కరువు మండలాలన ప్రటకనలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కరువు మండలాలను కుదించడం దారుణమన్నారు. రాయలసీమలో 19శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. కరువు తాండవిస్తే భూములను వ్యాపారులకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. సాగు, తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు.