
సాక్షి, నెల్లూరు: శ్రీనివాస్ వద్ద దొరికిన రూ.2 వేల కోట్లపై చంద్రబాబు, లోకేష్‌లు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై వారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్, వారికి సంబంధించిన మూడు ఇన్‌ఫ్రా కంపెనీల్లో జరిపిన సోదాల్లో లెక్కలోకి రాని రూ.2,000 కోట్ల సొమ్మును కనుగొన్నట్లు ఐటీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు, లోకేష్ స్పందించకుండా చెంచాలతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఐటీ దాడులపై చంద్రబాబు శిష్యుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తూనే.. చంద్రబాబు నుంచి సూట్‌కేసులు తీసుకుంటున్నారు కాబోలు.. అందుకే మాట్లాడటం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చదవండి: ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment