర్తగా జనం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనే ఆలోచనలతో వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చారు. 30 ఏళ్ల పాటు తెలుగు జాతిని ఉర్రూతలూగించారు. పోరాటాలు, ఉద్యమాలు, సమున్నతమైన వ్యక్తిత్వంతో గొప్ప నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబుకు, వైఎస్ రాజశేఖరరెడ్డికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వైఎస్సార్సీపీకి సిద్ధాంతాలు లేవని చంద్రబాబు అంటున్నారు. మా పార్టీకి మహత్తరమైన సిద్ధాంతం ఉంది. రాజశేఖరరెడ్డి జీవితమే వైఎస్సార్సీపీ భావజాలం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబు ప్రజాద్రోహ రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవాలు తెలియనని వారికి చంద్రబాబు ఎలాంటి అబద్ధాలైనా చెబుతారు. చంద్రబాబులాగా నీచ రాజకీయాలు కాకుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి ఆరేళ్లు గడువు ఉన్నా రాజీనామా చేస్తేనే తన పార్టీలోకి చేర్చుకోవడం జగన్ పాటిస్తున్న నైతిక విలువలకు నిదర్శనం. చంద్రబాబు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను రూ.కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసి దిగజారుడు రాజకీయాలు చేశారు. వ్యక్తిత్వం గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదం ఉంది. కళ్లార్పకుండా కమిట్మెంట్తో అబద్ధాలు చెప్పడమే చంద్రబాబు నైజం’’ అని భూమన నిప్పులు చెరిగారు. జనం దీవెనలతోనే జగన్ అధికారం చేపడతారు ప్రజల కోసం అహర్నిశలూ పోరాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్ అని భూమన అన్నారు. ఆయన అణిగిమణిగి ఉండింటే 8 ఏళ్ల కిందటే సీఎం అయ్యేవారన్నారు. ప్రజల దీవెనలతోనే అధికారం చేపట్టాలని జగన్ భావిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా పరిశీలకులు వైఎస్ కొండారెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కిష్టప్ప, హిందూపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శంకర నారాయణ పాల్గొన్నారు. నవ్విపోదురుగాక... ‘‘ఒక పత్రికలో చంద్రబాబు ఇంటర్వ్యూ చూశాను. వైఎస్ రాజశేఖరరెడ్డికి తానే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించానని చంద్రబాబు చెప్పాడు. వాస్తవం ఏమిటంటే మంత్రివర్గంలో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబుకు స్థానం కల్పించేలా రాజశేఖరరెడ్డి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పదవి ఇప్పించారు. ఇలాంటి చంద్రబాబా.. రాజశేఖరరెడ్డికి టికెట్ ఇప్పించేది? ఎవరైనా వింటే నవ్విపోతారు. వాస్తవాలు తెలియనివాళ్లు, అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి అవగాహన లేని వారు చంద్రబాబు మాటలు వింటే ఇవన్నీ నిజమేనేమో అని భ్రమ పడుతారు. చంద్రబాబు నోట అబద్ధాలు మినహా మరో సత్యం రాని పరిస్థితి’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
ప్రజల్లోకి వైఎస్సార్ సీపీ ఆశయాలు
శ్రీకాకుళం అర్బన్/శ్రీకాకుళం సిటీ: రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిపాలన, అన్యాయాలు, అక్రమాలను సమర్థంగా ఎదుర్కొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. నాలుగు రోజుల శిక్షణా తరగతుల్లో భాగంగా శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని ఆనందమయి కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన బూత్‌స్థాయి కన్వీనర్లకు, జిల్లా మహిళా విభాగం నాయకురాళ్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. గతంలో సామాన్యులు, పేదల జోలికి ఎవరూ వెళ్లేవారు కాదని, ఇపుడు వారిని కూడా హింస పెట్టే పరిస్థితి దాపురించిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయాలు రౌడీయిజం, వ్యాపారమయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి రాజకీయాలను దారిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు గౌరవం లేకుండా పోయిందని, జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో వారికే అధికారాలు కట్టబెట్టడం దారుణమన్నారు. శ్రీకాకుళం బలహీన వర్గాలకు చెందిన జిల్లా అని పేరు ఉందని, ఇక్కడి ప్రజలు మాత్రం బలహీనులు కారన్నారు. పోలింగ్ స్టేషన్లో ప్రతి ఓటరుపై, ఓటర్ల జాబితాపై పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలన్నారు. ఒక పవిత్ర ఆశయం కోసం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని, ఆ పోరాటానికి మనమంతా అండగా ఉండాలన్నారు. కార్యక్రమానికి ముందు పార్టీ జెండాను పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఎగురవేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వి.పద్మావతి, చల్లా రవి, కె.ఎల్.ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మామిడి శ్రీకాంత్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, జిల్లా అధికార ప్రతినిధులు శిమ్మ రాజశేఖర్, రొక్కం సూర్యప్రకాశరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, నేతలు ధర్మాన పద్మప్రియ, పిలక రాజ్యలక్ష్మి, టి.కామేశ్వరి, పితాని బాలకృష్ణ, గొండు రఘురాం, పొన్నాడ రుషి, అంబటి శ్రీనివాసరావు, మూకళ్ళ తాతబాబు, యజ్జల గురుమూర్తి, కోరాడ రమేష్, పడపాన సుగుణారెడ్డి, గుంట జ్యోతి, పి.సౌజన్య, కృష్ణవేణి, జె.ఎం.శ్రీనివాస్, మూకళ్ల సుగుణ, ఇఛ్చాపురం నియోజకవర్గ పార్టీ నేతలు కాళ్ల దేవరాజ్, పిఎం తిలక్, మంగి గణపతి, ఇప్పిలి లోలాక్షి, కడియాల ప్రకాష్, పులకల శ్రీరాములు, బద్దాన శ్రీకృష్ణ, తడక జోగారావు తదితరులు పాల్గొన్నారు. మహోన్నత వ్యక్తి వైఎస్సార్ రక్తంలోని ఆవేశం, వ్యక్తిత్వంలోని ఆలోచన, మాటల్లోని వాక్సుద్ధి, తనచుట్టూ ఉన్న పరిసరాల్లో ఏ ఒక్కరూ కష్టాలు, ఇబ్బందులూ పడకుండా చూడాలనే మనసున్న మహోన్నత వ్యక్తి వై.ఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన ఆలోచనలతో తెరచిన పుస్తకమే ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’. ఇది అధికార లాలసతోనో, పదవీ కాంక్షతోనో, ధనార్జన కోసమో ఏర్పాటు చేసింది కాదు. ఏ మహానుభావుడైతే తన ఆలోచనలను, ఆశయాలను, సిద్ధాంతాలను వదిలాడో వాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన తనయుడిగా జగన్మోహన్రెడ్డి ముందుకు వచ్చారు. ప్రజల ఆరోగ్యం బాగు చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ, మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు పావలా వడ్డీకే రుణాలు అందించిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. అంతకు ముందు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రూ.900 కోట్లు అందజేస్తే ఐదున్నరేళ్ల వైఎస్ పాలనలో రూ.5లక్షల 30వేల కోట్లు రుణాలు మంజూరు చేశారు. లక్షలాది ఇళ్లు కట్టించి ఆపద్బాంధవుడయ్యాడు. రైతులను ఆదుకునేందుకు బృహత్తర నీటి ప్రాజెక్టులు తెచ్చి అపరభగీరథుడుగా ఖ్యాతి పొందారు. నిరుపేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో కార్పొరేట్ వైద్యం అందజేశారు. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం పొందారు. శ్రీకృష్ణుని మరణం ఏవిధంగా అయితే పాండవులను కుంగదీసిందో వైఎస్ మరణం ప్రపంచంలోని 15 కోట్ల తెలుగుప్రజలను అంతలా కుంగదీసింది. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేశారు. శత్రువులను సైతం అక్కున చేర్చుకుని సహాయం చేసే గుణమే వైఎస్సార్సీపీ భావజాలం. స్వార్థం కోసమో, పదవుల కోసమో పనిచేయకుండా ప్రజల అభివృద్ది, సంక్షేమమే ద్యేయంగా పనిచేయడమే పార్టీ సిద్ధాంతం. రానున్న ఎన్నికల్లో మహిళలే ముఖ్య భూమిక పోషించి పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయాలి. – భూమన కరుణాకరరెడ్డి,శ్రీకాకుళం–విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఎన్నికలకు సిద్ధంకావాలి రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకం. గతంలో మహిళలకు ఓటు లేదు. ఇపుడు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణ, పోలింగ్‌బూత్ కన్వీనర్ల పాత్ర ఎంతో కీలకం. క్షేత్రస్థాయి నుంచి పార్టీ జెండా, దాని ఆవశ్యకత, జెండాలోని 9 అంశాల ప్రాముఖ్యతను బూత్‌స్థాయి కన్వీనర్లకు విశదీకరించి, వాటిని గ్రామీణస్థాయిలో ప్రజలకు తెలియజేయాలి. రాబోయే ఎన్నికల సంగ్రామంలో పోరాడేందుకు బూత్‌స్థాయి కన్వీనర్లకు, సభ్యులకు ఈ శిక్షణా తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయి.– ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ సోషల్ మీడియా పాత్ర చాలా కీలకం రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర కీలకం. ప్రస్తుతం ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండదేమోగానీ, సెల్‌ఫోన్ లేని ఇళ్లంటూ ఉండదు. 2010 నుంచి సోషల్ మీడియా ప్రాముఖ్యత చాలా ఎక్కువైంది. 15 నుంచి 40 ఏళ్లమధ్య వయస్సు ఉన్న వారు 90 శాతం మంది సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియాను ఉపయోగించి మంచి ఫలితాలు సాధించింది. 2016లో కేరళలో జరిగిన ఎన్నికల్లో 60శాతం ఓట్లను సోషల్ మీడియా ప్రభావితం చేసింది. సోషల్ మీడియా బృందానికి తగిన శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. సమచార హక్కు చట్టంపై కూడా సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. దీని ద్వారా అధికారులు, ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలికితీయవచ్చు.– ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి, శిక్షకుడు మహిళల పాత్రే కీలకం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళలదే కీలకపాత్ర. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్న చంద్రబాబు హామీని నమ్మి మహిళలంతా మోసపోయారు. ఇప్పుడు వారంతా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ పాలనలో చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రేషన్ డిపోల్లో 9 నిత్యావసర వస్తువులు ఇచ్చేవారు. ఇప్పుడు కేబియ్యం తప్ప మరే ఇతర వస్తువులూ అందడం లేదు. రాజధాని నిర్మాణమంటూ 57వేల ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 2018–19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు మంజూరు చేయని దుస్థితి. ఒకవేళ నిధులు మంజూరు చేస్తే అవి ఎక్కడ బాబు జేబులోకి వెళ్లిపోతాయోనని కేంద్రపెద్దల ఆలోచన. ఆరు నెలలుగా బీదలకు ఉపాధిహామీ వేతనాలు అందని దుస్థితి. – ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ జగన్‌తోనే సంక్షేమ రాజ్యం సాధ్యం ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ రాజ్యం సాధ్యం. జనంలో పార్టీ బలంగా ఉంది. దీనిని బూత్‌స్థాయికి తీసుకువెళ్లాలి. జగన్ తనశక్తి, యుక్తులతో ప్రజాసంకల్ప పాదయాత్ర చేపడుతున్నారు. ఈ పాదయాత్రకు వస్తున్న జనాలను ఓటర్లుగా మలచుకుని బూత్‌వద్దకు తీసుకువచ్చే గురుతర బాధ్యత మనందరిపైనా ఉంది. గడచిన ఎన్నికల్లో మన పార్టీ వైఫల్యాలను విశ్లేషించుకున్నాం. వైఎస్సార్ ఆశయాలు, సిద్ధాతాల సాధనే ధ్యేయంగా వచ్చిన జగన్‌ను గెలిపించుకుంటేనే ఆయన లక్ష్యాన్ని నెరవేర్చినవారమవుతాం. పార్టీ బూత్‌స్థాయి కన్వీనర్లు సైనికుల్లా తయారవ్వాలి. జగన్‌పై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి. క్షేత్రస్థాయినుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకే ఈ శిక్షణా తరగతులు.– తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదు ‘దేశంలో ఉండే ప్రజలకు న్యాయం జరిగేందుకు అనేక చట్టాలు ఉన్నా అమలు అంతంతమాత్రమే. రాజకీయాల్లో కులం, మతం అధిక పాత్ర పోషిస్తున్నాయి. ఇళ్లు, పింఛన్, రేషన్‌కార్డులు, రుణాలను వైఎస్ ఇచ్చారని, వాటన్నింటినీ చంద్రబాబు తీసివేశారు. ప్రశ్నిస్తే పసుపుచొక్కా వేసుకుంటేనే ఇస్తామని చెప్పడం విడ్డూరం. ఇదేనా సామాజిక న్యాయం. – బొడ్డేపల్లి నర్సింహులు, సీనియర్ దళిత నాయకులు -
'అమరావతిలో శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి'
-
'అమరావతిలో శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో వేసిన శిలాఫలకాలు ఇప్పుడు వెక్కిరిస్తున్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఏడాదవుతున్న రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చలేదని మండిపడ్డారు. సోమవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శంకుస్థాపన కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 100 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. లాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే దసరా నాటికి రాజధాని నిర్మాణాలు ఒక రూపుకొస్తాయని.. చంద్రబాబు ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని భూమన విమర్శించారు.