
సాక్షి, నెల్లూరు : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దురుసుగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ నువ్వు చిటికేస్తే వైఎస్సార్ సీపీ నాయకులు రాష్ట్రంలో తిరగలేరా.. నువ్వు మగాడివైతే చిటికేసి చూడు. ఈ రాష్ట్రంలో ఏమూలకైనా వస్తా! వైఎస్సార్ సీపీ కార్యకర్తలపైన చెయ్యి వేస్తే ఊరుకునేది లేదు. సీఎం వైఎస్ జగన్ పాలనలో మేము మంత్రులము కాదు.. అంతకన్నా ముందు మేము ఆయన అభిమానులం. ముఖ్యమంత్రిపై అవాకులు పేలితే సహించం’’ అని అన్నారు.
లోకేష్ ఒక బచ్చా, కుర్రకుంక: ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తాం. లోకేష్ ఒక బచ్చా, కుర్రకుంక. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండు లోకేష్. మేము మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment