
కోలగట్ల వీరభద్రస్వామి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, తమ్మినేని సీతారాం
సాక్షి, నెల్లూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దోచుకో-దాచుకో పథకం సాగుతోందని వైఎస్సార్‌సీసీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తండ్రి చంద్రబాబు దోచేస్తుంటే.. ఆయన తనయుడు, ఏపీ మంత్రి లోకేష్ దాచేస్తున్నారని కోలగట్ల ఆరోపించారు. శనివారం నెల్లూరులో వైఎస్సార్‌సీసీ ఆధ్వర్యంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు గొప్ప నటుడని ఆయనతో మహా నటుడు సినిమా తీయాలన్నారు. రెండెకరాల నుంచి రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మోదీ బాత్‌రూం నుంచి రాహూల్ బెడ్‌రూంలోకి..
చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక‍్తి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బాత్‌రూం నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయధ్యక్షుడు రాహుల్‌ల్ గాంధీ బెడ్‌రూంలోకి వెళ్లాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమన్నారు.
నవనిర్మాణ దీక్ష పేరుతో కొత్త డ్రామా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. వంచనపై గర్జన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. నాలుగేళ్లు ఏపీ ప్రజలను మోసం చేసిన అనంతరం ఇప్పుడు హోదా రాగం అందుకుని బీజేపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment