Nallapureddy Prasannakumar Reddy
-
గడప గడపకు మన ప్రభుత్వం : నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
-
కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష.. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే
సాక్షి, కోవూరు: తనను నమ్ముకొన్న కార్యకర్తల కుటుంబాలకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అండగా నిలిచారు. కార్యకర్తలు తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన యాట అశోక్, చల్లాయపాళెం గ్రామానికి చెందిన అత్తిపాటి గోపి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇటీవల అకాల మరణం చెందారు. అశోక్‌కుమార్ కుటుంబానికి రూ.లక్ష నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రసన్న పార్టీని, తనను నమ్ముకున్న ఆ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే ప్రసన్న సోమవారం పరామర్శించి, ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష వంతున నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు బాధను తెలుసుకుంటూ ప్రసన్న కంటనీరు పెట్టుకున్నారు. ఆయన కంట కన్నీరు గమనించిన పార్టీ నేతలు సైతం భావోద్వేగానికి గురయ్యారు. తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్లే మనస్తత్వం ఎమ్మెల్యే ప్రసన్నది అని పలువురు చర్చించుకున్నారు. ఎమ్మెల్యే వెంట వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, నాయకులు యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ సతీష్ రెడ్డి, వెంకయ్య, శేషు, చరణ్, మస్తాన్ ఉన్నారు. -
టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే బాసట
సాక్షి, నెల్లూరు(కోవూరు): మండలంలోని గంగవరానికి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బాసటగా నిలిచారు. గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఇటీవల వివిధ ప్రమాదాల్లో మరణించారు. వారి కుటుంబాలను ఎమ్మెల్యే శనివారం ఆ పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.50 వేలు చొప్పున రెండు కుటుంబాలకు రూ.లక్ష నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా అందజేశారు. మండలంలోని గంగవరానికి చెందిన గంటా హరి పంచాయతీలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తు న్నాడు. ప్రమాదశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. మూడు రోజుల క్రితం గంగవరం కాలువ వద్ద ఎద్దుల బండిని టిప్పర్ ఢీకొని మృతి చెందిన చింతల వినోద్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. కుటుంబ పెద్దను కోల్పోయిన మీకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. చదవండి: (Kurnool: గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్) దిక్కుతోచని స్థితిలో ఉన్న వారు ఎవరినైనా ఆదుకొంటామని, ఇటువంటి సమయంలో రాజకీయాలు చూడమన్నారు. ఎమ్మెల్యే వెంట డీఏఏబీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షు డు నలుబోలు సుబ్బారెడ్డి, పడుగుపాడు సొసైటీ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, సర్పంచ్ యేడెం లక్ష్మీకుమారి, ఉప సర్పంచ్ గోడ మోషే, నాయకులు పాల్గొన్నారు. -
నువ్వు మగాడివైతే చిటికేసి చూడు
సాక్షి, నెల్లూరు : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దురుసుగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ నువ్వు చిటికేస్తే వైఎస్సార్ సీపీ నాయకులు రాష్ట్రంలో తిరగలేరా.. నువ్వు మగాడివైతే చిటికేసి చూడు. ఈ రాష్ట్రంలో ఏమూలకైనా వస్తా! వైఎస్సార్ సీపీ కార్యకర్తలపైన చెయ్యి వేస్తే ఊరుకునేది లేదు. సీఎం వైఎస్ జగన్ పాలనలో మేము మంత్రులము కాదు.. అంతకన్నా ముందు మేము ఆయన అభిమానులం. ముఖ్యమంత్రిపై అవాకులు పేలితే సహించం’’ అని అన్నారు. లోకేష్ ఒక బచ్చా, కుర్రకుంక: ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తాం. లోకేష్ ఒక బచ్చా, కుర్రకుంక. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండు లోకేష్. మేము మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం ఉంది. -
మాధురికి ఎమ్మెల్యే ప్రసన్న రూ. లక్ష సాయం
సాక్షి, కావలి: పట్టణంలోని ముసునూరుకు చెందిన డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి కాకర్ల మాధురిని ఆదుకునేందుకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ముందుకొచ్చారు. మాధురి బ్లడ్ కేన్సర్‌తో పోరాటం చేస్తోంది. అమ్మ, తమ్ముడు దివ్యాంగులు, తండ్రికి ప్రమాదవశాత్తూ కాలు విరగడంతో ఆ కుటుంబ దుస్థితిపై ‘అయ్యో’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి దాతల నుంచి అనూహ్య స్పందన లభించింది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరుతో నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేయనున్నామని ప్రకటించారు. ఈ ఆర్థిక సాయాన్ని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా విద్యార్థిని కుటుంబసభ్యులకు అందజేస్తామని ట్రస్ట్ చైర్మన్ ప్రసన్నకుమార్‌రెడ్డి, ట్రస్ట్ కోశాధికారి, ఎమ్మెల్యే తనయుడు నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడారు. చదువుల్లో టాపరైన విద్యారి్థని తన ప్రతిభతో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి చురుకైన విద్యార్థినికి బ్లడ్ కేన్సర్ రావడం దురదృష్టకరమని తెలిపారు. ఈ క్రమంలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాయం చేయాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. అనంతరం రజత్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థిని మాధురి వ్యాధి నుంచి కోలుకొని సమాజానికి ఉపయోగపడేలా భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. మాధురి పరిస్థితిపై ఆరోగ్యశ్రీ అధికారుల ఆరా కాకర్ల మాధురి కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స నిమిత్తం చేరింది. ఈ క్రమంలో అమరావతిలోని సీఎం కార్యాలయం నుంచి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు సదరు కార్పొరేట్ ఆస్పత్రి వర్గాలతో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు సాక్షిలో ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. ఓ పోలీస్ అ«ధికారి రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు. మాధురి చదువుతున్న డిగ్రీ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఆర్థిక సాయాన్ని అందించారు. విద్యారి్థని నివాసం ఉండే ముసునూరుకు చెందిన స్థానికులు ఆర్థిక సాయాన్ని అందజేశారు. -
‘బాబు శిష్యుడు ఎందుకు మాట్లాడటం లేదు’
సాక్షి, నెల్లూరు: శ్రీనివాస్ వద్ద దొరికిన రూ.2 వేల కోట్లపై చంద్రబాబు, లోకేష్‌లు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై వారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్, వారికి సంబంధించిన మూడు ఇన్ఫ్రా కంపెనీల్లో జరిపిన సోదాల్లో లెక్కలోకి రాని రూ.2,000 కోట్ల సొమ్మును కనుగొన్నట్లు ఐటీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు, లోకేష్ స్పందించకుండా చెంచాలతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఐటీ దాడులపై చంద్రబాబు శిష్యుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తూనే.. చంద్రబాబు నుంచి సూట్‌కేసులు తీసుకుంటున్నారు కాబోలు.. అందుకే మాట్లాడటం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి అడ్డంగా దొరికి అడ్డగోలు దాడి! -
చంద్రబాబు మాయలపకీర్
సాక్షి, నెల్లూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ మాయల ఫకీర్ అని, దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీశాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇసుక బకాసురులకు రారాజు చంద్రబాబునాయుడని ఎద్దేవా చేశారు. మండలంలోని జొన్నవాడ ఇసుకస్టాక్ యార్డు వద్ద గురువారం ఆయన ఇసుక వారోత్సవాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు బాగా కురవడంతో నదులు, రిజర్వాయర్లు నిండి జలకళ సంతరించుకుందన్నారు. ఈ నేపథ్యంలో నదుల్లో ఇసుక తీయడం కష్టతరంగా మారిందన్నారు. ఈ క్రమంలో ఇసుక రవాణాలో జాప్యం జరిగిందని తెలిపారు. కనీసం ఈ మాత్రం జ్ఞానం లేని చంద్రబాబునాయుడు ఇసుకదీక్ష పేరిట డ్రామా ఆడడం ఆరోపణలు చేయడం అవివేకమన్నారు. టీడీపీ హయాంలో జరిగినంత ఇసుకదోపిడీ ఎన్నడూ జరగలేదన్నారు. చంద్రబాబునాయుడి ఇంటి పక్కనే అనుమతులు లేకుండా ఇసుకను లారీల్లో తరలించారన్నారు. చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ వ్యాపారం జరిగిందన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిని అక్కడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన దారుణంపై చంద్రబాబునాయుడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అటువంటి నీచమైన చరిత్ర ఉన్న చంద్రబాబునాయుడు నేడు ఇసుకదీక్ష పేరిట కొత్తనాటకానికి తెరలేపాడని ఎద్దేవా చేశారు. రాజకీయ ఓటమిని తట్టుకోలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించినా చంద్రబాబునాయుడికి సిగ్గురాలేదన్నారు. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు కార్మికులపై లేనిపోని ప్రేమ ఒలకబోయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికులకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన నీచమైన సంస్కృతి అచ్చెన్నాయుడిదన్నారు. అటువంటి వ్యక్తి నేడు కార్మికుల విషయంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కార్మికశాఖా మంత్రిగా అచ్చెనాయుడు ఏం ఉద్దరించాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక చంద్రబాబునాయుడి దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పిచ్చిప్రేలాపనులు మానుకోవాలని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేలు 151 మందిని విమర్శించే స్థాయి నీకెక్కడిదని ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. 2014 నుంచి నేటి వరకు పవన్‌కల్యాణ్ చంద్రబాబు వద్ద సూట్‌కేసులు తీసుకుని ఇతర పార్టీలను విమర్శించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. గత ఐదేళ్లలో జరిగిన ఇసుక దందాలు, అవినీతిపై ఎందుకు ప్రశ్నించలేదని ఆయన పవన్‌కల్యాణ్‌పై మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్ల పవన్‌కల్యాణ్‌ను చిత్తుగా ఓడించినా సిగ్గురాలేదన్నారు. చిరంజీవి గొప్ప వ్యక్తి అని, పవన్‌కల్యాణ్ చిరంజీవిని చూసి మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. టీడీపీ చార్జిషీట్ అంతా బోగస్ ఇసుక అక్రమ రవాణా విషయంలో టీడీపీ నేతలు విడుదల చేసి చార్జిషీట్ అంతా బోగస్ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. తమ నాయకులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, కొండూరు వెంకటసుబ్బారెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి పేర్లు పెట్టారని వారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. సూరా శ్రీనివాసులురెడ్డి బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లు రీచ్‌కు సంబంధించి భాగం ఉన్నది వాస్తవమేనన్నారు. అయితే ఇక్కడ గుప్పెడు ఇసుక కూడా అక్రమ రవాణా జరగడం లేదనే విషయం టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇసుక అక్రమ రవాణా విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారన్నారు. పట్టుబడితే రూ.2లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన విషయం టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. సీఎం ఆదేశానుసారం నాయకులందరూ ఆయన మాటలను పాటిస్తున్నామని, టీడీపీ నేతలు రాజకీయ ఓటమిని ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, అధికారం పోయిందని ఇష్టానుసారం మాట్లాడితే సహించరని ఆయన తెలిపారు. ఆర్డీఓ డి. హుస్సేన్ బాషా మాట్లాడుతూ ఇసుక ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోమని ఆదేశించిందన్నారు. ఇసుక ఉత్పాదకత రోజుకు 2500 మెట్రిక్ టన్నులు ప్రస్తుతం ఉందన్నారు. వారోత్సవాల సందర్భంగా దానిని 5వేల మెట్రిక్ టన్నులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో 188 చిన్న ఇసుకరీచ్‌లను సిద్ధంగా చేస్తున్నామని తెలిపారు. మైనింగ్ ఏడీ వెంకటేశ్వర్లురెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 12 ఇసుకరీచ్‌లకు గాను 8 రీచ్‌లు పనిచేస్తున్నాయన్నారు. గతంలో ఇసుకను బయట జిల్లాలకు సరఫరా జరిగేదని, నేడు జిల్లా ప్రజలకే పరిమితం చేశారని తెలిపారు. ఏపీఎండీసీ డీజీఎం వెంకటరమణ మాట్లాడుతూ గతంలో ఇసుక సరఫరా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేదని, నేడు రాత్రి 10 గంటల వరకు రవాణా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ సురేష్‌బాబు, ఎస్సై జిలానీబాషా, ఎంపీడీఓ డీవీ నరసింహారావు, డిప్యూటీ తహసీల్దార్ తులసీమాల, ఐకేపీ ఏపీఎం లలిత, వైఎస్సార్సీపీ నాయకులు సూరా శ్రీనివాసులురెడ్డి, నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఇప్పగుంట విజయ్‌భాస్కర్‌రెడ్డి, చెర్లో సతీష్‌రెడ్డి, గుమ్మా సుధాకరయ్య, మోహన్ మురళీకృష్ణ, సుధాకరయ్య, నాగేశ్వరరావు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అక్రమార్కుల భరతం పడతాం
సాక్షి, కొడవలూరు: ఇరిగేషన్, ఉపాధిహామీ పనుల్లో గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో నీరు–చెట్టు పథకంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు. విచారణలో అవినీతిని నిగ్గుతేల్చి అక్రమార్కుల భరతం పడతామన్నారు. నీరు–చెట్టులోని అవినీతి కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ఎంతో మంది అధికారులు బలయ్యారని తెలిపారు. ఉపాధి పనుల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని, వీటిపై తహసీల్దార్, ఎంపీడీఓలతో విచారణ జరిపిస్తామన్నారు. గతంలో జరిగిన అవినీతికి, ఏకపక్ష నిర్ణయాలకు విసిగిపోయిన ప్రజలు తనను 40వేల మెజార్టీతో గెలిపించారన్నారు. గత ప్రభుత్వం మహిళా తహసీల్దార్‌పై ప్రజాప్రతినిధి దాడికి పాల్పడిన చర్యలు తీసుకోకుండా నిరంకుశంగా వ్యవహరించిందన్నారు. ప్రభుత్వ వైద్యులు మండల కేంద్రాల్లోనే నివాసం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో వైద్యులు మానవతతో వ్యవహరించాలన్నారు. ఊటుకూరులో బోరు బావిలో పడిన బాలికను కొనఊపిరితో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు అందుబాటులో లేరన్నారు. అనంతరం కోవూరు వైద్యశాలకు తీసుపోయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్యులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అమ్మఒడి పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇప్పటికీ గిరిజనులు బడులకు పోవడం లేదని తెలిపారు. ఎంఈఓ, ఐసీడీఎస్, పంచాయతీ కార్యదర్శులు సమైక్యంగా కృషి చేసి అమ్మఒడిని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రతీబిడ్డా చదివేలా చేయాలన్నారు. గృహనిర్మాణ శాఖలో లబ్ధిదారులను ముప్పతిప్పలు పెట్టారన్నారు. అందువల్లే గృహాలన్నీ వివిధ దశల్లో నిలిచిపోయి ఉన్నాయన్నారు. సమావేశం ప్రారంభమైనా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అందుబాటులోకి రాకపోవడంపై ఆయన స్పందిస్తూ పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఎంపీపీ నల్లావుల వెంకమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తహసీల్దార్ ఎన్వీ ప్రసాద్, ఎంపీడీఓ డీవీ నరసింహారావు, వైస్‌ఎంపీపీ కొండా శ్రీనివాసులురెడ్డి, ఎంఈఓ వసంతకుమారి, వైద్యాధికారులు రామకృష్ణ, సుచిత్ర, ఎస్సై శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆరోసారి అసెంబ్లీకి
సాక్షి, నెల్లూరు సిటీ : స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనయుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోసారి అసెంబ్లీలోకి నేడు అడుగుపెట్టనున్నారు. కోవూరు ఎమ్మెల్యేగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమరావతిలోని సచివాలయంలో ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఘన విజయం కోవూరు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నల్లపరెడ్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. నాడు నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి వరుసగా మూడు సార్లు కోవూరు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. తండ్రి మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇప్పటికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. తాజాగా 39,891 ఓట్ల మెజార్టీతో గెలుపొంది కోవూరు నియోజకవర్గ చరిత్రలో ఘన విజయాన్ని కైవసం చేసుకున్నారు. -
చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారు
-
‘చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారు’
సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారుతారని వైఎస్సార్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు ఏ హమీ నెరవేర్చలేదన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆరోపించారు. నవరత్నాల్లోని రూ.2వేల పింఛన్ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారన్నారు. చంద్రబాబు కుట్రలు, మోసాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఏపీని అభివృద్ధి చేయటంలో చంద్రబాబు వైఫల్యం చెందారన్నారు. రాష్ట్ర పర్యటనలో వైఎస్ జగన్ ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరధం పట్టారని తెలిపారు. వైఎస్ జగన్ తన పాదయాత్రలో అన్ని వర్గాలకు భరోసా కల్పించారని వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే ప్రజా సంక్షేమం సాధ్యం అవుతుందన్నారు. -
‘కరువు మండలాలను కుదించడం దారుణం’
సాక్షి, విజయనగరం : కరువు మండలాలన ప్రటకనలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కరువు మండలాలను కుదించడం దారుణమన్నారు. రాయలసీమలో 19శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. కరువు తాండవిస్తే భూములను వ్యాపారులకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. సాగు, తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. అరాచక పాలన రాజ్యమేతుతోంది : నల్లపురెడ్డి రాష్ట్రంలో అరాచకపాలన రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు. నాలుగున్నరేళ్లలో దోచుకోవడం తప్పా టీడీపీ చేసిందేమి లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమయిందని విమర్శించారు. త్వరలోనే చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెబుతారన్నారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘చంద్రబాబు దోచేస్తారు.. లోకేష్ దాచేస్తారు’
సాక్షి, నెల్లూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దోచుకో-దాచుకో పథకం సాగుతోందని వైఎస్సార్సీసీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తండ్రి చంద్రబాబు దోచేస్తుంటే.. ఆయన తనయుడు, ఏపీ మంత్రి లోకేష్ దాచేస్తున్నారని కోలగట్ల ఆరోపించారు. శనివారం నెల్లూరులో వైఎస్సార్సీసీ ఆధ్వర్యంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు గొప్ప నటుడని ఆయనతో మహా నటుడు సినిమా తీయాలన్నారు. రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ బాత్రూం నుంచి రాహూల్ బెడ్రూంలోకి.. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బాత్రూం నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయధ్యక్షుడు రాహుల్‌ల్ గాంధీ బెడ్రూంలోకి వెళ్లాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమన్నారు. నవనిర్మాణ దీక్ష పేరుతో కొత్త డ్రామా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. నాలుగేళ్లు ఏపీ ప్రజలను మోసం చేసిన అనంతరం ఇప్పుడు హోదా రాగం అందుకుని బీజేపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
ఐటీ దాడులు చేస్తే సీఎం దొరికిపోతారు
బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు): రాష్ట్రంలో ఐటీ దాడులు నిర్వహిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతిపరులందరూ దొరికిపోతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో గురువారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేష్ నాయకత్వంలో సాగుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలు మోదీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మోదీ అంటే ప్రజలకు గౌరవం ఉందని, చంద్రబాబు విషయంలో వెనకడుగు వేయడంపై బాధపడుతున్నారని చెప్పారు. ఏపీలో ఇటీవల రూ.వెయ్యి కోట్ల విద్యుత్ కుంభకోణం వెలుగు చూసిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదనలను సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరస్కరించినా కేబినెట్ ఆమోదించడం దారుణమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతలు, కార్యకర్తలు నరకం అనుభవిస్తున్నారన్నారు. దుర్గమ్మ సాక్షిగా చంద్రబాబునాయుడు అబ్ధదాల కోరుగా మారాడన్నారు. తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధిని స్వాగతిస్తారని, అవినీతి, అక్రమాలను మాత్రమే నిలదీస్తారని తెలిపారు. రాష్ట్రానికి అతిపెద్ద దుష్టశక్తి చంద్రబాబేనన్నారు. కేసు పెడితే చాలు కోర్టుల నుంచి స్టే తెచ్చుకుంటాడని, తనపై విచారణ జరిపించుకునే దమ్ము ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఇప్పటికైనా రాష్ట్రాన్ని దోచుకుతింటున్న చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని నల్లపరెడ్డి కోరారు. -
చంద్రబాబు చెంచాలకు ఉలుకెందుకు?: నల్లపరెడ్డి
నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు ఆరాచక పాలన ఈనాటిది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను వంచించడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. నయవంచక పాలన బాబు నైజం అని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నంద్యాల బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సీఎం చంద్రబాబు గురించి పొరపాటుగా ఏమీ మాట్లాడలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి వంచించినందుకు ప్రజాక్షేత్రంలో ప్రజలే కాల్చి చంపినా ఫరవాలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రజల తరపున మాట్లాడారని చెప్పారు. హామీలను అమలు చేయాలని నిలదీస్తే చంద్రబాబుకు, ఆయన చెంచాలకు ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ధ్వజమెత్తారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. వారంతా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అవాకులు, చవాకులు పేలడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సమస్యలను గాలికొదిలిన నాయకులను ప్రజలు మట్టి కరిపించడం ఖాయమని స్పష్టం చేశారు.