బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు): రాష్ట్రంలో ఐటీ దాడులు నిర్వహిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతిపరులందరూ దొరికిపోతారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో గురువారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేష్ నాయకత్వంలో సాగుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలు మోదీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మోదీ అంటే ప్రజలకు గౌరవం ఉందని, చంద్రబాబు విషయంలో వెనకడుగు వేయడంపై బాధపడుతున్నారని చెప్పారు. ఏపీలో ఇటీవల రూ.వెయ్యి కోట్ల విద్యుత్ కుంభకోణం వెలుగు చూసిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదనలను సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరస్కరించినా కేబినెట్ ఆమోదించడం దారుణమని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతలు, కార్యకర్తలు నరకం అనుభవిస్తున్నారన్నారు. దుర్గమ్మ సాక్షిగా చంద్రబాబునాయుడు అబ్ధదాల కోరుగా మారాడన్నారు. తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధిని స్వాగతిస్తారని, అవినీతి, అక్రమాలను మాత్రమే నిలదీస్తారని తెలిపారు. రాష్ట్రానికి అతిపెద్ద దుష్టశక్తి చంద్రబాబేనన్నారు. కేసు పెడితే చాలు కోర్టుల నుంచి స్టే తెచ్చుకుంటాడని, తనపై విచారణ జరిపించుకునే దమ్ము ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఇప్పటికైనా రాష్ట్రాన్ని దోచుకుతింటున్న చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని నల్లపరెడ్డి కోరారు.
ఐటీ దాడులు చేస్తే సీఎం దొరికిపోతారు
Published Fri, Sep 29 2017 2:51 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM
Advertisement
Advertisement