
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు(కోవూరు): మండలంలోని గంగవరానికి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బాసటగా నిలిచారు. గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఇటీవల వివిధ ప్రమాదాల్లో మరణించారు. వారి కుటుంబాలను ఎమ్మెల్యే శనివారం ఆ పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.50 వేలు చొప్పున రెండు కుటుంబాలకు రూ.లక్ష నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా అందజేశారు.
మండలంలోని గంగవరానికి చెందిన గంటా హరి పంచాయతీలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తు న్నాడు. ప్రమాదశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. మూడు రోజుల క్రితం గంగవరం కాలువ వద్ద ఎద్దుల బండిని టిప్పర్ ఢీకొని మృతి చెందిన చింతల వినోద్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. కుటుంబ పెద్దను కోల్పోయిన మీకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.
చదవండి: (Kurnool: గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్)
దిక్కుతోచని స్థితిలో ఉన్న వారు ఎవరినైనా ఆదుకొంటామని, ఇటువంటి సమయంలో రాజకీయాలు చూడమన్నారు. ఎమ్మెల్యే వెంట డీఏఏబీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షు డు నలుబోలు సుబ్బారెడ్డి, పడుగుపాడు సొసైటీ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, సర్పంచ్ యేడెం లక్ష్మీకుమారి, ఉప సర్పంచ్ గోడ మోషే, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment