
సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారుతారని వైఎస్సార్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు ఏ హమీ నెరవేర్చలేదన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆరోపించారు. నవరత్నాల్లోని రూ.2వేల పింఛన్ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారన్నారు.
చంద్రబాబు కుట్రలు, మోసాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఏపీని అభివృద్ధి చేయటంలో చంద్రబాబు వైఫల్యం చెందారన్నారు. రాష్ట్ర పర్యటనలో వైఎస్ జగన్ ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరధం పట్టారని తెలిపారు. వైఎస్ జగన్ తన పాదయాత్రలో అన్ని వర్గాలకు భరోసా కల్పించారని వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే ప్రజా సంక్షేమం సాధ్యం అవుతుందన్నారు.