సాక్షి, రాయచోటి(వైఎస్సార్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో నిర్వహించిన ‘బీసీ గర్జన’ చారిత్రాత్మకమని ఆ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీసీలు భారతీయ సంస్కృతి ప్రతిరూపాలని అభివర్ణించారు. వారి అభివృద్ధికి 50 శాతం చట్టబద్ధత కల్పించడమనేది అభినందనీయమన్నారు. బీసీలు తలెత్తుకొనే విధంగా వైఎస్ జగన్ పాలన ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం రాయచోటిలో బీసీ డిక్లరేషన్‌పై హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సర్కిల్‌లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ కార్యదర్శి విజయభాస్కర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెర్లను, బోయలను ఎస్టీలోకి తీసుకవస్తామన్నారు. వైఎస్సార్ సీపీ ఇచ్చిన ప్రతీ హామీని తప్పక నెరవేర్చుతుందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్, హామీలు ప్రకటించినందుకే బాబు హడావుడిగా పలు కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతీ ముస్లిం వైఎస్సార్ సీపీ పక్షానే
తిరుపతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయితేనే బీసీ వర్గాల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భూమన మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ముస్లింలకు ఎంతో మేలు జరిగిందని.. అంతకంటే రెట్టింపు మేలు జగన్ పాలనలో జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతీ ముస్లిం వైఎస్సార్ సీపీ పక్షానే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment