సాక్షి, విజయనగరం : కరువు మండలాలన ప్రటకనలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కరువు మండలాలను కుదించడం దారుణమన్నారు. రాయలసీమలో 19శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. కరువు తాండవిస్తే భూములను వ్యాపారులకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. సాగు, తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు.
అరాచక పాలన రాజ్యమేతుతోంది : నల్లపురెడ్డి
రాష్ట్రంలో అరాచకపాలన రాజ్యమేలుతోందని వైఎస్సార్‌సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు. నాలుగున్నరేళ్లలో దోచుకోవడం తప్పా టీడీపీ చేసిందేమి లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమయిందని విమర్శించారు. త్వరలోనే చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెబుతారన్నారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Published Mon, Oct 8 2018 10:34 AM | Last Updated on Mon, Oct 8 2018 11:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment